purchasing centers
-
దళారికి రొక్కం.. రైతుకు దుఃఖం
అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలకు కష్టకాలం దాపురించింది. చెమటోడ్చి పండించిన పంటకు మద్దతు ధరను దక్కించుకోలేని దుస్థితిలో రైతాంగం విలవిల్లాడిపోతోంది. ప్రకృతి వైపరీత్యాలకు మించి ‘దోపిడీ విపత్తు’ కర్షకులను ముంచేస్తోంది. పంట చేతికొచ్చిందన్న సంతోషం క్షణకాలంలో ఆవిరై పోతోంది. ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో ‘దళారీ రాజ్యం’ రాజ్యమేలుతోంది.రైతులకు మద్దతు ధర దేవుడెరుగు.. చెప్పిన రేటుకు ధాన్యం ఇవ్వకుంటే కల్లంలో నుంచి సరుకు బయటకు వెళ్లే పరిస్థితే కనిపించడం లేదు. పేరుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ధాన్యం కొనేది దళారులే. ప్రభుత్వానికి రైతుల పేరుతో ధాన్యం విక్రయించేదీ దళారులే. సంపూర్ణ మద్దతు ధర అందించాల్సిన కూటమి ప్రభుత్వం.. మిల్లర్లు, వ్యాపారుల దందాకు గేట్లు తెరిచి రైతుల నోట్లో మట్టి కొడుతోంది.పంపాన వరప్రసాదరావు, వీఎస్వీ కృష్ణ కిరణ్ (సాక్షి, అమరావతి) : రాష్ట్రంలో కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోలేక అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సాధారణ రకానికి క్వింటా రూ.2300, ఏ గ్రేడ్‌కు రూ.2,320గా మద్దతు ధర ప్రకటించింది. అంటే 75 కేజీల బస్తా సాధారణ రకానికి రూ.1,725, ఏ గ్రేడ్‌కు రూ.1,740 చొప్పున మద్దతు ధర చెల్లించాలి. కానీ, కూటమి ప్రభుత్వం ఏలుబడిలో 75 కేజీల బస్తాకు రూ.150 నుంచి రూ.325 వరకు రైతులు నష్టపోతున్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల ప్రారంభం నుంచే ఈ దోపిడీ పర్వం ఊపందుకుంది. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ప్రోద్బలంతోనే దళారులు చక్రం తిప్పుతున్నారు. పైకి మాత్రం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది.రైతుల ఖాతాల్లో పూర్తి మద్దతు ధర జమ చేస్తున్నట్టు లెక్కలు చూపిస్తోంది. కానీ, ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతుల్లో నూటికి 90 శాతం మంది బస్తాకు రూ.150 నుంచి రూ.325 నష్టాన్ని మూటగట్టుకుని అమ్ముకున్న దుస్థితి క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది. ఏలూరు జిల్లా నల్లజర్ల, భీమడోలు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు తీరును ‘సాక్షి’ బృందం పరిశీలించింది. ఈ పరిశీలనలో మిల్లర్ల దందా, దళారుల దోపిడీతో రైతులు పడుతున్న వెతలు వెలుగు చూశాయి. సిండికేట్‌గా మారిన మిల్లర్లు ⇒ రైతులకు మేలు చేసేందుకే అంటూ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ఎత్తేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం మిల్లర్లు, దళారుల నెత్తిన పాలు పోసినట్టయ్యింది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు/వ్యాపారులు సిండికేట్ అయ్యారు. జట్టు కూలీల (హమాలీలు)ను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కోత కోసిన తర్వాత పంటను బస్తాల్లోకి నింపి వాహనాల్లో ఎక్కించాలంటే కూలీలు అవసరం. కానీ రైతులు జల్లెడపట్టినా కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది.⇒‘దళారీ మాకు ముందుగానే రూ.10 వేలు ఇచ్చారు. ప్రభుత్వానికి పని చేస్తే డబ్బులు ఎప్పుడో వస్తాయి. మా ఇబ్బందులు మాకుంటాయి. అందుకే వెంటనే కూలి వచ్చేచోటే పనికి వస్తున్నాం’ అంటూ ఓ హమాలీ చెప్పుకొచ్చారు. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుందామంటే కనీస సౌకర్యాల్లేక రైతులకు దిక్కుతోచడం లేదు. రోడ్లపై ఆరబెట్టుకుందామంటే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం తరఫున పని చేసేందుకు కూలీలు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. దీంతో చేసేది లేక ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నష్టానికే తెగనమ్ముకోవాల్సి వస్తోంది.పెట్టుబడి సాయం అందక అప్పులు⇒ గత ఐదేళ్లలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మేలో తొలి విడత పెట్టుబడి సాయం రూ.7,500 చొప్పున రైతుల ఖాతాకు జమ అయ్యేది. అలాగే పంటల బీమా పరిహారం కూడా రైతుల ఖాతాలో జమ చేసేవారు. ఖరీఫ్ పంట సాగులో దుక్కి పనులతో పాటు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు ఈ సొమ్ము ఎంతగానో అక్కరకు వచ్చేది. ⇒ తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ హామీ ఇచ్చిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా రూపాయి కూడా జమ చేయలేదు. దీంతో ఈ ఏడాది పెట్టుబడి పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు నానా అగచాట్లు పడ్డారు. ⇒ అత్యధిక శాతం మంది రైతులు ధాన్యం వ్యాపారుల (దళారులు) వద్ద చేబదులు తీసుకొని సాగు చేస్తే, మరికొంత మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3–5తో వడ్డీకి అప్పులు తెచ్చి మరీ పంట సాగు చేశారు. మరో వైపు విత్తు నుంచి కోత వరకు రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో విజృంభించిన తెగుళ్లు, చీడపీడల దాడికి దిగుబడులు కాస్త తగ్గిపోయాయి. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. కోసిన తర్వాత తేమ లేకుండా ఆరబెట్టి, కేంద్రానికి తీసుకెళ్లేందుకు నానా పాట్లు పడుతున్నారు. ⇒ ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. పంట ఆరబెట్టుకునేందుకు కూలీల ఖర్చు భారంగా మారుతోంది. సరైన టార్ఫలిన్లు, ఫ్లాట్‌ఫారాలు లేక పోవడంతో పంటను జాగ్రత్త చేసి మంచి రేటుకు అమ్ముకునే గత్యంతరం లేక నష్టమని తెలిసినా తక్కువ రేటుకే దళారులకు తెగనమ్ముకుంటున్నారు. రూ.1,480 కోట్ల దోపిడీకి ప్లాన్!⇒ ఖరీఫ్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యంగా ప్రకటించింది. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తోంది. అయితే రైతులు కోసిన పంటను బస్తాల్లో నింపి, మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి రైతుల పంటను మిల్లులకు తరలించేందుకు కమీషన్ల పేరిట భారీ దోపిడీకి తెరదీశారు.⇒ ప్రస్తుత సీజన్లో కోసిన పంటను కోసినట్టే విక్రయిస్తే దళారులు 75 కేజీల బస్తాకు రూ.1,400కు బేరం కుదుర్చుకుంటున్నారు. కొంత ఆరిన పంటకు రూ.1550 – రూ.1600 లెక్కగడుతున్నారు. ఇలా టన్నుకు ఒక్కో రైతు సుమారు రూ.2,100 నుంచి రూ.4 వేల వరకు నష్టపోతున్నాడు. ఈ లెక్కన 37 లక్షల టన్నుల సేకరణకు రూ.6,382 కోట్లు మద్దతు ధర రైతులుకు ఇవ్వాల్సి ఉండగా, ఇందులో సుమారు రూ.1,480 కోట్ల మేర మిల్లర్లు, దళారులు కలిసి బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది.గత ప్రభుత్వంలో దళారులకు ముకుతాడు⇒ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రస్తుతం కోతలు ప్రారంభం అయ్యాయి. ఈ నెలాఖరు నాటికి మిగిలిన జిల్లాల్లో కోతలు ఊపందుకుంటాయి. డిసెంబర్లో పూర్తి స్థాయిలో ధాన్యం ఉత్పత్తులు వస్తాయి. అయితే ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే పౌర సరఫరాల సంస్థ రూ.50.90 కోట్లు విలువైన 22,122 టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కానీ, ఇప్పటికీ ధాన్యం విక్రయించిన వారిలో చాలా మంది రైతులకు రెండు రోజులు దాటినా మద్దతు ధర జమ కాలేదు. ⇒ గత ప్రభుత్వంలో రైతులకు వాస్తవ మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. ట్రక్ షీట్ జనరేట్ చేసే సమయంలోనే ఏ మిల్లుకు లోడు వెళ్తుందో తెలిసేది. దీంతో దళారులు ముందుగా రైతులను మభ్యపెట్టే, బెదిరించే ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రైతులు సొంతంగా ధాన్యాన్ని మిల్లుకు తోలుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు(జీఎల్టీ) చార్జీలు ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సుమారు రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించింది. దాదాపు 39 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించింది.కోతకు రెట్టింపు ఖర్చయ్యిందినేను ఆరు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. రెండు రోజుల కిందటే పంటను (సంపత్ స్వర్ణ) కోశాను. తేమ శాతం ఎక్కువగా ఉంటే సరైన ధర దక్కట్లేదు. అందుకే దేవుడిపైనే భారం వేసి రోడ్డు పక్కన ఆరబోస్తున్నా. ఇటీవల వర్షానికి చేను వాలిపోయింది. అందుకే మిషన్‌పై ఎకరా పంటను గంటలో కోయాల్సి ఉండగా రెండున్నర గంటలు పట్టింది. ఎకరా కోతకు రూ.3 వేలు అవుతుంటే.. నాకు మాత్రం రూ.7 వేలు దాటింది. ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.26 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఆ స్థాయిలో మాత్రం మాకు మద్దతు ధర దక్కట్లేదు. – మర్రిపూడి నాగరాజు, అచెన్నపాలెం, ఏలూరు జిల్లాపెట్టుబడి సాయం అందలేదు1.80 ఎకరాల్లో ఎంటీయూ 7029 రకం వరి వేశాను. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చయ్యింది. ఎకరాకు 30 బస్తాల దిగుబడి వచ్చింది. ఈసారి పెట్టుబడి లేక చాలా అగచాట్లు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందని ఆశగా ఎదురు చూశాం. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు కోసిన పంటను అయినకాడకి అమ్ముకోవాల్సి వస్తోంది. – చావా నాగేశ్వరరావు, నల్లజర్ల, ఏలూరు జిల్లాఆరబెట్టుకునే అవకాశం లేదునేను ఐదెకరాల్లో వరి సాగు చేశా. ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ధాన్యం షావుకారు(వ్యాపారి) వద్ద చేబదులు తీసుకున్నాం. ఆరబెట్టుకునేందుకు అవకాశం లేక వ్యాపారికే అమ్మేసుకున్నా. ప్రభుత్వం వసతులు కల్పించి ఉంటే మాకు మంచి ధర దక్కేది. – ప్రగడ సురేష్, గౌరీపట్నం, పశ్చిమగోదావరి జిల్లాఆరబెట్టుకోలేకే అమ్ముకుంటున్నాం⇒ ఏలూరు జిల్లా నల్లజర్ల మండలం మారెళ్లమూడికి చెందిన రైతు రామాంజనేయులు 3 ఎకరాల్లో పీఆర్ 126 రకం వరి వేశాడు. 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో బెంగళూరు నుంచి వచ్చే యంత్రాల సాయంతో కోత కోశారు. గంటకు రూ.3 వేలు తీసుకున్నారు. ‘కోసిన ధాన్యాన్ని ఆరబెడితే కానీ తేమ శాతం తగ్గదు. తేమ శాతం తగ్గితే కానీ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర ఇవ్వరు. ఆరబెట్టేందుకు గ్రామాల్లో కనీస సౌకర్యాల్లేవు. చేసేది లేక ధాన్యం షావుకారుకు బస్తా రూ.1,400 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ ఇంకా డబ్బులు చేతికి రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో రైతు కమిటీలకు ట్రాక్టర్లు, హార్వస్టర్లు, కల్టివేటర్లు ఇచ్చారు. అదే విధంగా డ్రైయర్లు, టార్పాలిన్లు ఇస్తే ధాన్యాన్ని ఆరబెట్టుకోవచ్చు. తేమ శాతం తగ్గాక మద్దతు ధరకు అమ్ముకోగలుగుతాం’ అని చెప్పుకొచ్చాడు.గతిలేక షావుకారికి అమ్మేశా⇒ ఈ రైతు పేరు మొన్ని శ్రీను. ఏలూరు జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన ఈయన ఖరీఫ్‌లో రెండెకరాల్లో సంపత్ స్వర్ణ రకం వరి సాగు చేశాడు. ఈసారి పెట్టుబడి సాయం అందక షావుకారుల దగ్గర చేబదులు తీసుకున్నాడు. ఎకరాకు 37 బస్తాల దిగుబడి వచ్చింది. ‘కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముకుందామనుకున్నా. కొనుగోలు కేంద్రంలో అమ్ముకుంటే బస్తా (75 కేజీలు)కు రూ.1,725 వస్తుంది. కానీ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు.పైగా పట్టుబడి పట్టే వాళ్లు (హమాలీలు) అందరూ షావుకారుల దగ్గరే ఉన్నారు. అందుకే షావుకారుతో మాట్లాడాను. తేమ శాతం ఎక్కువగా ఉందన్న కారణంతో బస్తాకు రూ.1,400 చొప్పున ఇస్తానన్నారు. అది కూడా 15 రోజులకో.. 20 రోజులకో ఇస్తారు. నష్టపోతున్నామని తెలుసు. కానీ వాళ్లకు అమ్మడం తప్ప మాకు వేరే దారి లేద’ని ఆవేదన వ్యక్తం చేశాడు. -
మౌలిక వసతులేవి..?
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంట కోతలు మొదలైనా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు దిశగా పౌరసరఫరాల శాఖ కదలడం లేదు. కేంద్రాల ఏర్పాటు అంశాన్ని జిల్లాల యంత్రాంగానికి అప్పగించిన అధికారులు కొనుగోళ్ల సమయంలో సమకూర్చాల్సిన మౌలిక వసతుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ నెలాఖరు కల్లా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జరుగుతుందని చెపుతున్నప్పటికీ .. కనీస సదుపాయాలను కల్పించే దిశగా దృష్టి పెట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే 6,500 కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లు, తేమ పరీక్ష మెషీన్లు, తూకం యంత్రాలు, తాలు తొలగించేందుకు వినియోగించే ఫ్యాన్లు, కాలిపర్స్ వంటి పరికరాలను సమకూర్చాలి. పాత గన్నీ బ్యాగులు తప్ప, కొత్తగా ఒక్కటి రాలేదు. పశ్చిమబెంగాల్ నుంచి కోట్ల సంఖ్యలో గన్నీ బ్యాగులు రావలసి ఉంది. దీంతో ఈ సారి ధాన్యం కొనుగోళ్ల తీరు ఎలా ఉంటుందోనని జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టార్పాలిన్లు లేక రైతుల అవస్థలు.. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు టార్పాలిన్లు అవసరం. వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్లు రక్షణగా ఉంటాయి. అయితే ప్రతి సీజన్లో టార్పాలిన్ల సమస్య తీవ్రంగానే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 1,74,856 టార్పాలిన్లు అవసరం కాగా, ప్రస్తుతం 1.41 లక్షల టార్పాలిన్లు అందుబాటులో ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కలు చెపుతున్నాయి. విన్నోయింగ్ (ధాన్యంలోని రాళ్లు, ఇతర నిరుపయోగమైన వాటిని తొలగించే) మెషీన్లు 5,119 అవసరం ఉండగా, అందుబాటులో ఉన్నవి 2,125 మాత్రమే. ధాన్యాన్ని శుభ్రపరిచే ప్యాడీ క్లీనర్లు 7,501కి గాను 4,195 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తేమను పరీక్షించే మిషన్లు 8,444 అవసరం కాగా, 7,905 అందుబాటులో ఉన్నాయి. మరో 539 కొనుగోలు చేయాల్సి ఉంది. తూకపు యంత్రాలు కూడా ఇంకా 312 అవసరం. ధాన్యంలో తాలును తొలగించేందుకు 5,097 యంత్రాలు అవసరం కాగా, ఒక్కటి కూడా లేదని తెలుస్తోంది. గత యాసంగి సీజన్లో రైతులే ఫ్యాన్లు సమకూర్చుకొని తాలును తొలగించుకున్నారు. అలాగే 4,906 కాలిపర్స్లు అవసరంకాగా, 31 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 5,080 జాలీలు అవసరం కాగా, 43 మాత్రమే ఉన్నాయి. సొంత కల్లాల్లో ఆరబెట్టుకోవలసిందే.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి కుప్పలుగా పోసి, ఆరబెట్టి విక్రయించే తీరుకు గత యాసంగి నుంచే ప్రభుత్వం చెక్ పెట్టింది. రైతులు పంటలు కోసిన తరువాత పొలాల్లోనే కుప్పలు పోసి , అరబెట్టి, తాలును తూర్పారపట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రైతులు తమ సొంత స్థలాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు నేరుగా విక్రయించేలా బస్తాలలో తీసుకురావలసి ఉంటుంది. టోకెన్ విధానంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. వసతుల కల్పనకు ఆదేశాలు రాష్ట్రంలో జిల్లాల వారీగా అవసరమైన కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశాం. రైతులు పండించిన ధాన్యం మొత్తం సేకరించాలని నిర్ణయించాం. కోతలు ఇప్పుడిప్పుడే మొదలైన నేపథ్యంలో నెలాఖరు కల్లా అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. అలాగే గన్నీ బ్యాగులతో పాటు టార్పాలిన్లు, విన్నోయింగ్ మెషీన్లు, తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. – పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ -
‘తాలు’ తీస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్ : అకాల వర్షాలు.. అనుకోని రోగాలు.. ఈ విపత్కర పరిస్థితులను తట్టుకుని పంట కోతకు నానా అగచాట్లుపడి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తే సవాలక్ష ఇక్కట్లు.. రైతులు తెచ్చిన ధాన్యంలో తాలు ఎక్కువుందంటూ మిల్లర్లు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యానికి మిల్లింగ్ కేంద్రాల వద్ద క్వింటాల్‌కు 5 నుంచి 6 కిలోల మేర కోతపెడుతూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎకరంలో 25 క్వింటాళ్లు పండించే రైతు 1.50 క్వింటాళ్ల ధాన్యాన్ని కోల్పోతున్నాడు. ఇంకా, చాలాచోట్ల రంగు మారిందన్న సాకుతో గ్రేడ్–1 ధాన్యానికి సాధారణ రకం ధాన్యం ధరకడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు. మిల్లర్ల మాయాజాలం రాష్ట్రంలో ఈ ఏడాది 40 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగ్గా, 91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 2 లక్షల మంది రైతుల నుంచి 5,400 కొనుగోలు కేంద్రాల ద్వారా 13.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మిగతా ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది. అయితే ధాన్యం దిగుబడి అధికంగా గల కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాల్లో యాసంగిలో మెడవిరుపు, దోమపోటు, కత్తెరరోగం వంటి తెగుళ్లు సోకి పంట దెబ్బతింది. అదీగాక 1010 మినహా 1152, 1156 వంటి విత్తన రకాలు అనుకున్నట్టుగా ఎదగలేదు. దీనికి అకాల వర్షాలు తోడయ్యాయి. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేప్పుడే ఎండబెట్టి, తాలుతీసి తెస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాక తూకం సమయంలో తాలు, 17% తేమ నిబంధనలు అడ్డుపెట్టి కొనుగోలు చేస్తున్నారు. అనంతరం ధాన్యాన్ని కేంద్రం నుంచి మిల్లింగ్‌కు తరలించే సమయంలో అసలు దోపిడీ మొదలవుతోంది. ఇక్కడ ప్రతి 40 కిలోల బస్తాకు 2 నుంచి 3 కిలోలు అంటే క్వింటాల్‌కు సుమారు 5 నుంచి 6 కిలోలు మిల్లర్లు కోత పెడుతున్నారు. దీనిని ప్రశ్నిస్తే లారీలను వెనక్కి పంపుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో వంద క్వింటాళ్లు తీసుకొచ్చే రైతు ఏకంగా 6 క్వింటాళ్లు నష్టపోతున్నాడు. క్వింటాలుకు కామన్ రకం ధర రూ.1,815 చెల్లించినా కనీసంగా రైతు రూ.10,890 మేర నష్టపోతున్నాడు. అన్నింటికీ కామన్ ధరే.. ప్రస్తుతం గ్రేడ్–1 ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,835, కామన్ రకానికి రూ.1,815 చెల్లించాలి. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో గ్రేడ్–1 రకం ధాన్యం కొంత రంగుమారింది. చాలాచోట్ల టార్ఫాలిన్లు లేక ధాన్యం నల్లరంగుకు మారింది. దీన్ని సాకుగా చూపి మిల్లర్లు గ్రేడ్–1 రకాన్ని కామన్ రకం కింద చూపుతున్నారు. దీంతో ప్రతి క్వింటాల్‌కు రూ.20 మేర రైతు నష్టపోతున్నాడు. దీనికి తోడు లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా హమాలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో గ్రామాల్లో అందుబాటులో ఉన్న వారు, ప్రభుత్వ గిడ్డంగుల్లో పనిచేస్తున్న వారితో హమాలీ పనిచేయిస్తున్నారు. వీరు గతంలో క్వింటాల్‌కు రూ.32 తీసుకోగా ఇప్పుడు రూ.3 అదనంగా కలిపి రూ.35 వసూలు చేస్తున్నారు. ఇది రైతుకు అదనపు భారమవుతోంది. ఇక కొన్నిచోట్ల గన్నీ సంచుల కొరత.. రైతులకు పరీక్ష పెడుతోంది. చదవండి: ఎత్తివేయాలా.. వద్దా..! మిల్లులను సీజ్ చేయడానికి వెనకాడం ధాన్యం కొనుగోళ్లలో తేమ, తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ఇష్టానుసారం కోత విధించవద్దని రైస్‌మిల్లర్లకు స్పష్టంగా ఆదేశాలిచ్చాం. దీన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ మిల్లులను సీజ్ చేయడానికైనా వెనుకాడం. మా ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం సకాలంలో సబ్సిడీలు ఇవ్వకపోవడం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి బిల్లులు సరైన సమయంలో రాకపోవడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఈ సీజన్లోనే ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వంపై దాదాపు రూ.1,000 కోట్ల వడ్డీ భారం పడుతోంది. – పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పొల్లు ఉందని ఇబ్బంది పెడుతుండ్రు నేను ఎకరం పొలంలో వరి వేసిన. పొలమంతా రోగంబడి ఖరాబైంది. ఉన్నకాడికి వడ్లు కొనుగోలు కేంద్రానికి తెస్తే అందులో పొల్లు ఉందని ఇబ్బంది పెడుతుండ్రు. కనీసం పెట్టుబడి కూడా ఎల్లలే. వర్షం వస్తే టార్పాలిన్లు కూడా లేవు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – శ్యాగ ఎల్లయ్య, బీబీపేట, కామారెడ్డి జిల్లా గన్ని సంచులు లేవని కొంటలేరు కొనుగోలు కేంద్రంలో వడ్లుపోసి పది రోజులవుతోంది. తేమ పోయిందాక ఆరబెట్టినా, గన్ని సంచులు లేవని కాంట పెట్టడం లేదు. వడ్లు పోసేందుకు పరదాలు కిరాయికి తెచ్చినం. కిరాయిలు పెరుగుతున్నయి. ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి. – ఎలవేణి సుజాత, సుల్తానాబాద్, కరీంనగర్ ఏ–గ్రేడ్ వడ్లు బీ–గ్రేడ్‌గా తీసుకుంటున్నరు తాలు, సంచి, మట్టి పేరుతో క్వింటాల్‌కు రెండు కిలోల చొప్పున తీస్తున్నరు. ఏ–గ్రేడ్ వడ్లను బీ–గ్రేడ్‌గా లెక్కగడుతున్నారు. దీంతో చాలా నష్టపోతున్నం. అధికారులే చొరవ తీసుకొని న్యాయం చేయాలి. – పిడుగు విమల, సుల్తానాబాద్, కరీంనగర్ -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని వాట్సాప్ ద్వారా సమీక్షించారు. తడిసిన ధాన్యంపై పలు సూచనలు చేస్తూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, వేర్‌హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు వెంటనే మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పారు. టార్పాలిన్లను వెంటనే సమకూర్చాలని, తడవని ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. గాలి దుమారం, భారీ వర్షానికి పాడైన గోదాంలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
మద్దతు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు: జేసీ
వీపనగండ్ల: జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సోమవారం సంగినేనిపల్లిలో డీఆర్డీఏ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొదటి గ్రేడ్ ధాన్యానికి రూ.1590, రెండవ గ్రేడ్‌కు రూ.1550 మద్దతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్నీ బ్యాగులు, ధాన్యం వివరాలను ఆన్లైన్ చేసేందుకు ట్యాబ్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కొన్న ధాన్యాన్ని గోదాంలకు తరలిస్తామని తెలిపారు. డీఆర్డీఓ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, బీపీఎం భాషనాయక్, జిల్లా మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మయ్య, సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా, సర్పంచ్ వీరయ్య, ఏపీఎం వెంకటేష్, విండో చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి, చిన్నారెడ్డి పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలి
పిట్లం : కందులను కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు సోమవారం పిట్లం వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కందులు కొనుగోలు చేసేందుకు మార్క్ ఫెడ్ అధికారులు స్థానిక మార్కెట్ యార్డ్‌లో సహకార సంఘం ఆధ్వర్యంలో కందుల కోనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు. క్వింటాలుకు మద్దతు ధర రూ.5450 నిర్ణయించారు. పిట్లం మండలంలో 2900 క్విటాళ్ల లక్ష్యం నిర్ణయించారు. దీంతో పోమవారం అధికారులు తమకు ఇచ్చిన లక్ష్యం పూర్తియిందని కొనుగోల్లు నిలిపివేశారు. మార్కెట్ ఆవరణలో రైతులు తెచ్చిన కందులు కొనడం లేదని ఆగ్రహించిన రైతులు మార్కెట్ యార్డు ముందు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. మార్కెట్‌యార్డుకు విక్రయించడానికి కందులను తీసుకువస్తే గేటును మూసి వేస్తుండటం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని లేదంటే ఆందోళన చేపడతామని రైతుల పక్షాణ బండపల్లి సర్పంచ్ గైనిరాములు మద్దతు పలికారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అంతిరెడ్డి రైతులతో మాట్లాడుతూ రహదారిపై రాస్తారోకో చేపట్టడం సరికాదని, అధికారులతో చర్చించి రైతుల కందుల కోనుగోలు చేసే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో అందోళన విరమించిన రైతులు శాంతించి వెళ్లిపోయారు. -
ధాన్యానికి రాజకీయ రంగు
► కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలతో సమావేశం ► వారి నిర్ణయంతోనే కేంద్రాల ఏర్పాటు? ► అప్పటివరకూ ధాన్యం కొనుగోళ్లకు బ్రేక్ ధాన్యం కొనుగోలులో అన్నదాతలకు కొత్త కష్టాలు ఎదురుకానున్నాయి. ఇది వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం రైతులకు అనుకూలమైన చోట ఏర్పాటు చేసేది. ఇప్పుడు దానిని రాజకీయ నేత చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధమవుయింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో రాజకీయ నేతలతో సమావేశం ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. రాజకీయ నేతలకు అనుకూలమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మిల్లర్లకు పరోక్షంగా సహకారం అందినట్టే. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ జోక్యం వల్ల రైతులకు నష్టమే తప్ప లాభమేమీ ఉండదనే వాదనలూ వినిపిస్తున్నాయి. విజయనగరం కంటోన్మెంట్: ధాన్యం పండిన చోట దళారులు రాక ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మద్దతు ధర కల్పించాల్సిన యంత్రాంగం ఇందులో రాజకీయ జోక్యానికి తెర లేపనుంది. రైతులకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఈ సారి రాజకీయ జోక్యం మితిమీరనుంది. రాజకీయ నాయకులు ‘‘మాకో మూడివ్వండి లేదా నాలుగివ్వండి’’ అన్న సిఫార్సులకు ఇబ్బందులొస్తాయని ఆలోచిస్తున్నది. దీని వల్ల ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కష్టమని అనుకుంటోంది. అందుకే జిల్లా యంత్రాంగం ముందుగా వారిచేతనే ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేంద్రాలే ఏర్పాటు చేయాలోనన్న విషయాన్ని తెలుసుకునేందుకు కొత్త అడుగులేస్తుంది. దీనికోసం త్వరలోనే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. అప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లేనట్టేనని తెలుస్తోంది. ఈ లోగా దళారులు ఎప్పటిలానే ధాన్యం కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలించేందుకు మంచి అవకాశమిచ్చినట్టు కనిపిస్తుంది. జిల్లాలో గతేడాది 3.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగో లు చేశారు. ఈ ధాన్యం కొనుగోళ్లను మిల్లర్లు దాదాపు తమ చేతుల మీదుగానే నడిపించారన్న విమర్శలు ఉన్నారుు. పార్వతీపురం ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా ముందుగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతుం టా రుు. ఈ ఏడాది ఇప్పటికే ధాన్యం నూర్పిళ్లు ప్రారంభమయ్యారుు. వాటిని దళారులు కొనుగోలు చేసేందుకు సంసిద్ధమయ్యారు. రాజకీయ ప్రమేయం.. రాజకీయ పార్టీల అనుమతితో ఈ సారి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివిధ వర్గాల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇది జిల్లాలో ఎప్పు డూ లేని కొత్త అడుగు. ఎందుకంటే గతంలో కొనుగోలు కేంద్రాలను అధికారులే ఏర్పాటు చేసేవారు. ఎక్కడరుునా ధాన్యం విక్రరుుంచేందుకు రైతులు ఇబ్బందు లు పడుతున్నారన్న విషయం కానీ తెలిస్తే ఆ ప్రాంతంలో ఓ పీపీసీని ఏర్పాటు చేయాలని కోరితే అధికారులు ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రాజకీయ నాయకులతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం విశేషం. దీని వల్ల జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు తమ ప్రాంతంలో కూడా ఓ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే కోరికలు కోరవచ్చు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధాన్యం పండిన చోట్లనే ఏర్పాటు చేయాలనే నిబందనలున్నారుు. మిల్లర్లకు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడు రాజకీయ ఉచ్చులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పడితే మిల్లర్ల ఆగడాలకు అడ్డుండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ జోక్యం వల్ల ధాన్యం కొనుగోలు నిబంధనలు వర్తిస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. -
మద్దతు కరువు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ధాన్యం అమ్మకాలలోనూ రైతులకు కష్టాలు తప్పడం లేదు. 287 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటివరకు 168 ప్రారంభం కాగా, 119 కేంద్రాలు ఇంకా ఎప్పుడు తెరుస్తారో తెలియడం లేదు. ఫలితంగా రైతులు ఖరీఫ్ ధాన్యాన్ని విక్రయించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రాలలో అసౌకర్యాలు తిష్టవేయగా, గన్నీ సంచులు, హమాలీల కొరత అక్కడక్కడా ఇబ్బందికరంగా మారింది. ఆరుగాలం శ్రమించిన రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్ రోస్ మార్కెటింగ్, పౌరసరఫరాల, డీఆర్డీఏ తదితర శాఖలను అప్రమత్తం చేసి నా, క్షేత్రస్థాయిలో కొందరి అలసత్వం రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. వారు రైస్ మిల్ల ర్లు, దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, సోమవారం నాటికి 7,030 మె.టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కామారెడ్డిలో హమాలీలు లేరు కామారెడ్డి మండలం గర్గుల్ కొనుగోలు కేంద్రం లో హమాలీలు లేక వారం రోజులుగా ధాన్యం అక్కడే ఉంది. రైతులు ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు పడుతున్నారు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసినా బిల్లులు సరిగ్గా రావడంలేద ని వారు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి మార్కెట్లో కొనుగోళ్లు నెమ్మదిగా జరుగుతుం డటంతో రైతులు వారం రోజులుగా అక్కడే ఉంటున్నారు. మాచారెడ్డి సింగిల్‌విండోలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటి వరకు తెరవలేదు. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దోమకొండలో ఆరు కొనుగోలు కేంద్రాలుండగా,కొ న్న ధాన్యానికి సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదు. ఆర్మూర్‌లో తూకం లేదు ఆర్మూర్ నియోజకవర్గంలో రైతులు ధాన్యం తీసుకువచ్చి వారం గడుస్తున్నా తూకం వేయ డం లేదు. కొనుగోలు కేంద్రాలలో హమాలీల పేరుతో దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు విని పించాయి. పలు కేంద్రాలలో అకాల వర్షంతో ధాన్యం తడిసిపోగా, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఆర్మూర్ పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో, పీఏసీఎస్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ పరిసరాలలో, పెర్కిట్, మిర్ధాపల్లి, ఆలూర్, దేగాం, పిప్రి, పెర్కిట్, ఫత్తేపూర్, తదితర గ్రామాలలో కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొంత మేర తడిసి పోవడంతో రైతులు వేదనకు గురవుతున్నారు. కొనుగోలు కేంద్రంలో 40 కేజీల బస్తాకు హమాలీ పేరుతో రూ.14లు వసూలు చేస్తూ క్వింటాలుకు రెండున్నర కిలోల కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు. తూకం వేసి లారీలలో ఎక్కించే వరకు రైతులదే బాధ్యత అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటుండటంతో రైతులు రేయింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. బోధన్‌లో బిల్లులు రావడం లేదు బోధన్ వ్యవసాయ మార్కెట్లో, సింగిల్విం డోలో, సాలూర, సాలంపాడ్, నవీపేట మండలంలోని అభంగపట్నం, రెంజల్ మండలం సాటాపూర్, దండిగుట్ట, ఎడపల్లి మండలంలో ని ఎడపల్లి, ఠానాకలాన్ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు సకాలంలో అందడం లేదని తేలింది. ఇప్పటివరకు 11 వేల కింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. రైతులకు రూ. 1.37 కోట్లు చెల్లించాల్సి ఉండ గా, ఇందులో రూ. 68 లక్షలు చెల్లించారు. మిగిలిన డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. కొనుగోలు కేంద్రంలో కాంటా లేదు. సాలూర సొసైటీలో 6 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఇక్కడ తేమ కొలత మీటరు పని చేయ డం లేదు. కాంటాలు లేవు. పంట పొలాలు, ఖా ళీ ప్రదేశాలలో తూకం వేస్తున్నారు. సాలంపాడ్ లో ఇప్పటి వరకు 8 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇక్కడ కొనుగోలు కేంద్రంలో కాంటా లేదు. పెంటాకుర్థులో ఇదే పరిస్థితి. ఈ సొసైటీ పరిధిలో బీపీటి రకం ధాన్యం సాగు చేశారు. ఇక్కడ కేవలం 2,190 కింటాళ్లు కొనుగోలు చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్, దండిగుట్ట కేంద్రాలలో తూకం బంద్ ఉంది. తేమ, తాలు ఉన్నాయని జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా మారాయి. కనీస మద్దతు ధర దేవుడెరుగు ఎనలేని ఇబ్బందులను ఎదుర్కుంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందని, తా లు ఉందని చెబుతూ నిరాకరిస్తున్నట్లు రైతులు వెల్లడించారు. పైగా తెచ్చిన ధాన్యాన్ని జల్లెడ పట్టటంతో చాలా వరకు తరుగు పోతోంది. గత్యంతరం లేక ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వానలకు అక్కడక్కడా ధాన్యం తడిసిపోయి రంగు మారింది. ఇదే అదునుగా కొనుగోలు కేంద్రాలలో రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. అక్టోబర్ 29న ప్రారంభించిన ‘మెప్మా’ కేంద్రం మొక్కుబడిగా మారింది. అకాల వాన కొంప ముంచింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాల పరిస్థితి దారుణంగా ఉంది. డిచ్పల్లి మండలం బర్థిపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధర్మారం (బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొద్దిమేర తడిసింది. దీంతో సోమవారం కొనుగోళ్లను నిలిపివేశారు. తరుగు పేరిట బస్తాకు కిలో ధాన్యం తీసేస్తున్నారని రైతులు తెలిపారు. ధర్పల్లి పీఏసీఎస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనూ, సిరికొండ మండలం తాళ్ల రామడుగులోనూ వానకు ధాన్యం తడిసి పోవడంతో కొనుగోళ్లను నిలిపివేశారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించకపోవడం వల్ల తడిసిపోయింది. ఇక్కడా అంతే జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, గున్కుల్, మల్లూర్ సింగిల్ విండోల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. మద్నూర్ మండలంలో డోంగ్లిలో ఇంతవరకు ధాన్యం రాకపోవడంతో తూకాలు ప్రారంభం కాలేదు. మదన్ హిప్పర్గలో 6,040 బస్తాల ధాన్యాన్ని కొన్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, నాగిరెడ్డిపేట మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్‌విండోలు, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వానకు ధాన్యం తడవడంతో రైతులు ఆరబెట్టడంలో నిమగ్నమయ్యారు. తాటిపత్రు లు లేకపోవడంతో రైతులు స్వయంగా తెచ్చుకుంటున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందనే కారణంతో తూకాలు చేయడం లేదు. రైతులకు డబ్బులు రావడానికి 10 నుంచి 20 రోజుల సమయం పడుతోంది.