
Director Krish Launched Taxi Movie Trailer: 'కర్త కర్మ క్రియ' సినిమాతో తెలుగు హీరోగా పరిచయం అయ్యాడు వసంత్ సమీర్ పిన్నమరాజు. వసంత్ హీరోగా హెచ్ అండ్ హెచ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జా నిర్మిస్తున్న థ్రిల్లర్ చిత్రం 'టాక్సీ'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద డైరెక్షన్ విభాగంలో పనిచేసిన హరీశ్ సజ్జా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్మాస్ మోటీవాల, సూర్య శ్రీనివాస్, సౌమ్యా మీనన్, ప్రవీణ్ యండమూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మార్క్ రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు బిక్కీ విజయ్ కుమార్ నిర్మాత. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 1 నిమిషం 59 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంత ఇంటెన్స్‌గా ఆకట్టుకుంది. కాలిఫోర్నియమ్ 252 అనే అరుదైన హ్యూమన్ మేడ్ మెటల్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉన్నట్లు తెలుస్తోంది. డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం
నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?
Comments
Please login to add a commentAdd a comment