Anni Manchi Sakunamule Movie Trailer Released Today - Sakshi
Sakshi News home page

Anni Manchi Sakunamule Movie: 'అన్నీ మంచి శకునములే'.. ఆసక్తిగా ట్రైలర్

Published Fri, May 12 2023 7:55 PM | Last Updated on Fri, May 12 2023 8:11 PM

Anni Manchi Sakunamule Movie Trailer Released Today - Sakshi

సంతోష్‌ శోభన్, మాళవికా నాయర్‌ జంటగా నటించిన చిత్రం 'అన్నీ మంచి శకునములే'. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ టైగర్‌ జూనియ‍ర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 

(ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?)

ట్రైలర్ చూస్తే ఫుల్ ఫ్యామీలీ ఓరియంటెడ్ చిత్రంగా కనిపిస్తోంది. పిల్లల, తల్లిదండ్రుల మధ్య ఎమోషన్స్‌ ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఎమోషన్స్‌తో కామెడీ సీన్స్‌ కూడా నవ్వులు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేశ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. 

(ఇది చదవండి: రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement