Santosh sobhan
-
టాలీవుడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.. ఈ సారి డబుల్ మ్యాడ్!
టాలీవుడ్లో యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం మ్యాడ్. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీతోనే ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. మ్యాడ్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరోసారి ఆడియన్స్‌ను నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మ్యాడ్ స్వ్కేర్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్)ఈ చిత్రంలోనూ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కూడా పంచెకట్టులో కనిపించారు. పోస్టర్ చూస్తుంటే మ్యాడ్‌ను తలదన్నేలా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. This time it’ll be MAD MAXX!! 😎🤘🏻Here’s the First Look of #MADSquare 🕺First single coming out on 20th September 🤩🔥#ThisTimeItsMADMAXX 💥@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin @SangeethShobhan #RamNitin #BheemsCeciroleo @NavinNooli… pic.twitter.com/Bzod0AzKLo— Sithara Entertainments (@SitharaEnts) September 18, 2024 -
క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్ ఛాన్స్
బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేత్తడి అనే యూట్యూబ్ చానల్ ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ సీజన్-4 ఆఫర్ అందుకున్నఆమె టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. తర్వాత ఆమె పలు షోలలో మెరిసింది. కానీ కొంత కాలంగా ఆమె బుల్లితెరకు దూరంగానే ఉంటూ వస్తుంది. తాజాగా అలేఖ్య హారిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందులో యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన కథానాయకుడు కాగా ఆయనకు జోడీగా ఆలేఖ్య హారిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బేబీ మేకర్స్ నిర్మాత SKN, డైరెక్టర్ సాయి రాజేష్‌లు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు టాక్. సాయి రాజేష్ ఇప్పటికే బేబీ సనిమాతో యూట్యూబర్ వైష్ణవి చైతన్యకు బిగ్ ఛాన్స్ ఇచ్చాడు. యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హారికను హీరోయిన్గా సాయి రాజేష్ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. రేపు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాలకు బెస్ట్ ఆప్షన్‌గా సంతోష్ శోభన్ ఉన్నారు. ఆతనితో తెరికెక్కించిన ప్రతి సినిమా మినిమమ్ ఆడియన్స్‌కు రీచ్ అవుతుందని తెలిసిందే. బిగ్‌బాస్ నుంచి వచ్చాక హారిక సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది. తర్వాత కొద్దిరోజులకే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదరు. కానీ సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, హాట్‌హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంది. ఈ సినిమా ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతే ఆమెకు మళ్లీ పలు ఛాన్స్‌లు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా
ఓ రేంజులో హిట్ అయితే తప్పితే తెలుగు సినిమాలన్నీ దాదాపు నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని మాత్రం అందరూ మర్చిపోయిన తర్వాత స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా అలానే థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన చిత్రం... ఆల్మోస్ట్ రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో రిలీజైంది? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు) ఈ సినిమా సంగతేంటి? తెలుగు యంగ్ హీరోల్లో సంతోశ్ శోభన్ ఒకడు. హిట్ కోసం చాన్నాళ్ల నుంచి కష్టపడుతున్నాడు. అలా ఆగస్టు 18న తను నటించిన 'ప్రేమ్ కుమార్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. పెళ్లి కూతురు లేచిపోతే పీటల మీద ఓ పెళ్లి కొడుకు మిగిలిపోతాడు. అలాంటి పెళ్లి కొడుకు కథే ఈ ప్రేమ్ కుమార్. అయితే కాన్సెప్ట్ పరంగా కొత్తగా ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి చూసేయొచ్చు. ఏ ఓటీటీలో? సంతోశ్ శోభన్, రుచిత సాధినేని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. శుక్రవారం(అక్టోబరు 13) నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోయింది. ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏదైనా తెలుగు సినిమా చూద్దామని అనుకుంటే 'ప్రేమ్ కుమార్'ని ట్రై చేయొచ్చు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
‘ప్రేమ్ కుమార్ ’మూవీ రివ్యూ
టైటిల్ : ప్రేమ్ కుమార్ నటీనటులు : సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్ తదితరులు నిర్మాణ సంస్థ: సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత: శివప్రసాద్ పన్నీరు రచన, దర్శకత్వం: అభిషేక్ మహర్షి సంగీతం: ఎస్. అనంత్ శ్రీకర్ సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం విడుదల తేది: ఆగస్ట్ 18, 2023 కథేంటంటే.. ప్రేమ్ కుమార్(సంతోష్ శోభన్), నేత(రాశి సింగ్)కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. కాసేపట్లో మూడు ముళ్లు పడతాయనగా.. మండపంలోకి రైజింగ్ స్టార్ రోషన్ బాబు(కృష్ణ చైతన్య) వచ్చి పెళ్లి ఆపేస్తాడు. నేత్రని ప్రేమిస్తున్నాని చెప్పి.. మండపంలో నుంచి ఆమెను తీసుకెళ్తాడు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్‌కి పిల్ల దొరకదు. పెళ్లి చూపులకు వెళ్లడం.. క్యాన్సిల్ అవ్వడం ఇదే తంతు. చివరకు పెళ్లిపై విరక్తి వచ్చి.. స్నేహితుడు సుందరలింగం(కృష్ణ తేజ)తో కలిసి ‘పీకే డిటెక్టివ్ ఏజెన్సీ’ని స్టార్ట్ చేస్తాడు. లవర్స్‌ని విడగొట్టడం..పెళ్లి క్యాన్సిల్ చేయడం.. భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటే..వారిని దూరం చేయడం వీళ్ల పని. భార్యలపై అనుమానం చాలా మంది ‘పీకే డిటెక్టివ్ ఏజెన్సీ’ని కలుస్తారు. ఇలా డబ్బలు సంపాదిస్తూ ఆనందంగా ఉంటున్న ప్రేమ్ కుమార్ జీవితంలోకి మళ్లీ నేత్ర వస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? రైజింగ్ స్టార్ రోషన్, నేత్రను కాదని అంగనా(రుచితా సాధినేని)ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యాడు? విషయం తెలుసుకున్న నేత్ర ఏం చేసింది? నేత్ర పెళ్లి చెడగొట్టమని ప్రేమ్ కుమార్‌తో డీల్ కుదుర్చుకున్నదెవరు? ఇంతకీ ప్రేమ్ కుమార్‌కి పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ప్రేమ్ కుమార్ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ ‘చాలా సినిమాల్లో క్లైమాక్స్‌లో పెళ్లి జరుగుతుంటుంటే హీరో వచ్చి.. హీరోయిన్ తండ్రికి నాలుగు నీతి వ్యాఖ్యాలు చెప్పడం.. అతను ఎమోషనల్ అయి తన కూతురిని హీరోకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. కానీ అక్కడ ఒకడు మాత్రం అలా బొమ్మలా నిలబడిపోతాడు. వాడి పరిస్థితి ఏంటి? ఎంత మందికి కార్డులిచ్చాడో.. ఎన్ని అప్పులు చేశాడో..బట్టలు ఎలా కొనుకున్నాడో?.. అనే విషయాలను ఎవరూ పట్టించుకోరు. అలాంటి వాడిపై దర్శకుడు అభిషేక్ చేసిన సినిమానే ‘ప్రేమ్ కుమార్’. వినడానికి ఇది ఆసక్తికరమైన పాయింటే అయినా..దానిని తెరపై చూపించడం దర్శకుడు కాస్త తడబడ్డాడు.అభిషేక్ మహర్షి రాసుకున్న కథలో విషయం ఉంది కానీ కథనం మాత్రం అంత ఆసక్తికరంగా ముందుకు సాగదు. ప్రేమ్ కుమార్, నేత్రల పెళ్లి ఆగిపోయే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఎలాంటి సాగదీత లేకుండా తొలి సీన్‌తోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది చూపించాడు. హీరో పెళ్లి కోసం తల్లి తాపత్రాయపడడం.. అవి క్యాన్సిల్ అవడం..మధ్యలో మందు పార్టీ.. ఇలా రొటీన్ సన్నివేశాలతో కథనం ముందుకు సాగుతుంది. ‘పీకే డిటెక్టివ్ ఏజెన్సీ’ ఏర్పాటు చేసిన తర్వాత కథపై కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది. అక్కడ కూడా కామెడీకి చాలా స్కోప్ ఉన్నా..దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. అంగనా పాత్ర ఎంట్రీతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత కథనం ఎలా సాగుతుందో ఊహించొచ్చు. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది కానీ ప్రధాన పాత్రల మధ్య ఉన్న సంఘర్షణను బలంగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఈ సినిమా థియేటర్లో ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. ఓటీటీ ప్రేక్షకులను కాస్త ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది. ఇక నటీనటుల విషయాలకొస్తే.. ఎప్పటిమాదిరే సంతోష్ శోభన్ తన న్యాచురల్ యాక్టింగ్‌తో ప్రేమ్ కుమార్ పాత్రకు న్యాయం చేశాడు. కృష్ణతేజతో కలిసి చేసే కామెడి హిలేరిస్‌గా ఉంటుంది. నేత్రగా రాశి సింగ్, అంగనాగా రుచితా సాధినేని ఉన్నంతలో చక్కగా నటించారు. ఇక హీరో మేనేజర్ డాడీ పాత్రలో సుదర్శన్ పండించిన కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. హీరో రోషన్ బాబుగా కృష్ణ చైతన్య పర్వాలేదు. హీరో తల్లిగా సురభి ప్రభావతి, హీరోయిన్ తండ్రిగా రాజ్ మాదిరాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు. -
అమెజాన్ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న ‘అన్నీ మంచి శకునములే’
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ నిర్మాణంలో మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. ఈ ఏడాది మే 18న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కానీ ఓటీటీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. (చదవండి: సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్, ఆ బాధ్యత చిరంజీవిదేనట!) జూన్17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్క్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రైమ్ వీడియోలో స్క్రీమింగ్ అవుతున్న అన్ని చిత్రాల్లో తమ చిత్రం టాప్ ట్రెండింగ్‌లో నిచిలినట్లు చిత్రబృందం పేర్కొంది. అమెజాన్ ప్రైమ్‌లో రికార్డు అవర్స్ స్రీమింగ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా అన్నీ మంచి శకునములే నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. 'అన్నీ మంచి శకునములే' కథేంటంటే.. ప్రసాద్( రాజేంద్ర ప్రసాద్), దివాకర్(రావు రమేశ్) కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో కాఫీ ఎస్టేట్ని ప్రారంభిస్తారు. అక్కడి కాఫీని క్వీన్ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది. దీంతో ఆ కాఫీ ఎస్టేట్ బాగా ఫేమస్ అవుతుంది. కొన్నాళ్లకు పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి కోర్టుకెక్కుతారు. ఆ కేసు నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది. మరోవైపు దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేశ్)కు కొడుకు రిషి(సంతోష్ శోభన్) పుడతాడు. అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య(మాళవిక నాయర్) జన్మిస్తుంది. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో రిషి, సుధాకర్ ఇంట్లో ఆర్య పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు. ఒక్కసారి బిజినెస్ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి తన ప్రేమ విషయాన్ని ఆర్యతో చెప్పాడా లేదా? ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్ అయింది? తమ పిల్లలు మారిపోయారనే విషయం తెలిశాక అటు ప్రసాద్, ఇటు సుధాకర్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కాఫీ ఎస్టేట్ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది? అనేదే మిగతా కథ. -
ఓటీటీలోకి 'అన్నీ మంచి శకునములే'..స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది మే 18న విడుదలై తొలి రోజు నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. థియేటర్స్ ఆడియన్స్‌ని మెప్పించలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయింది. జూన్ 17 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ప్రైమ్ వీడియో ఓ ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ‘అన్ని మంచి శకునములే’ కథేంటంటే.. ప్రసాద్( రాజేంద్ర ప్రసాద్), దివాకర్(రావు రమేశ్) కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో కాఫీ ఎస్టేట్ని ప్రారంభిస్తారు. అక్కడి కాఫీని క్వీన్ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది. దీంతో ఆ కాఫీ ఎస్టేట్ బాగా ఫేమస్ అవుతుంది. కొన్నాళ్లకు పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి కోర్టుకెక్కుతారు. ఆ కేసు నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది. మరోవైపు దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేశ్)కు కొడుకు రిషి(సంతోష్ శోభన్) పుడతాడు. అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య(మాళవిక నాయర్) జన్మిస్తుంది. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో రిషి, సుధాకర్ ఇంట్లో ఆర్య పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు. ఒక్కసారి బిజినెస్ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి తన ప్రేమ విషయాన్ని ఆర్యతో చెప్పాడా లేదా? ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్ అయింది? తమ పిల్లలు మారిపోయారనే విషయం తెలిశాక అటు ప్రసాద్, ఇటు సుధాకర్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కాఫీ ఎస్టేట్ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది? అనేదే మిగతా కథ. an intense tale of love that challenges a longstanding family rivalry! 🔥#AnniManchiSakunamule, June 17 pic.twitter.com/KGUYq4ZuwO — prime video IN (@PrimeVideoIN) June 15, 2023 -
‘అన్నీ మంచి శకునములే' మూవీ ట్విటర్ రివ్యూ
యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ నిర్మాణంలో మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలు కూడా సినిమా పై హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు (మే 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉంది? నందిని రెడ్డి మరో హిట్ కొట్టారా? లేదా? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌పై సునిశిత్ అనుచిత వ్యాఖ్యలు) ట్విటర్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొన్ని సన్నివేశాలు బాగున్నా.. కథలో బలం లేదని అంటున్నారు. అలాగే స్క్రీన్‌ప్లే కూడా చాలా స్లోగా ఉన్నాయి అంటున్నారు. కొన్ని సన్నివేశాలు చాలా హిలేరిస్‌గా ఉన్నాయట. సంతోష్ కామెడీ టైమింగ్ బాగుందని కామెంట్ చేస్తున్నారు. #AnniManchiSakunamule : “Boring to the Core” 👉Rating : 2.25/5 ⭐️ ⭐️ Positives: 👉Better Second Half Negatives: 👉Boring First Half 👉1950’s Story 👉Dragged Scenes & Narration 👉Songs & BGM#SantoshShoban #MalvikaNair — PaniPuri (@THEPANIPURI) May 18, 2023 అన్నీ మంచి శకునములే మూవీ బోరింగ్ ఫిల్మ్. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. నెరేషన్ బాలేదు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోదంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు. #AnniManchiSakunamule A Family Entertainer that had its moments but falters with the overall execution. Has a few decent comedy scenes/feel good moments but the rest is totally dragged out with a lengthy runtime and snail paced narration in many parts. Mediocre! Rating: 2.5/5 — Venky Reviews (@venkyreviews) May 18, 2023 అన్నీ మంచి శకునములే మూవీ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ అనుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో టీమ్ తడబడింది. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. కథనం నెమ్మదిగా సాగడం, రన్ టైమ్ ఎక్కువగా ఉండడంతో సాగదీతగా అనిపిస్తుంది అంటూ మరో నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చాడు. #AnniManchiSakunamule Positives:Movie concept explored is really good. Marriage traditions are well picturised. There were a few scenes, including the climax and initial portion that stood out. Reach Production values. Negatives:Lead pair's drama fell flat. Slow paced narration. — America Cini Pandits (@CiniPandits) May 18, 2023 #AnniManchiSakunamule disappoint chesindi. Moments lo shine avthadi cinema. There are some good laugh out loud moments, there are some good dramatic moments but overall ga cinema for the most part flat ga potha untadi. Oka climax lo thappithe never did the movie manage to make.. pic.twitter.com/E8aPL6CTUh — Likith (@likitongue) May 18, 2023 Overall: #AnniManchiSakunamule is a misfired family drama with dragged out screenplay and low on emotions. Few hilarious scenes with #VennelaKishore. Below par music and bgm. Predictable and boring. Rating: 2/5 #SanthoshSobhan#MalavikaNair#NandiniReddy pic.twitter.com/vuwYKmehhC — TFI Talkies (@TFITalkies) May 18, 2023 #AnniManchiSakunamule 1st Half Review: ⭐️some comedy scenes ⭐️breezy feel 👎🏼very slow screenplay 👎🏼Lot of boring scenes Need a bug second half!!#NandiniReddy #AnniManchiShakunamule pic.twitter.com/JI2xAlP6Ot — ReviewMama (@ReviewMamago) May 18, 2023 FirstHalf: Dragged out #AnniManchiSakunamule life drama. Few laughs here and there, average songs and bgm. Story is flat nothing clicks till the interval.#AMS #SanthoshSobhan#malavikanair #NandiniReddy #MickeyJMeyer #swapnacinemas — TFI Talkies (@TFITalkies) May 18, 2023 #AnniManchiSakunamule movie is a winner again for @SwapnaCinema.But there is lot to look at I'm literally not convinced at climax something is missing. Emotionally I was connected through climax but there should be some conflict emotion between hero and heroine. — Rowdy boy (@devarakonda7007) May 17, 2023 -
‘అన్నీ మంచి శకునములే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అవసరం తీరాక ఎంత డబ్బు సంపాదించినా చిత్తు కాగితమే నాన్న'.. ఆసక్తిగా ట్రైలర్
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం 'అన్నీ మంచి శకునములే'. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?) ట్రైలర్ చూస్తే ఫుల్ ఫ్యామీలీ ఓరియంటెడ్ చిత్రంగా కనిపిస్తోంది. పిల్లల, తల్లిదండ్రుల మధ్య ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఎమోషన్స్‌తో కామెడీ సీన్స్ కూడా నవ్వులు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేశ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు) -
‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి
‘సిల్వర్ స్క్రీన్‌పై ఆర్టిస్టులు నటిస్తారు. కానీ మనుషులుగా మనందరం నిత్యం విభిన్నమైన సందర్భాలు, పరిస్థితుల్లో నటిస్తుంటాం. సో.. మనందరం నటులమే. ఇరవయ్యేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చినా నేను భయపడలేదు. సెట్స్‌లో ఎక్కువగా టేక్స్ తీసుకోకుండానే యాక్ట్ చేశాను. అయినా నా భర్త ఆనంద సాయి (ఆర్ట్ డైరెక్టర్)తో నిత్యం సినిమాలు గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీకి దగ్గరగానే ఉన్నాను’’ అన్నారు వాసుకి. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వాసుకి మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘తొలిప్రేమ’ సినిమా తర్వాత నాకు అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను. ఎందుకంటే నాకు కుటుంబ బాధ్యతలే ప్రాధాన్యంగా అనిపించాయి. (చదవండి: ఆదిపురుష్.. టీజర్‌కి, ట్రైలర్‌కి తేడా ఏంటి?) ప్రస్తుతం ఫారిన్లో మా అమ్మాయి మెడిసిన్ ఫోర్త్ ఇయర్, అబ్బాయి ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. దాంతో నాకు ఖాళీ దొరికింది. నేను సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను. ఇటు నటిగా నాకు నచ్చే, నప్పే పాత్రలు చేస్తాను. ‘అన్నీ మంచి శకునములే’లో సంతోష్ శోభన్‌కు అక్కగా నటించాను. తమ్ముడ్ని సపోర్ట్ చేసే అక్క పాత్ర ఇది. కథ బాగుంటే తల్లిగా చేయడానికి కూడా రెడీ’’ అన్నారు. -
‘అన్నీ మంచి శకునములే’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్
గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె విడాకుల గురించి సోషల్ మీడియా అంతా వార్తలు చక్కర్లు కొడుతున్నా నిహారిక మాత్రం అవేం పట్టనట్లు తన పని తాను చేసుకుంటూ పోతుంది. పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పి కేవలం నిర్మాతగా మారిపోయిన నిహారిక ఇప్పుడు మళ్లీ స్క్రీన్‌పై కనిపించేందుకు రెడీ అయిపోయింది. చదవండి: వెనక్కి తగ్గిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ వాయిదా ఓవైపు సొంతంగా ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్‌ని స్థాపించి సినిమాలు, వెబ్‌సీరీస్‌లు నిర్మిస్తూనే, మరోవైపు సందర్భం వచ్చినప్పుడు తెరపై కనిపించేందుకు యాక్టివ్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ యంగ్ హీరోతో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. సంతోష్ శోభన్ హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి మెరిసే మెరిసే సాంగ్‌కు నిహారికతో కలిసి సంతోష్ శోభన్ స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఒక్క మూవీకే రూ.32 కోట్ల నష్టం, సినిమాలు వదిలేద్దామనుకున్నా -
ఓటీటీకి వచ్చేస్తోన్న మెగా డాటర్ సుస్మిత చిత్రం!
నటుడు సంతోష్ శోభన్, నటి గౌరి జి. కిషన్ జంటగా నటించిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రం ‘శ్రీదేవి.. శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా గత నెలలో విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, తాజాగా ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 30 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా వెల్లడించింది. కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పల్లెటూరులో జరిగిన అందమైన ప్రేమకథాగా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ శ్రీదేవి ఓ ఫ్యాషన్ డిజైనర్. తన మేనత్తపై ప్రతీకారంతో అరకు వెళ్లిన ఆమె అక్కడ హీరో శోభన్ బాబును కలుసుకుంటుంది. ఆ తర్వాత శ్రీదేవి జీవితం ఎలా మారింది? అత్తపై ఆమె ప్రతీకారం తీర్చుకుందా? గతంలో తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు వంటి ఆసక్తికర సంఘటనలతో ఈ చిత్రం రూపొందింది. Sreedevi Shobhan Babu la entertainment flick March 30 nundi! 🍿🎬#SrideviShobanBabuOnHotstar premieres only on #DisneyPlusHotstar.@santoshsoban @Gourayy @sushkonidela #VishnuLaggishetty @dimmalaprasanth @GoldBoxEnt @NagaBabuOffl @SyedKamran @Saranyapotla pic.twitter.com/pdXiCWOgPj — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) March 15, 2023 -
ఓటీటీకి వచ్చేసిన కళ్యాణం కమనీయం, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్.. ఎక్కడంటే
యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేదు. సంక్రాంతికి స్టార్ హీరో చిత్రాలు ఉండటంతో కళ్యాణం కమనీయం ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుకోలేకపోయింది. అంతేకాదు థియేటర్లు కూడా ఎక్కువగా దొరకకపోవడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. దీంతో ఈ చిత్రానికి బిగ్‌స్రీన్‌పై పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. విడుదలైన నెల రోజులకే కళ్యాణం కమనీయం ఓటీటీలోకి రావడం విశేషం. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహా ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది. చెప్పినట్టుగానే శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడే పెళ్లి బంధం నిలబడుతుందనే స్టోరీ లైన్‌తో దర్శకుడు అనిల్ కుమార్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాతో హీరోయిన్ ప్రియా భవాని శంకర్ నటించింది. ఈ చిత్రంతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవిత్ర లోకేశ్ వంటి తదితర నటులు ప్రధాన పాత్రలు పోషించారు. Prema lekunda pelli cheskovachu kani job lekunda pellante? adhii ee generation lo.🙆🏻♀️🙆🏻♂️#KalayanamKamaneeyamOnAHA, A tale of complicated relationship, premieres Feb 17, only on aha!@santoshsoban @priya_Bshankar @UV_Creations @UVConcepts_ @adityamusic pic.twitter.com/v3SmpJGJp5 — ahavideoin (@ahavideoIN) February 8, 2023 -
ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా : సుస్మితా కొణిదెల
సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ జంటగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘1970 నేపథ్యంలో ఓ పల్లెటూరులో జరిగే అందమైన కథ ఇది’’ అన్నారు. ‘‘నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత సుస్మిత. ‘‘ఈ సినిమా చూసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటే బావుంటుందనే ఆలోచన వస్తుంది’’ అన్నారు ప్రశాంత్. ఈ కార్యక్రమంలో నటి గౌరి జి.కిషన్, నిర్మాత విష్ణు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య పొట్ల పాల్గొన్నారు. -
‘కళ్యాణం కమనీయం’ మూవీ రివ్యూ
టైటిల్: కళ్యాణం కమనీయం నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు నిర్మాణసంస్థ: యూవీ కాన్సెప్ట్స్ దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ల సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని ఎడిటర్: సత్య జి విడుదల తేది: జనవరి 14, 2023 పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘కళ్యాణం కమనీయం’.సంక్రాంతి సందర్భంగా నేడు(జనవరి 14) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శివ(సంతోష్ శోభన్) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం లేకుండా ఖాలీగా తిరుగుతుంటాడు. జాబ్ కోసం వెతుకున్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రుతి(ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత కూడా శివ ఉద్యోగం చేయడు. శ్రుతి ఒక్కతే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే ఒక రోజు సడన్‌గా శివను ఉద్యోగం చేయమని అడుగుతుంది శ్రుతి. దీంతో కథ మలుపు తిరుగుతుంది. శివ ఉద్యోగం సంపాదించే క్రమంలో ఓ అబద్దం చెబుతాడు. ఆ అబద్దం వారికి ఎన్ని కష్టాలను తెచ్చిపెట్టింది? శ్రుతికి ఆఫీస్‌లో ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఇతరుల కారణంగా వారి వైవాహిక జీవితంలోకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? శివ, శ్రుతిలు ఎందుకు దూరమయ్యారు? చివరకు వారిద్దరు మళ్లీ ఎలా ఒకటయ్యారనేదే మిగతా కథ. కొత్తగా పెళ్లైయిన ఓ జంట చుట్టూ తిరిగే కథే ‘కల్యాణం కమనీయం’. వారిద్దరి వైవాహిక జీవితంలో ఎదురయ్యే సంఘటన నేపథ్యంలో కథనం సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయని, వాటిని భార్యాభర్తలు అనుభవాలుగా స్వీకరించి, కలిసి ముందుకు సాగితేనే ఆ బంధం నిలబడుతుందని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. భార్య భర్తల మధ్య వచ్చే సంఘర్షణలను మాత్రం ఆసక్తిగా రాసుకోలేకపోయాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఉద్యోగం చేసే భార్య, ఖాలీగా ఉండే భర్తల నేపథ్యంలో మరింత కామెడీ, ఎమోషన్ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు అంతగా వాడుకోలేదు. కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా, సాగదీత లేకుండా చూసుకున్నాడు. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ ఇప్పటి జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. సెకండాఫ్‌లో కామెడీ కంటే ఎమోషనల్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. సినిమా నిడివి (109 నిమిషాలు) చాలా తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. కథనం ఆసక్తికరంగా సాగకపోయినా..ఎక్కడా బోర్ కొట్టదు. ప్రస్తుతం తరుణంగా ఈ సినిమా థియేటర్స్ ఆడియన్స్‌ని ఏ మేరకు మెప్పింస్తుందో తెలియదు కానీ.. ఓటీటీ ప్రేక్షకులను మాత్ర కచ్చితంగా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. శివ పాత్రలో సంతోష్ శోభన్ చక్కగా నటించాడు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ, భార్య సంపాదన మీద బతికే కుర్రాడి పాత్రలో మెప్పించాడు. ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని రకాలుగా సంతోష్ శోభన్ ఆకట్టుకున్నాడు. ఇక ప్రియా భవానీ శంకర్ సైతం చక్కగా నటించింది. తెరపై ప్రియా భవానీ కనిపించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. కేదార్ శంకర్, దేవీ ప్రసాద్ తమ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. పవిత్రా లోకేష్ అమ్మగా ఆకట్టుకుంది. సద్దాం, సప్తగిరి నవ్వించారు. సత్యం రాజేష్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అప్పుడు ఆ ఆలోచనలు లేవు: ప్రియా భవానీశంకర్
కళ్యాణం కమనీయం’ చిత్రంలో నేను చేసిన శ్రుతి పాత్రకి, నిజజీవితంలో నాకు దాదాపు 90శాతం పోలికలున్నాయి. అందుకే ఆ పాత్ర చేయడం నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. తమిళ్లో నా మొదటి చిత్రం విడుదలప్పుడు నాకు పెద్దగా ఆలోచనలు లేవు.. కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎలా ఆదరిస్తారో అనే ఎగ్జయిట్మెంట్ ఉంది’’ అని హీరోయిన్ ప్రియా భవానీశంకర్ అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. యూవీ కాన్సెప్ట్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక భవానీశంకర్ మాట్లాడుతూ– ‘‘తమిళ్లో చాలా మంచి చిత్రాలు చేశాను. యూవీలాంటి పెద్ద బ్యానర్లో తెలుగులో పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఉద్యోగం లేని భర్త శివ, జాబ్‌కి వెళ్లే భార్య శ్రుతి. వారు సంతోషంగానే ఉన్నా చుట్టూ ఉన్న వాళ్ల మాటలు, అభిపప్రాయాల వల్ల వారిద్దరి మధ్య మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్లింది? అన్నదే ఈ చిత్రకథ. శ్రుతి పాత్రలో మహిళలు తమని తాము చూసుకుంటారు. ఇక నాగచైతన్యతో ‘దూత’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. సత్యదేవ్‌తో ఓ సినిమాలో నటించనున్నాను’’ అన్నారు. -
ఈ సినిమాకు మొదటి ఛాయిస్ నేను కాదట!: సంతోష్ శోభన్
యంగ్ హీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "కళ్యాణం కమనీయం". ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించగా, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో చిత్రయూనిట్ సినీ విశేషాలు పంచుకుంది. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ "దర్శకుడికి, హీరోయిన్ ప్రియకి తెలుగులో ఇదే మొదటి సినిమా. చిరంజీవి, బాలకృష్ణగారి సినిమాలతో సంక్రాంతికి మళ్ళీ ఒక కళ వచ్చింది. వాళ్ళ సినిమాలతో పాటు మా సినిమాకి కూడా ఈ అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. యూవీ క్రియేషన్స్ అనేది నా ఫ్యామిలీ, వాళ్ళెప్పుడూ నాకు వెన్నుదన్నుగా ఉంటారు. నాకు దర్శకుడు అంటే దేవుడితో సమానం. ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకి ఎంత క్రెడిట్ వచ్చినా అది మొత్తం అనిల్‌కే దక్కాలి. శివ పాత్రకి మొదటి ఆప్షన్ నేను కాదు అది ఎవరో మీరే అనిల్‌ను అడగాలి కానీ శృతి పాత్రకి ప్రియానే మొదటి ఆప్షన్" అన్నాడు. హీరోయిన్ ప్రియ భవాని శంకర్ మాట్లాడుతూ "ఇది తెలుగులో నా మొదటి సినిమా. చాలా ఎక్సయిటింగ్ గా ఉంది అలాగే భయంగానూ ఉంది. ఈ సారి తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తాను. సినిమాలో శృతి క్యారెక్టర్ ఎలాంటిదో నాది ఇంచుమించు అలాంటి క్యారెక్టరే" అన్నారు. దర్శకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ, "మనం జెన్యూన్‌గా ఒక కథ రాసుకుంటే యూనివర్స్ మొత్తం మనకి హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతాను. ఈ కథ అలా రాసుకున్నదే. జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు కళ్యాణం కమనీయంలో ఉన్నాయి. నా ఫ్రెండ్ వేదవ్యాస్ నుంచి ప్రారంభమయిన ఈ కథ, యూవీ వరకు వచ్చింది, యూవీ క్రియేషన్స్ వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ అవసరం రాలేదు" అన్నారు. చదవండి: తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌కు: చిరంజీవి వీరసింహారెడ్డి: థియేటర్లో పూజారి మాస్ డ్యాన్స్ -
ప్రభాస్ అన్న ప్రేమ దక్కడం నా అదృష్టం: సంతోష్ శోభన్
ప్రభాస్ అన్న నాకు ఇచ్చే సపోర్ట్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్. నా గత చిత్రాల ప్రమోషన్ కు సపోర్ట్ చేశారు. కళ్యాణం కమనీయం సినిమా పాట రిలీజ్ చేస్తున్నారు. నేను ఆయన అభిమానిని. మా మధ్య ఉన్నది అభిమాని, స్టార్ మధ్య ఉన్న బంధం. ప్రభాస్ అన్న ప్రేమ దక్కినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి’ అని యంగ్ హీరో సంతోష్ శోభన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం’. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా సంతోష్ శోభన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఏక్ మినీ కథ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు "కళ్యాణం కమనీయం" కథ విన్నాను. నా మిత్రుడు, ఈ సినిమా కో ప్రొడ్యూసర్ అజయ్ దర్శకుడు అనిల్ కుమార్ ను పరిచయం చేశారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చింది. మనం రెండు రకాల సినిమాలు చూస్తుంటాం. ఒకటి ఆస్పిరేషనల్, రెండోది రిలేటబుల్. ఇది మనందరికీ రిలేట్ అయ్యే కథ. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. కథ చెప్పగానే సంతోషంగా ఒప్పుకున్నాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ►సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసుకోవాలనేది నా కల. అది ఈ చిత్రంతో తీరుతోంది. బిగ్ స్టార్స్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇది చిత్ర పరిశ్రమకు పెద్ద సంక్రాంతి. ఈ పండక్కి విడుదలవుతున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు చిత్రాలతో పాటు ‘కళ్యాణం కమనీయం’ కూడా ఆదరించండి ►నేను ఇప్పటిదాకా చేసిన సోషల్ కామెడీ మూవీస్ లో నా పాత్రలు రియాల్టీకి కొంత దూరంగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో నేను చేసిన శివ క్యారెక్టర్ చాలా జెన్యూన్ గా ఉంటుంది. ఇందులో ఫేక్ నెస్ లేదు. ఆ సిట్యువేషన్ కు తగినట్లు శివ క్యారెక్టర్ నిజాయితీగా రెస్పాండ్ అవుతుంది. ►ఇందులో శృతి జాబ్ చేస్తుంది శివకు ఉద్యోగం ఉండదు. అయితే ఇదొక్కటే కథలో కీలకం కాదు. ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితంలో ఎదురైన పరిస్థితులను తట్టుకుని ఎలా ముందుకు సాగారు అనేది చూపిస్తున్నాం. రెగ్యులర్ ఫార్మేట్ సినిమా కొలతలు "కళ్యాణం కమనీయం" లో ఉండవు. ఈ సినిమా ఒక ఎక్సీపియరెన్స్ లా ఉంటుంది. ► లైఫ్ అంటే ఒకరి మీద మరొకరం ఆధారపడటం. నాన్న మాకు దూరమైనప్పుడు అమ్మ మమ్మల్ని ఏ కష్టం తెలియకుండా పెంచింది. అప్పుడు అమ్మ మీద ఆధారపడ్డాను. లైఫ్ లో ఒక సందర్భం వస్తే భార్య సంపాదన మీద భర్త కొంతకాలం లైఫ్ లీడ్ చేస్తాడు. అది వాళ్లిద్దరికి మధ్య సమస్య. భార్యా భర్తలకు ఇష్టమైతే వాళ్ల జీవితాన్ని ఎలాగైనా గడుపుతారు. నేను నిజ జీవితంలో జాబ్ లేకుంటే బాధపడాలి. నేను ఆ క్యారెక్టర్ లో నటిస్తున్నా కాబట్టి పర్సనల్ గా తీసుకోలేదు. ► ఈ చిత్రంలో పాటలు కథను ఎక్కడా బ్రేక్ చేయవు. కథ కూడా పాటలతో ముందుకు వెళ్తుంది. శ్రావణ్ భరద్వాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. అలాగే కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఆకర్షణ అవుతుంది. ► యూవీ క్రియేషన్స్ సంస్థ నా ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటిది. ఇక్కడ మూడు చిత్రాలు చేశాను. మరో ముప్పై చేసేందుకైనా సిద్ధం. నా లైఫ్ లో పేరున్న దర్శకులు మారుతి, మేర్లపాక గాంధీ లాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ల దగ్గర ఎంత నేర్చుకున్నానో ఈ చిత్ర దర్శకుడు అనిల్ దగ్గర అంతే నేర్చుకున్నాను ► కథల ఎంపికలో నిర్ణయం నాదే. నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్స్ క్రెడిట్ తీసుకుంటా. అప్పుడే మనశ్సాంతిగా ఉంటుంది. ప్రస్తుతం నందినీ రెడ్డి గారి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ లో అన్ని మంచి శకునములే అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది కాకుండా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా చేస్తున్నాను. -
“కళ్యాణం కమనీయం” నుంచి మరో లిరికల్ సాంగ్ అవుట్
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం 'కళ్యాణం కమనీయం'. అనిల్ కుమార్ అల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి కానుకగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా “అయ్యో ఏంటో నాకు” అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, స్వీకర్ అగస్తి పాడారు. ‘అయ్యో ఎంటో నాకు అన్ని వచ్చి పక్కనున్న ఒక్క అదృష్టమేమో దూరముందే..అన్నీ ఇచ్చేసినట్టు ఇచ్చి లాగేసుకుంటు దైవం వైకుంఠపాళీ ఆడతాడే’ అంటూ భార్యభర్తల మధ్య వచ్చే మనస్పర్థల నేపథ్యంలో సాగుతుందీ పాట. Get into the vibe of LIFE, listening to the trippy single #AyyoEnto from @santoshsoban's #KalyanamKamaneeyam 🚶🏻♂️💫 ▶️ https://t.co/x6Mr0Hg5yZ In theatres WW on Jan 14th❤@priya_Bshankar @Dir_Anilkumar #ShravanBharadwaj #KarthikGattamneni @UV_Creations @UVConcepts_ @adityamusic pic.twitter.com/J5EAPH6x5L — Santosh Soban (@santoshsoban) January 7, 2023 -
అభిమానులకు యంగ్ హీరో ఎమోషనల్ లేఖ
ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్..తను నేను చిత్రంతో హీరోగా మారాడు. ‘పేపర్ బాయ్’తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇటీవల లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చిత్రంతో ప్రేక్షకులతో ముందుకు రాగా.. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా సంతోష్ శోభన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఓ లేఖ రాశాడు. ‘నేను 2010లో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. నా ఫేవరేట్ డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వంలో గోల్కొండ హైస్కూల్ చిత్రంలో నటించాను. ఈ సినిమాలో నా డైలాగ్స్ చెప్పినప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. నేను నా కలను సాకారం చేసుకున్న అనుభూతి కలిగింది. ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడు కెమెరా ముందుకొచ్చినా నా డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటున్నానని ఆనందపడుతుంటా. ఇదే ఆనందాన్ని నిత్యం పొందేందుకు మంచి కథల్లో నటిస్తూ, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలనుకుంటున్నాను’ అని సంతోష్ శోభన్ రాసుకొచ్చాడు. సంతోష్ శోభన్ ప్రస్తుతం ప్రేమ్ కుమార్ అనే సినిమాతో పాటు యూవీ క్రియేషన్స్ లో రెండు ప్రాజెక్ట్స్ లకు ప్లానింగ్ జరుగుతోంది. ఒక సినిమా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ కు రెడీ గా ఉండగా,మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్ నిర్మాణంలో నందినీరెడ్డి దర్శకత్వంలో "అన్ని మంచి శకునములే" అనే సినిమాలో సంతోష్ శోభన్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Santosh Shobhan (@santoshshobhan) -
కెరీర్లో మొదటిసారి అలాంటి పాత్ర చేశాను : సంతోష్ శోభన్
‘‘నాన్న (దర్శకుడు శోభన్) దూరమై 14 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఆయన గురించి మంచిగా చెబుతున్నారు.. నన్ను నవ్వుతూ పలకరిస్తున్నారంటే వారి రూపంలో నాన్న నాతో ఉన్నట్టే. ఇది నా అదృష్టంగా భావించి మరింత కష్టపడుతున్నాను’’ అన్నారు సంతోష్ శోభన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ పంచుకున్న విశేషాలు. ‘ఏక్ మినీ కథ’ తర్వాత నేను, గాందీగారు మళ్లీ సినిమా చేయాలనుకున్నాం. ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’తో కుదిరింది. ఇందులో నేను చేసిన యూట్యూబర్ విప్లవ్ పాత్ర నా మనసుకు చాలా నచ్చింది. కెరీర్లో మొదటిసారి నా ఏజ్ పాత్ర చేశాను. మేర్లపాక గాంధీగారి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలోలా హైపర్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ ఇది. ∙‘లైక్ షేర్ అండ్ సబ్‌స్రై్కబ్’ కథ అందరూ రిలేట్ చేసుకునేట్లు ఉంటుంది. ట్రావెల్ బ్లాగర్‌గా మొదలైన ఈ కథ యాక్షన్ కామెడీగా మలుపు తీసుకోవడం ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ∙ప్రభాస్‌గారు ఇండియా బిగ్గెస్ట్ స్టార్. మా సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్.. ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేసి, ప్రోత్సహించడం ఆయన గొప్పదనం. ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ నేను గర్వపడే సినిమా. ప్రభాస్‌గారికి టైమ్ కుదిరితే ఈ సినిమా చూపించడం నా కల. నందినీ రెడ్డిగారి దర్శకత్వంలో నేను నటించిన ‘అన్నీ మంచి శకునములే’ డిసెంబరు 21 వస్తోంది. యూవీ క్రియేషన్స్‌లో ‘కల్యాణం కమణీయం’ సినిమా ఉంది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ -
ప్రభాస్‌కు ఈ సినిమా చూపించాలన్నదే నా డ్రీమ్: యంగ్ హీరో
యంగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'. నిహారిక ఎంటర్ టైన్మెంట్, ఆముక్త క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరో సంతోష్ శోభన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ► లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా నచ్చింది. అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీ గారు అంటే ఇష్టం. ఆయన ఇచ్చిన కథతో ఏక్ మినీ కథ చేశాను. ఈ సినిమా తర్వాత మళ్ళీ వర్క్ చేయాలనుకున్నాం. లక్కీగా తొందరగా అయిపొయింది. కథ చెప్పిన నెల రోజుల తర్వాతే షూటింగ్ కి వెళ్ళిపోయాం. ఆయన కూడా నన్ను నమ్మారు. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ► ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఛాయిస్ అని మేర్లపాక గాంధీ గారు చెప్పారు. ఆయన మాట నమ్ముతున్నాను(నవ్వుతూ). ఇందులో యూట్యూబర్ విప్లవ్ పాత్ర నాకు చాలా హై ఇచ్చింది. కెరీర్ లో మొదటిసారి నా ఏజ్ పాత్రలో చేస్తున్నా. ఎక్స్ ప్రెస్ రాజాలా హైపర్ ఎనర్జిటిక్ క్యారెక్టర్. చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. దర్శకుడు గాంధీ డైలాగ్‌ను పర్ఫెక్ట్ గా రాస్తారు. ఆయన రాసింది ఆయనలా చెబితేనే కుదురుతుంది. ► నిజానికి సోషల్ మీడియాలో నేను కొంచెం వెనకబడి వున్నాను. యూట్యూబ్ అందరికీ తెలుసు. మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూటింగ్ చేసినప్పుడు అక్కడ యూట్యూబ్ వ్లాగ్ చేసే కుర్రాళ్ళు వున్నారు. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మాకంటే బాగా చెప్తున్నారు. మనం ఎక్కడో వెదుకుతాం కానీ మన చుట్టూనే బోలెడు ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ► నటుడు బ్రహ్మజీ గారితో చాలా ఫన్ ఉంటుంది. అదే సమయంలో ఒక సీన్ చేస్తున్నపుడు ఎలా చేయాలో చర్చిస్తుంటారు. సిందూరం నుండి ఇప్పటివరకూ ఆయనలో అదే ఫైర్, ప్యాషన్ ఉన్నాయి. ఆయన నుంచి కొత్త నటులు చాలా నేర్చుకోవాలి. ఫరియా చాలా ఎనర్జిటిక్. తను ఒక సూపర్ డూపర్ హిట్ తర్వాత చేసిన సినిమా ఇది. కథని నమ్మి చేసింది. ఫరియా నుంచి చాలా నేర్చుకున్నాను. ► ప్రభాస్ గారు ఇండియా బిగ్గెస్ట్ స్టార్. ఆయన్ని ఎప్పుడు కలిసినా అభిమానిగానే కలిశా. కలిసినప్పుడల్లా చాలా హ్యాపీ. లైఫ్ లాంగ్ ఆయన్ని అలా అభిమానిగా కలిసినా చాలు. మేము ఎప్పుడు కలిసినా ఆయనకున్న సమయం ప్రకారం టీజర్, ట్రైలర్, సాంగ్ ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. ఇది ఆయన గొప్పదనం. ఆయనకి సమయం కుదిరితే ఈ సినిమా చూపించాలన్నదే నా డ్రీమ్. ► డిసెంబర్ 21న నందిని రెడ్డి గారి సినిమా 'అన్ని మంచి శకునములే' వస్తోంది. అలాగే యూవీ క్రియేషన్స్‌లో 'కళ్యాణం కమనీయం' ఉంది. సమయం కుదిరితే ఓటీటీలకు కూడా చేయాలని ఉంది. నాకు యాక్షన్ కామెడీలు ఎక్కువ ఇష్టం. చదవండి: బిగ్‌బాస్: ఆర్జే సూర్యపై ఇనయ ప్రేమ సక్సెస్ అయ్యేనా? జిన్నా హిందీ డబ్బింగ్‌కు అన్ని కోట్లా? -
ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే..?
-
అలాంటి మంచిరోజులు త్వరలోనే వస్తాయి!
Manchi Rojulochaie: ‘‘కరోనా సమయంలో అందరం నవ్వుకు దూరం అయిపోయాం. కరోనా రాకపోయినా భయంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు చూసి ‘మంచి రోజలు వచ్చాయి’ సినిమా తీశాను’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎలాంటి భయం లేకుండా థియేటర్లకు వచ్చి మా ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా చూస్తారని, అలాంటి మంచి రోజులు అతి త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా జర్నలిస్టులను కూడా చేర్చాలి’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా చిత్రాన్ని చూసి ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు మెహరీన్. ‘‘నా ప్రతిభని నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలు వంశీగారు, విక్రమ్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు సంతోష్ శోభన్. నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు.