Actress Priya Bhavani Shankar Talk About Kalyanam Kamaneeyam Movie - Sakshi
Sakshi News home page

Priya Bhavani Shankar : అప్పుడు ఆ ఆలోచనలు లేవు

Published Sat, Jan 14 2023 7:22 AM | Last Updated on Sat, Jan 14 2023 8:49 AM

Priya Bhavani Shankar Talk About Kalyanam Kamaneeyam Movie - Sakshi

కళ్యాణం కమనీయం’ చిత్రంలో నేను చేసిన శ్రుతి పాత్రకి, నిజజీవితంలో నాకు దాదాపు 90శాతం పోలికలున్నాయి. అందుకే ఆ పాత్ర చేయడం నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. తమిళ్‌లో నా మొదటి చిత్రం విడుదలప్పుడు నాకు పెద్దగా ఆలోచనలు లేవు.. కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎలా ఆదరిస్తారో అనే ఎగ్జయిట్‌మెంట్‌ ఉంది’’ అని హీరోయిన్‌ ప్రియా భవానీశంకర్‌ అన్నారు.

సంతోష్‌ శోభన్‌ హీరోగా అనిల్‌ కుమార్‌ ఆళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. యూవీ కాన్సెప్ట్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక భవానీశంకర్‌ మాట్లాడుతూ– ‘‘తమిళ్‌లో చాలా మంచి చిత్రాలు చేశాను. యూవీలాంటి పెద్ద బ్యానర్‌లో తెలుగులో పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఉద్యోగం లేని భర్త శివ, జాబ్‌కి వెళ్లే భార్య శ్రుతి. వారు సంతోషంగానే ఉన్నా చుట్టూ ఉన్న వాళ్ల మాటలు, అభిపప్రాయాల వల్ల వారిద్దరి మధ్య మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్లింది? అన్నదే ఈ చిత్రకథ. శ్రుతి పాత్రలో మహిళలు తమని తాము చూసుకుంటారు. ఇక నాగచైతన్యతో ‘దూత’ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను. సత్యదేవ్‌తో ఓ సినిమాలో నటించనున్నాను’’ అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement