
భరత్ చాలా సరదాగా ఉండేవాడు
భరత్ నాకు వెరీ క్లోజ్. చాలా సరదాగా ఉండేవాడు. స్నేహితుల్లా ఉండేవాళ్లం. మంచీ చెడూ చెప్పుకునేవాళ్లం. కొన్ని విషయాలు తన లైఫ్‌ని డిస్ట్రబ్ చేశాయి. వాటికి దూరంగా మామూలు మనిషిలా ఉండాలనుకునేవాడు. ఏం చేస్తాం? జరగరానిది జరిగిపోయింది. భార్యతో తను ఓ పదిహేను– పదహారేళ్లు కలిసి ఉండుంటాడు. ఆ తర్వాత విడిపోయారు.
పిల్లలు కూడా లేరు. బాధ, సంతోషం ఏదైనా మాతోనే. నాకిద్దరు కొడుకులు. నా చిన్న కొడుకు, రవి అన్నయ్య అబ్బాయికి భరత్ బాగా క్లోజ్. పిల్లలందరితోనూ బాగుండేవాడు. మూడ్ బాగా లేకపోతే నవ్వించడానికి ట్రై చేసేవాడు. భరత్ పోయిన బాధలో మేం ఉంటే.. ఎవరూ లేనివాడిలా తనను సాగనంపామని రాశారు. బాధ అనిపించింది. ఓ ఇంట్లో జరగకూడనిది జరిగినప్పుడు ఇంటిల్లిపాదీ బాధలో ఉంటారు. ఇలాంటి సమయంలో అసత్యాలు రాయడం బాధ అనిపించింది. – రఘు