
మీ సేవలు గొప్పవి
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. వారి త్యాగాలను కొనియాడారు. అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
నిజామాబాద్ క్రైం : పోలీసులు సమాజ సేవలో ఉన్నందుకు గర్వపడాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో అమర పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీ సులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించటం బాధాకరమన్నారు. వారి త్యాగాలు మరువలేనివన్నారు. ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా పోలీసులు ముందుండి శాంతిభద్రతలు కాపాడుతున్నారని కొని యాడారు.
దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవి స్తున్నారంటే, దాని వెనుక పోలీసుల కృషి ఎంతో ఉందన్నారు. తెలంగాణవ్యాప్తంగా విధి నిర్వహణలో ఈ ఏడాది ముగ్గురు పోలీసులు మృతి చెందారని పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిది గం టలపాటు పనిచేస్తే పోలీసులు 24 గంటల పాటు విధులలో ఉంటారని అన్నారు. పోలీసు అమర వీరుల కుటుంబాలు ఆపదలో ఉన్నప్పుడు తక్షణమే వారికి సహాయం అందించాలని అధికారులకు సూచించారు. ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల కోసం కృషి చేస్తుంది పోలీస్ శాఖయేనన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది పోలీసులు, వివిధ పోలీసు కంపెనీలకు చెందిన సిబ్బంది 653 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
రాష్ట్రంలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో డీపీ ఓ ఉద్యోగి సుశీల ఆలపించిన దేశభక్తి గీతం ఆకట్టుకుంది. అంతకు ముందు కలెక్టర్, ఎస్‌పీ తదితరులు అమర పోలీసుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయ రు ఆకుల సుజాత, అదనపు ఎస్‌పీ పాండునాయక్, ఏఆర్ డీఎస్‌పీ ఎం వెంకటేశ్వర్లు, డీటీసీ డీఎస్‌పీ పుల్లెల రాజబాబు, నగర సీఐ నర్సింగ్‌యాదవ్, నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటశ్వర్లు, నగర ఎస్‌ఐలు, పోలీసు అధికారులు అమర పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు.
అమర పోలీసుల సాక్షిగా పనిచేయాలి
డిచ్‌పల్లి : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సాక్షిగా శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్ వై.శ్రీనివాసరావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బెటాలియన్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కమాం డెంట్, అసిస్టెంట్ కమాం డెంట్లతోపాటు అమరవీరుల కుటుంబాల సభ్యులు, బెటాలియన్ సిబ్బంది పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఇప్పటివరకు ఏడో బెటాలియన్‌కు చెందిన 11 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు.
వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఏదేని సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండి బెటాలియన్‌కు మంచి పేరు తేవాలని ఆయన సిబ్బందికి సూచించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది అమరులైన పోలీసుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం తుపాకులను కిందకు దించి అమర పోలీసులకు నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్‌లు కుమారస్వామి, అమృతరావు, రామాంజనేయులు, ప్రసన్నకుమార్, బీడబ్ల్యుఓ మహేందర్, ఆర్‌ఐలు నయీం, దామోదర్, ఆర్‌ఎస్‌ఐలు, బెటాలియన్ సిబ్బంది, అమర పోలీసుల కుటుంబాల సభ్యులు, సర్పంచ్ అంజయ్య, తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు మమత, రవీందరెడ్డి, కంజర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సింధు, టాటా గోల్డ్‌ప్లస్ ప్రతినిధులు రవిదాస్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. చివరగా, పోలీసుల అమర వీరుల దినం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమ తులను అందజేశారు.