Kalyanam Kamaneeyam Movie
-
ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్ బస్టర్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సంక్రాతి బరిలో నిలిచి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాలు ఓటీటీలోనూ అలరించనున్నాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. మిగతా సినిమాలు వచ్చే వారం స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్లలో చూడలేక మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఓటీటీలో వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కళ్యాణం కమనీయం యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. తాజాగా ఈ ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తునివు తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ తునివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో తెగింపు పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. వచ్చేస్తున్న వారసుడు దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారిసు(వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సంక్రాంతికి రిలీజైన వారసుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. -
ఓటీటీకి వచ్చేసిన కళ్యాణం కమనీయం, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్.. ఎక్కడంటే
యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేదు. సంక్రాంతికి స్టార్ హీరో చిత్రాలు ఉండటంతో కళ్యాణం కమనీయం ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుకోలేకపోయింది. అంతేకాదు థియేటర్లు కూడా ఎక్కువగా దొరకకపోవడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. దీంతో ఈ చిత్రానికి బిగ్‌స్రీన్‌పై పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. విడుదలైన నెల రోజులకే కళ్యాణం కమనీయం ఓటీటీలోకి రావడం విశేషం. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహా ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది. చెప్పినట్టుగానే శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడే పెళ్లి బంధం నిలబడుతుందనే స్టోరీ లైన్‌తో దర్శకుడు అనిల్ కుమార్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాతో హీరోయిన్ ప్రియా భవాని శంకర్ నటించింది. ఈ చిత్రంతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవిత్ర లోకేశ్ వంటి తదితర నటులు ప్రధాన పాత్రలు పోషించారు. Prema lekunda pelli cheskovachu kani job lekunda pellante? adhii ee generation lo.🙆🏻♀️🙆🏻♂️#KalayanamKamaneeyamOnAHA, A tale of complicated relationship, premieres Feb 17, only on aha!@santoshsoban @priya_Bshankar @UV_Creations @UVConcepts_ @adityamusic pic.twitter.com/v3SmpJGJp5 — ahavideoin (@ahavideoIN) February 8, 2023 -
కళ్యాణం కమనీయం మూవీ టీమ్ తో చిట్ చాట్
-
కళ్యాణం కమనీయం మూవీ టీంతో " గరం గరం ముచ్చట్లు "
-
‘కళ్యాణం కమనీయం’ మూవీ రివ్యూ
టైటిల్: కళ్యాణం కమనీయం నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు నిర్మాణసంస్థ: యూవీ కాన్సెప్ట్స్ దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ల సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని ఎడిటర్: సత్య జి విడుదల తేది: జనవరి 14, 2023 పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘కళ్యాణం కమనీయం’.సంక్రాంతి సందర్భంగా నేడు(జనవరి 14) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శివ(సంతోష్ శోభన్) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం లేకుండా ఖాలీగా తిరుగుతుంటాడు. జాబ్ కోసం వెతుకున్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రుతి(ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత కూడా శివ ఉద్యోగం చేయడు. శ్రుతి ఒక్కతే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే ఒక రోజు సడన్‌గా శివను ఉద్యోగం చేయమని అడుగుతుంది శ్రుతి. దీంతో కథ మలుపు తిరుగుతుంది. శివ ఉద్యోగం సంపాదించే క్రమంలో ఓ అబద్దం చెబుతాడు. ఆ అబద్దం వారికి ఎన్ని కష్టాలను తెచ్చిపెట్టింది? శ్రుతికి ఆఫీస్‌లో ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఇతరుల కారణంగా వారి వైవాహిక జీవితంలోకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? శివ, శ్రుతిలు ఎందుకు దూరమయ్యారు? చివరకు వారిద్దరు మళ్లీ ఎలా ఒకటయ్యారనేదే మిగతా కథ. కొత్తగా పెళ్లైయిన ఓ జంట చుట్టూ తిరిగే కథే ‘కల్యాణం కమనీయం’. వారిద్దరి వైవాహిక జీవితంలో ఎదురయ్యే సంఘటన నేపథ్యంలో కథనం సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయని, వాటిని భార్యాభర్తలు అనుభవాలుగా స్వీకరించి, కలిసి ముందుకు సాగితేనే ఆ బంధం నిలబడుతుందని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. భార్య భర్తల మధ్య వచ్చే సంఘర్షణలను మాత్రం ఆసక్తిగా రాసుకోలేకపోయాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఉద్యోగం చేసే భార్య, ఖాలీగా ఉండే భర్తల నేపథ్యంలో మరింత కామెడీ, ఎమోషన్ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు అంతగా వాడుకోలేదు. కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా, సాగదీత లేకుండా చూసుకున్నాడు. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ ఇప్పటి జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. సెకండాఫ్‌లో కామెడీ కంటే ఎమోషనల్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. సినిమా నిడివి (109 నిమిషాలు) చాలా తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. కథనం ఆసక్తికరంగా సాగకపోయినా..ఎక్కడా బోర్ కొట్టదు. ప్రస్తుతం తరుణంగా ఈ సినిమా థియేటర్స్ ఆడియన్స్‌ని ఏ మేరకు మెప్పింస్తుందో తెలియదు కానీ.. ఓటీటీ ప్రేక్షకులను మాత్ర కచ్చితంగా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. శివ పాత్రలో సంతోష్ శోభన్ చక్కగా నటించాడు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ, భార్య సంపాదన మీద బతికే కుర్రాడి పాత్రలో మెప్పించాడు. ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని రకాలుగా సంతోష్ శోభన్ ఆకట్టుకున్నాడు. ఇక ప్రియా భవానీ శంకర్ సైతం చక్కగా నటించింది. తెరపై ప్రియా భవానీ కనిపించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. కేదార్ శంకర్, దేవీ ప్రసాద్ తమ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. పవిత్రా లోకేష్ అమ్మగా ఆకట్టుకుంది. సద్దాం, సప్తగిరి నవ్వించారు. సత్యం రాజేష్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అప్పుడు ఆ ఆలోచనలు లేవు: ప్రియా భవానీశంకర్
కళ్యాణం కమనీయం’ చిత్రంలో నేను చేసిన శ్రుతి పాత్రకి, నిజజీవితంలో నాకు దాదాపు 90శాతం పోలికలున్నాయి. అందుకే ఆ పాత్ర చేయడం నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. తమిళ్లో నా మొదటి చిత్రం విడుదలప్పుడు నాకు పెద్దగా ఆలోచనలు లేవు.. కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎలా ఆదరిస్తారో అనే ఎగ్జయిట్మెంట్ ఉంది’’ అని హీరోయిన్ ప్రియా భవానీశంకర్ అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. యూవీ కాన్సెప్ట్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక భవానీశంకర్ మాట్లాడుతూ– ‘‘తమిళ్లో చాలా మంచి చిత్రాలు చేశాను. యూవీలాంటి పెద్ద బ్యానర్లో తెలుగులో పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఉద్యోగం లేని భర్త శివ, జాబ్‌కి వెళ్లే భార్య శ్రుతి. వారు సంతోషంగానే ఉన్నా చుట్టూ ఉన్న వాళ్ల మాటలు, అభిపప్రాయాల వల్ల వారిద్దరి మధ్య మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్లింది? అన్నదే ఈ చిత్రకథ. శ్రుతి పాత్రలో మహిళలు తమని తాము చూసుకుంటారు. ఇక నాగచైతన్యతో ‘దూత’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. సత్యదేవ్‌తో ఓ సినిమాలో నటించనున్నాను’’ అన్నారు. -
ఈ సినిమాకు మొదటి ఛాయిస్ నేను కాదట!: సంతోష్ శోభన్
యంగ్ హీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "కళ్యాణం కమనీయం". ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించగా, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో చిత్రయూనిట్ సినీ విశేషాలు పంచుకుంది. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ "దర్శకుడికి, హీరోయిన్ ప్రియకి తెలుగులో ఇదే మొదటి సినిమా. చిరంజీవి, బాలకృష్ణగారి సినిమాలతో సంక్రాంతికి మళ్ళీ ఒక కళ వచ్చింది. వాళ్ళ సినిమాలతో పాటు మా సినిమాకి కూడా ఈ అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. యూవీ క్రియేషన్స్ అనేది నా ఫ్యామిలీ, వాళ్ళెప్పుడూ నాకు వెన్నుదన్నుగా ఉంటారు. నాకు దర్శకుడు అంటే దేవుడితో సమానం. ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకి ఎంత క్రెడిట్ వచ్చినా అది మొత్తం అనిల్‌కే దక్కాలి. శివ పాత్రకి మొదటి ఆప్షన్ నేను కాదు అది ఎవరో మీరే అనిల్‌ను అడగాలి కానీ శృతి పాత్రకి ప్రియానే మొదటి ఆప్షన్" అన్నాడు. హీరోయిన్ ప్రియ భవాని శంకర్ మాట్లాడుతూ "ఇది తెలుగులో నా మొదటి సినిమా. చాలా ఎక్సయిటింగ్ గా ఉంది అలాగే భయంగానూ ఉంది. ఈ సారి తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తాను. సినిమాలో శృతి క్యారెక్టర్ ఎలాంటిదో నాది ఇంచుమించు అలాంటి క్యారెక్టరే" అన్నారు. దర్శకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ, "మనం జెన్యూన్‌గా ఒక కథ రాసుకుంటే యూనివర్స్ మొత్తం మనకి హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతాను. ఈ కథ అలా రాసుకున్నదే. జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు కళ్యాణం కమనీయంలో ఉన్నాయి. నా ఫ్రెండ్ వేదవ్యాస్ నుంచి ప్రారంభమయిన ఈ కథ, యూవీ వరకు వచ్చింది, యూవీ క్రియేషన్స్ వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ అవసరం రాలేదు" అన్నారు. చదవండి: తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌కు: చిరంజీవి వీరసింహారెడ్డి: థియేటర్లో పూజారి మాస్ డ్యాన్స్ -
ప్రభాస్ అన్న ప్రేమ దక్కడం నా అదృష్టం: సంతోష్ శోభన్
ప్రభాస్ అన్న నాకు ఇచ్చే సపోర్ట్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్. నా గత చిత్రాల ప్రమోషన్ కు సపోర్ట్ చేశారు. కళ్యాణం కమనీయం సినిమా పాట రిలీజ్ చేస్తున్నారు. నేను ఆయన అభిమానిని. మా మధ్య ఉన్నది అభిమాని, స్టార్ మధ్య ఉన్న బంధం. ప్రభాస్ అన్న ప్రేమ దక్కినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి’ అని యంగ్ హీరో సంతోష్ శోభన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం’. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా సంతోష్ శోభన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఏక్ మినీ కథ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు "కళ్యాణం కమనీయం" కథ విన్నాను. నా మిత్రుడు, ఈ సినిమా కో ప్రొడ్యూసర్ అజయ్ దర్శకుడు అనిల్ కుమార్ ను పరిచయం చేశారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చింది. మనం రెండు రకాల సినిమాలు చూస్తుంటాం. ఒకటి ఆస్పిరేషనల్, రెండోది రిలేటబుల్. ఇది మనందరికీ రిలేట్ అయ్యే కథ. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. కథ చెప్పగానే సంతోషంగా ఒప్పుకున్నాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ►సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసుకోవాలనేది నా కల. అది ఈ చిత్రంతో తీరుతోంది. బిగ్ స్టార్స్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇది చిత్ర పరిశ్రమకు పెద్ద సంక్రాంతి. ఈ పండక్కి విడుదలవుతున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు చిత్రాలతో పాటు ‘కళ్యాణం కమనీయం’ కూడా ఆదరించండి ►నేను ఇప్పటిదాకా చేసిన సోషల్ కామెడీ మూవీస్ లో నా పాత్రలు రియాల్టీకి కొంత దూరంగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో నేను చేసిన శివ క్యారెక్టర్ చాలా జెన్యూన్ గా ఉంటుంది. ఇందులో ఫేక్ నెస్ లేదు. ఆ సిట్యువేషన్ కు తగినట్లు శివ క్యారెక్టర్ నిజాయితీగా రెస్పాండ్ అవుతుంది. ►ఇందులో శృతి జాబ్ చేస్తుంది శివకు ఉద్యోగం ఉండదు. అయితే ఇదొక్కటే కథలో కీలకం కాదు. ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితంలో ఎదురైన పరిస్థితులను తట్టుకుని ఎలా ముందుకు సాగారు అనేది చూపిస్తున్నాం. రెగ్యులర్ ఫార్మేట్ సినిమా కొలతలు "కళ్యాణం కమనీయం" లో ఉండవు. ఈ సినిమా ఒక ఎక్సీపియరెన్స్ లా ఉంటుంది. ► లైఫ్ అంటే ఒకరి మీద మరొకరం ఆధారపడటం. నాన్న మాకు దూరమైనప్పుడు అమ్మ మమ్మల్ని ఏ కష్టం తెలియకుండా పెంచింది. అప్పుడు అమ్మ మీద ఆధారపడ్డాను. లైఫ్ లో ఒక సందర్భం వస్తే భార్య సంపాదన మీద భర్త కొంతకాలం లైఫ్ లీడ్ చేస్తాడు. అది వాళ్లిద్దరికి మధ్య సమస్య. భార్యా భర్తలకు ఇష్టమైతే వాళ్ల జీవితాన్ని ఎలాగైనా గడుపుతారు. నేను నిజ జీవితంలో జాబ్ లేకుంటే బాధపడాలి. నేను ఆ క్యారెక్టర్ లో నటిస్తున్నా కాబట్టి పర్సనల్ గా తీసుకోలేదు. ► ఈ చిత్రంలో పాటలు కథను ఎక్కడా బ్రేక్ చేయవు. కథ కూడా పాటలతో ముందుకు వెళ్తుంది. శ్రావణ్ భరద్వాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. అలాగే కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఆకర్షణ అవుతుంది. ► యూవీ క్రియేషన్స్ సంస్థ నా ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటిది. ఇక్కడ మూడు చిత్రాలు చేశాను. మరో ముప్పై చేసేందుకైనా సిద్ధం. నా లైఫ్ లో పేరున్న దర్శకులు మారుతి, మేర్లపాక గాంధీ లాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ల దగ్గర ఎంత నేర్చుకున్నానో ఈ చిత్ర దర్శకుడు అనిల్ దగ్గర అంతే నేర్చుకున్నాను ► కథల ఎంపికలో నిర్ణయం నాదే. నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్స్ క్రెడిట్ తీసుకుంటా. అప్పుడే మనశ్సాంతిగా ఉంటుంది. ప్రస్తుతం నందినీ రెడ్డి గారి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ లో అన్ని మంచి శకునములే అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది కాకుండా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా చేస్తున్నాను.