Actor Santosh Sobhan Intresting Comments About Like Share & Subscribe
Sakshi News home page

కెరీర్‌లో మొదటిసారి అలాంటి పాత్ర చేశాను : సంతోష్‌ శోభన్‌

Published Fri, Nov 4 2022 9:59 AM | Last Updated on Fri, Nov 4 2022 10:53 AM

Santosh Sobhan Shares Intresting Comments About Like Share And Subscribe - Sakshi

‘‘నాన్న (దర్శకుడు శోభన్‌) దూరమై 14 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఆయన గురించి మంచిగా చెబుతున్నారు.. నన్ను నవ్వుతూ పలకరిస్తున్నారంటే వారి రూపంలో నాన్న నాతో ఉన్నట్టే. ఇది నా అదృష్టంగా భావించి మరింత కష్టపడుతున్నాను’’ అన్నారు సంతోష్‌ శోభన్‌. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్‌ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంతోష్‌ శోభన్‌ పంచుకున్న విశేషాలు.

‘ఏక్‌ మినీ కథ’ తర్వాత నేను, గాందీగారు మళ్లీ సినిమా చేయాలనుకున్నాం. ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’తో కుదిరింది. ఇందులో నేను చేసిన యూట్యూబర్‌ విప్లవ్‌ పాత్ర నా మనసుకు చాలా నచ్చింది. కెరీర్‌లో మొదటిసారి నా ఏజ్‌ పాత్ర చేశాను. మేర్లపాక గాంధీగారి ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ సినిమాలోలా హైపర్‌ ఎనర్జిటిక్‌ క్యారెక్టర్‌ ఇది. ∙‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్రై్కబ్‌’ కథ అందరూ రిలేట్‌ చేసుకునేట్లు ఉంటుంది.

ట్రావెల్‌ బ్లాగర్‌గా మొదలైన ఈ కథ యాక్షన్‌ కామెడీగా మలుపు తీసుకోవడం ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ∙ప్రభాస్‌గారు ఇండియా బిగ్గెస్ట్‌ స్టార్‌. మా సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్‌.. ఇలా ఏదో ఒకటి రిలీజ్‌ చేసి, ప్రోత్సహించడం ఆయన గొప్పదనం. ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ నేను గర్వపడే సినిమా. ప్రభాస్‌గారికి టైమ్‌ కుదిరితే ఈ సినిమా చూపించడం నా కల. నందినీ రెడ్డిగారి దర్శకత్వంలో నేను నటించిన ‘అన్నీ మంచి శకునములే’ డిసెంబరు 21 వస్తోంది. యూవీ క్రియేషన్స్‌లో ‘కల్యాణం కమణీయం’ సినిమా ఉంది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement