ఓటీటీకి వచ్చేసిన కళ్యాణం కమనీయం, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే | OTT: Santosh Soban Kalyanam Kamaneeyam Movie Now Streaming on AHA | Sakshi
Sakshi News home page

Kalyanam Kamaneeyam OTT Streaming: ఓటీటీకి వచ్చేసిన ‘కళ్యాణం కమనీయం’, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే

Published Sat, Feb 18 2023 12:32 PM | Last Updated on Sat, Feb 18 2023 12:39 PM

OTT: Santosh Soban Kalyanam Kamaneeyam Movie Now Streaming on AHA - Sakshi

యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్‌ బాయ్‌ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్‌ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేదు.

సంక్రాంతికి స్టార్‌ హీరో చిత్రాలు ఉండటంతో కళ్యాణం కమనీయం ఆడియన్స్‌ దృష్టిని ఆకట్టుకుకోలేకపోయింది. అంతేకాదు థియేటర్లు కూడా ఎక్కువగా దొరకకపోవడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. దీంతో ఈ చిత్రానికి బిగ్‌స్రీన్‌పై పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. విడుదలైన నెల రోజులకే కళ్యాణం కమనీయం ఓటీటీలోకి రావడం విశేషం. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహా ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది.

చెప్పినట్టుగానే శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడే పెళ్లి బంధం నిలబడుతుందనే స్టోరీ లైన్‌తో దర్శకుడు అనిల్ కుమార్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాతో హీరోయిన్ ప్రియా భవాని శంకర్ నటించింది. ఈ చిత్రంతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవిత్ర లోకేశ్‌ వంటి తదితర నటులు ప్రధాన పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement