ధాన్యానికి రాజకీయ రంగు
► కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలతో సమావేశం
► వారి నిర్ణయంతోనే కేంద్రాల ఏర్పాటు?
► అప్పటివరకూ ధాన్యం కొనుగోళ్లకు బ్రేక్
ధాన్యం కొనుగోలులో అన్నదాతలకు కొత్త కష్టాలు ఎదురుకానున్నాయి. ఇది వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం రైతులకు అనుకూలమైన చోట ఏర్పాటు చేసేది. ఇప్పుడు దానిని రాజకీయ నేత చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధమవుయింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో రాజకీయ నేతలతో సమావేశం ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. రాజకీయ నేతలకు అనుకూలమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మిల్లర్లకు పరోక్షంగా సహకారం అందినట్టే. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ జోక్యం వల్ల రైతులకు నష్టమే తప్ప లాభమేమీ ఉండదనే వాదనలూ వినిపిస్తున్నాయి.
విజయనగరం కంటోన్మెంట్: ధాన్యం పండిన చోట దళారులు రాక ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మద్దతు ధర కల్పించాల్సిన యంత్రాంగం ఇందులో రాజకీయ జోక్యానికి తెర లేపనుంది. రైతులకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఈ సారి రాజకీయ జోక్యం మితిమీరనుంది. రాజకీయ నాయకులు ‘‘మాకో మూడివ్వండి లేదా నాలుగివ్వండి’’ అన్న సిఫార్సులకు ఇబ్బందులొస్తాయని ఆలోచిస్తున్నది. దీని వల్ల ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కష్టమని అనుకుంటోంది. అందుకే జిల్లా యంత్రాంగం ముందుగా వారిచేతనే ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేంద్రాలే ఏర్పాటు చేయాలోనన్న విషయాన్ని తెలుసుకునేందుకు కొత్త అడుగులేస్తుంది. దీనికోసం త్వరలోనే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. అప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లేనట్టేనని తెలుస్తోంది. ఈ లోగా దళారులు ఎప్పటిలానే ధాన్యం కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలించేందుకు మంచి అవకాశమిచ్చినట్టు కనిపిస్తుంది. జిల్లాలో గతేడాది 3.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగో లు చేశారు. ఈ ధాన్యం కొనుగోళ్లను మిల్లర్లు దాదాపు తమ చేతుల మీదుగానే నడిపించారన్న విమర్శలు ఉన్నారుు. పార్వతీపురం ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా ముందుగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతుం టా రుు. ఈ ఏడాది ఇప్పటికే ధాన్యం నూర్పిళ్లు ప్రారంభమయ్యారుు. వాటిని దళారులు కొనుగోలు చేసేందుకు సంసిద్ధమయ్యారు.
రాజకీయ ప్రమేయం..
రాజకీయ పార్టీల అనుమతితో ఈ సారి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివిధ వర్గాల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇది జిల్లాలో ఎప్పు డూ లేని కొత్త అడుగు. ఎందుకంటే గతంలో కొనుగోలు కేంద్రాలను అధికారులే ఏర్పాటు చేసేవారు. ఎక్కడరుునా ధాన్యం విక్రరుుంచేందుకు రైతులు ఇబ్బందు లు పడుతున్నారన్న విషయం కానీ తెలిస్తే ఆ ప్రాంతంలో ఓ పీపీసీని ఏర్పాటు చేయాలని కోరితే అధికారులు ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రాజకీయ నాయకులతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం విశేషం. దీని వల్ల జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు తమ ప్రాంతంలో కూడా ఓ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే కోరికలు కోరవచ్చు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధాన్యం పండిన చోట్లనే ఏర్పాటు చేయాలనే నిబందనలున్నారుు. మిల్లర్లకు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడు రాజకీయ ఉచ్చులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పడితే మిల్లర్ల ఆగడాలకు అడ్డుండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ జోక్యం వల్ల ధాన్యం కొనుగోలు నిబంధనలు వర్తిస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.