వైవిధ్యమైన కథాంశంతో...
‘గోల్కొండ హైస్కూల్’లో నటుడిగా, ‘తను నేను’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న నూతన చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కాషిష్ వోహ్రా నాయిక. ప్రముఖ దర్శకులు కృష్ణవంశీ శిష్యుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సింప్లిజిత్ ప్రొడక్షన్స్‌పై అభిజిత్ జయంతి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వంశీ పైడిపల్లి కెమెరా స్విచాన్ చేయగా, సింప్లిజిత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డెరైక్టర్ మాధవీలత క్లాప్ ఇచ్చారు. ‘‘సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. సంతోష్ శోభన్ కెరీర్‌లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు చెప్పారు. సంగీతం: డీజే వసంత్, కెమెరా: సామల భాస్కర్.