నవాబుపేట మండలం పోమాల్‌లో ఇంటి యజమాని కాళ్లు కడుగుతున్న సిబ్బంది
నవాబుపేట (జడ్చర్ల): బాబ్బాబు మీ కాళ్లు కడుగుతాం.. ఎలాగైనా సరే ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోండి.. అంటూ గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ జిల్లాను వంద శాతం ఓడీఎఫ్‌గా మార్చాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సైతం ఇళ్లిళ్లూ తిరుగుతూ మరుగుదొడ్డి లేని వారికి అవగాహన కల్పిస్తున్నారు.
ఈ మేరకు జిల్లాలోని నవాబుపేట మండలం పోమాల్ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం వినూత్న ప్రచారం చేశారు. మరుగుదొడ్డి లేని ఇళ్లను గుర్తించి ఆ ఇంటి యాజమాని కాళ్లు కడిగి విజ్ఞప్తి చేయడంతో పాటు పాటు ఇంటి మహిళకు బొట్టు పెట్టి యజమానిని ఒప్పించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, శ్రీశైలం, రాజు, శ్రీౖశైలం, చంద్రయ్య, ఎస్‌బీఎం బృందం మల్లికార్జున్, రవితో పాటు అంగన్‌వాడీ, ఆశ, సాక్షరభారత్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment