
సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ ముఖ్య తారలుగా జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
‘‘హైదరాబాద్, ముంబై, పూణే, కేరళ తదితర ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. దర్శకుడు సంపత్‌నంది బర్త్‌డే సందర్భంగా ఈరోజు మా సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తున్నాం. జూలైలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాశ్‌రెడ్డి నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: భీమ్స్.
Comments
Please login to add a commentAdd a comment