
రత్నాకర్, రాజేశ్ కొంచాడ, స్వామి
రాజేశ్ కొంచాడ, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన వింటేజ్ విలేజ్ ఎమోషనల్ లవ్ డ్రామా ‘కౌసల్య తనయ రాఘవ’(Kausalya Thanaya Raghava). స్వామి పట్నాయక్ దర్శకత్వంలో ఏఆర్ మూవీ మేకర్స్ పతాకంపై అడపా రత్నాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
‘‘ఈ నాటి ప్రసారంలో... రామాపురంలో సీతారాముల కథ..’, ‘ఈ సీత ప్రేమలో రాముడి పడితే..’ అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు వస్తుంది’’ అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజేశ్ అన్నారు. ‘‘మా సినిమాను థియేటర్స్‌లో చూసి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు స్వామి పట్నాయక్, రత్నాకర్.