క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్‌ ఛాన్స్‌ | Alekhya Harika Get Movie Chance With Sai Rajesh | Sakshi
Sakshi News home page

Alekhya Harika: క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్‌ ఛాన్స్‌

Published Sat, Oct 28 2023 5:58 PM | Last Updated on Sat, Oct 28 2023 6:13 PM

Alekhya Harika Get Movie Chance With Sai Rajesh - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం, యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక అలియాస్‌ అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేత్తడి అనే యూట్యూబ్‌ చానల్‌ ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్‌ సీజన్‌-4 ఆఫర్‌ అందుకున్నఆమె టాప్‌ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. తర్వాత ఆమె పలు షోలలో మెరిసింది. కానీ కొంత కాలంగా ఆమె బుల్లితెరకు దూరంగానే ఉంటూ వస్తుంది.

తాజాగా అలేఖ్య హారిక  హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందులో యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ ప్రధాన కథానాయకుడు కాగా ఆయనకు జోడీగా ఆలేఖ్య హారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బేబీ మేకర్స్‌ నిర్మాత SKN, డైరెక్టర్‌ సాయి రాజేష్‌లు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు టాక్‌. సాయి రాజేష్‌ ఇప్పటికే బేబీ సనిమాతో యూట్యూబర్‌ వైష్ణవి చైతన్యకు బిగ్‌​ ఛాన్స్‌ ఇచ్చాడు. 

యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హారికను హీరోయిన్‌గా సాయి రాజేష్‌ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.  తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాను తెరకెక్కించాలని వారు ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ, ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్స్‌ పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. రేపు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది.

చిన్న సినిమాలకు బెస్ట్‌ ఆప్షన్‌గా సంతోష్‌ శోభన్‌ ఉన్నారు. ఆతనితో తెరికెక్కించిన ప్రతి సినిమా మినిమమ్‌ ఆడియన్స్‌కు రీచ్‌ అవుతుందని తెలిసిందే. బిగ్‌బాస్‌ నుంచి వచ్చాక హారిక సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్‌ బిజీగా మారింది. తర్వాత కొద్దిరోజులకే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదరు. కానీ సోషల్‌ మీడియాలో తరచూ వీడియోలు, హాట్‌హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ నెట్టింట ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. ఈ సినిమా ప్రాజెక్ట్‌ నిజంగానే పట్టాలెక్కుతే ఆమెకు మళ్లీ పలు ఛాన్స్‌లు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement