భరత్ చౌదరి, ప్రియాంక నాంది జంటగా జె. మోహన్ కాంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిషన్ 007’. మహంకాళీ పిక్చర్స్ పతాకంపై మహంకాళీ నాగ మహేశ్ నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌లో మోహన్ కాంత్ మాట్లాడుతూ–‘‘యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన చిత్రం ‘మిషన్ 007’. మా నిర్మాత నాగమహేశ్‌గారికి ఇది తొలి సినిమా. బడ్జెట్ చెప్పిన దానికన్నా ఎక్కువ అయినా ఎక్కడా రాజీ పడలేదు.. అందరికీ నచ్చే మూవీ ఇది’’ అన్నారు. నాగమహేశ్ మాట్లాడుతూ– ‘‘యూనిట్ మొత్తం తమ సొంత సినిమాలా భావించి పనిచేశారు.
మా చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. మాకు అన్ని విధాలా సహకరించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని చెప్పారు. ‘‘మోహన్ గారు కథ చెప్పినప్పుడు ఆర్మీ నేపథ్యం అనగానే భయం వేసింది. కానీ, ఆయన నమ్మకం చూసి ధైర్యంగా నటించాను’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘వాణిజ్య అంశాలతో పాటు దేశభక్తి కూడా ఉండటం మా సినిమాకు గర్వకారణం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంక నాంది.
Comments
Please login to add a commentAdd a comment