మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలోకి వచ్చిన మరీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేయబోతుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. తేదీ మాత్రం కన్ఫర్మ్ అని అంటున్నారు. తమిళంలో రెండేళ్ల క్రితమే వచ్చిన ఈ మూవీ.. తాజాగా తెలుగులో రిలీజైంది. ఇప్పుడు మూవీ లవర్స్ కోసం డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేయనుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)
'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'మిరల్'. 2022 నవంబరులో తమిళంలో రిలీజైంది. ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత అంటే గత నెల 17న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైంది. హడావుడి లేకుండా వచ్చి అంతే ఫాస్ట్‌గా వెళ్లిపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేయబోతుంది.
తమిళ వెర్షన్ ఇదివరకే ఆహాలో అందుబాటులో ఉంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా ఇదే ఓటీటీలోకి జూన్ 7 నుంచి అందుబాటులోకి రానుందని సమాచారం. అదే రోజు హన్సిక నటించిన '105 మినిట్స్' మూవీ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై క్లారిటీ వస్తే ఈ వీకెండ్ మూవీ లవర్స్ టైమ్ పాస్ చేసేయొచ్చు.
(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా)
Comments
Please login to add a commentAdd a comment