‘‘రోటి కపడా రొమాన్స్’ ట్రైలర్ బాగుంది. యూత్‌కి ఏదో కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ప్రతి సంవత్సరం యంగ్ జనరేషన్ చేసిన సినిమా సెన్సేషన్ హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా ఆ కోవలో చేరాలని కోరుకుంటున్నాను. న్యూ టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్న బెక్కెం వేణుగోపాల్‌లాంటి నిర్మాతలు సక్సెస్ అవ్వాలి’’ అని హీరో నాని అన్నారు.
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం నవంబరు 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నానీతో ట్రైలర్ రిలీజ్ చేయించారు. ‘‘యువతరానికి నచ్చే అంశాలకు కుటుంబ భావోద్వేగాలను మేళవించి ఎమోషనల్ రైడ్ మూవీలా రూపొందించాం’’ అని నిర్మాతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment