సాక్షి, హైదరాబాద్: బెటర్ ఇండియా వెబ్‌సైట్ దేశంలోని స్ఫూర్తిదాయక ఐఏఎస్ అధికారుల జాబితాను రూపొం దించింది. మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొలికెరి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది. వినూత్న ఆలోచనలతో కొత్తరకమైన కార్యక్రమాలకు శ్రీకారంచుట్టి, ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని వీరిద్దరి గురించి బెటర్ ఇండియా సంస్థ పేర్కొంది.
భారతి హొలికెరి గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యసేవలను మెరుగుపర్చారని పేర్కొంది. మెదక్ జిల్లాను వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చారు. ఇక రొనాల్డ్ రాస్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రజల అభ్యున్నతికి విభిన్న కార్యక్రమాలను అమలుచేశారు. హరితహారం అమలుచేసి జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపారు. దివ్యాంగ సోలార్ సొసైటీ ఏర్పాటుచేసి దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేశారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేసేలా వినూత్న కార్యక్రమాలు అమలుచేశారు’ అని బెటర్ ఇండియా సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment