బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్‌లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్‌లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.
మరోసారి ఫ్యామిలీస్..
ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్‌లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది.
గౌతమ్‌పై శివాజీ పంచులు
గౌతమ్‌ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్‌లో ఉన్నవారికి కూడా గేమ్‌పై ఓ క్లారిటీ రానుంది.
చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు
Comments
Please login to add a commentAdd a comment