mediums
-
వైద్య రంగ వృద్ధి మధ్యస్థం: ఇక్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ ఆదాయ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మధ్యస్థంగా ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘సామర్థ్యం పెంపు కారణంగా ఆక్యుపెన్సీ కొద్దిగా మితంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. ఒక్కో పడక ద్వారా సగటు ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కీలక శస్త్ర చికిత్సల విభాగంలో వ్యవస్థీకృత సంస్థల మార్కెట్ వాటా పుంజుకుంది. విదేశీ రోగుల రాకతో మెట్రో నగరాల్లోని ఆసుపత్రుల్లో రద్దీ అధికం అయింది. దేశవ్యాప్తంగా పెద్ద సంస్థలు కొన్ని నూతన ఆసుపత్రుల ఏర్పాటు, మరికొన్ని ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో పడకల సామర్థ్యం పెంచనున్నట్టు ఇటీవల వెల్లడించాయి. రెండు మూడేళ్లుగా కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి బదులు ఉన్న కేంద్రాల్లో ఆదాయాల పెరుగుదలపై వైద్య పరిశ్రమ దృష్టిసారించింది.’ అని ఇక్రా వివరించింది. -
దళారులకు కేరాఫ్ రవాణాశాఖ !
సాక్షి, కరీంనగర్ : అవినీతి, అక్రమాలకు రవాణా శాఖ కార్యాలయం నిలయంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకొని వాహనాల రిజిస్ట్రేషన్ వరకు ఇక్కడికి వచ్చే సామాన్యులు దళారుల ద్వారానే పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజీవ్ రహదారి వంటి స్టేట్హైవేతోపాటు ఆదిలాబాద్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు అనుసంధానంగా ఉన్న తిమ్మాపూర్‌లోని కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్లదే పెత్తనం. అధికారులు, దళారులతో కుమ్మక్కై లక్షలు దండుకుంటున్నారు. ప్రతిరోజు దాదాపు 70వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయంలో రవాణాశాఖ అధికారులు ‘లెక్కలు’ చూసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పునర్విభజన తరువాత పాత కరీంనగర్ నాలుగు కొత్త్త జిల్లాలుగా ఏర్పాటు కావడంతో పనిచేసే అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కూడా కొత్త జిల్లాలను పంచుకున్నారు. అయినా.. రిజిస్టేషన్ల సంఖ్యతోపాటు ఆదాయంలో కూడా కరీంనగర్ జిల్లానే టాప్‌గా నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కరీంనగర్ జిల్లా హోదాకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి(డీటీసీ)ని నియమించాల్సి ఉన్నప్పటికీ, ఆరేళ్లుగా ఇన్చార్జిల పాలనే సాగుతుండడంతో అధికారులు, సిబ్బందిపై నిఘా లేకుండా పోయింది. దారుణం ఏంటంటే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు డీటీసీని నియమించి కరీంనగర్‌కు ఆయనను ఇన్చార్జిగా నియమించడం. జిల్లాలో ఒకే ఒక్కడుగా కొనసాగిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్‌పాషా ఇటీవలే అవినీతి ఆరోపణలపై కమిషనర్ కార్యాలయానికి సరెండర్ అయ్యారు. వాహనాలను తనిఖీ చేయడం ద్వారా లక్షలు వసూళ్లు చేసిన సదరు అధికారి తాజాగా ‘గూగుల్ పే’ వంటి అధునాతన ఆన్లైన్ లావాదేవీలను కూడా ఉపయోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహాయ ఎంవీఐ ఒక్కరే మిగిలారు. సిబ్బంది పాత్ర షరా మామూలే. ఏజెంట్ల నుంచి వచ్చిన కాగితాలే ఫైనల్ అనే చందంగా రవాణాశాఖ కార్యాలయంలో ప్రస్తుత ధోరణి నెలకొంది. లైసెన్సుల మంజూరు నుంచి వాహనాల తనిఖీ వరకు అంతటా డబ్బులే రాజ్యమేలుతున్నాయి. ఇన్చార్జి అధికారులే ఇక్కడ..! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గానీ, విభజన తరువాత కరీంనగర్లో గానీ రెగ్యులర్ ఆర్టీవో/డీటీసీలు లేరు. 2012 నుంచి 2014 వరకు దుర్గా ప్రమీల ఆర్టీవోగా పనిచేశారు. కరీంనగర్‌కు ఈమెనే రెగ్యులర్ ఆర్టీవోగా పనిచేసిన చివరి అధికారి. ఆ తర్వాత వచ్చినవారంతా ఇన్‌చార్జీలే. 2014–17 వరకు వినోద్‌కుమార్ ఇన్చార్జి డీటీసీగా కొనసాగారు. ఆయన తరువాత 2017 నుంచి 2018 వరకు కొండల్రావు, 2018 నుంచి 2019 వరకు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రస్తుతం శ్రీనివాస్ ఇన్చార్జి అధికారులుగానే ఉన్నారు. మొన్నటి వరకు ఇద్దరు రెగ్యులర్ ఏఎంవీఐలు ఉండగా, ఇటీవల ఏఎంవీఐ గౌస్‌పాషా గూగుల్ పే ద్వారా రూ.5 వేలు లంచం తీసుకోవడంతో అతడిని రవాణాశాఖ కమిషనర్‌కే సరెండర్ చేశారు. ప్రస్తుతం రజినీదేవి ఒక్కరే ఇక్కడ రెగ్యులర్ అధికారి. గౌస్‌పాషా సరెండర్ తర్వాత పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయం నుంచి ఫారూఖ్‌ను తాత్కాలికంగా కరీంనగర్‌కు ఏఎంవీఐగా నియమించారు. లంచాల కోసం పీడింపు.. కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చేవారికి లర్నింగ్ లైసెన్స్ నుంచే లంచాల బెడద మొదలవుతుంది. లెర్నింగ్ తరువాత రెగ్యులర్ లైసెన్స్, వాహనాల రోడ్ టాక్స్, ఫిట్నెస్ వరకు రూ.వేలల్లో లంచాలు దండుకుంటున్నారు. రూ.450 లెర్నింగ్ ఫీజకు రూ.600, రూ.2,000 పర్మినెంట్ లైసెన్స్‌కు రూ.6 వేలు, రిజిస్టేషన్‌కు ఫీజు కాకుండా ద్విచక్రవాహనాలకు రూ.300, ఫోర్ వీలర్స్‌కు రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఫిట్నెస్ పరీక్షకు వచ్చే వాహనాలను వివిధ కారణాలు సాకుగా చూపి వేలాది రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. వాహనాల తనిఖీ పేరిట జరిగే తతంగం పూర్తిగా లంచాల వసూళ్లకేనని ఇటీవల ఎంవీఐ సరెండర్‌తో జిల్లా వాసులకు తెలిసిపోయింది. విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్, లారీలు, ట్రక్కుల పన్ను వసూళ్లు, ఓవర్ లోడింగ్ తదితర విషయాల్లో రవాణా శాఖ సిబ్బంది మామూళ్ల పర్వం అగ్రభాగానికి వెళ్లిపోయింది. అంతా ఏజెంట్లదే.. రవాణాశాఖ కార్యాలయంలో సుమారు 15 మంది ఏజెంట్లు రాజ్యమేలుతన్నారు. కార్యాలయం తెరవకముందే ఏజెంట్లు తిష్టవేస్తారు. అప్పటికే అక్కడకు వచ్చిన వాహనదారులతో, లైసెన్సుల కోసం వచ్చే వారితో బేరాలు మాట్లాడుకోవడం, తమను కాదని వెళితే లైసెన్స్ గానీ, వాహనం రిజిస్ట్రేషన్ గానీ కాదని హెచ్చరించి మరీ రోజువారీ సెటిల్మెంట్లు చేసుకుంటారు. అధికారులు 10:30 నుంచి 11 : 30 గంటల సమయంలోనే కార్యాలయానికి రావడం సర్వసాధారణమైంది. అప్పటికే ఆ రోజు ఇచ్చే లైసెన్సులు, చేసే రిజిస్ట్రేషన్లు, ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికెట్లకు సంబంధించి సెట్ చేసే ఏజెంట్లు అధికారులు రాగానే వారి గదుల్లోకి నేరుగా వెళ్లి మరీ, కమీషన్ ముట్టజెప్పి పనికానిచ్చేస్తారు. కార్లు, ట్రక్కులు, ఇతర పెద్ద వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఏజెంట్ల ద్వారానే సాగుతుండగా, డ్రైవింగ్ లైసెన్సులకు కూడా ఏజెంట్లే తప్పనిసరిగా మారిందనే విమర్శలున్నాయి. పంపకాల్లో అటెండర్ నుంచి అధికారి వరకు... ఏజెంట్ ఇచ్చే మామూళ్లు కార్యాలయంలో పని చేసే అటెండర్ నుంచి కార్యాలయంలోని అసలు బాస్ వరకు అందరికీ ముడతాయనేది బహిరంగ రహస్యం. కార్యాలయానికి వచ్చిన వారి తో మాట్లాడుకున్న బేరం ప్రకారం ఏజెంట్ల నుంచి వెళ్లిన పత్రాలను పరిశీలించి, ఏజెంట్ల నుంచి వచ్చిన వాటికే ఆమోదముద్ర తెలపడం, మిగతా దరఖాస్తులకు కొర్రీలు విధించడం సా ధారణంగా మారింది. ఫైల్‌పై కోడ్‌భాషలో ఇచ్చే ఇండికేషన్ అధికారులు గమనించి, సంతకాలు చేస్తారు. ఈ నేపథ్యంలో నేరుగా వెళ్లినా పని కా దని నిర్ణయానికి వచ్చిన వారు తిరిగి ఏజెంట్లనే నమ్ముకోవడం సర్వసాధారణంగా మారింది. జిరాక్స్ సెంటర్లే అడ్డా.. జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అడ్డాగా చేసుకుని ఏజెంట్లు దందా నడిపిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్ల సిబ్బంది కొంతమంది ఏజెంట్లతో కుమ్మక్కై బే రం మాట్లాడుతున్నారు. వచ్చిన దాంట్లో పంచుకోవడం మామూలుగా మారింది. బేరం రాగానే వారి ఏజెంట్‌కు సమాచారం అందించడంతోపాటు స్లాట్‌బుక్ చేయడం.. నుంచి సర్టిఫికెట్ జారీ చేసే వరకు అంతా వారిదే రాజ్యం. -
యార్డుల్లో పడిగాపులు
► ఉమ్మడి జిల్లా అంతటా గన్నీ సంచుల కొరత ► ఆయా మార్కెట్లలో నిలిచిపోయిన కందుల కొనుగోళ్లు ► నాలుగేసి రోజులు యార్డుల్లోనే ఉంటున్న రైతులు కంది రైతులకు కష్టమొచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో గన్నీ సంచుల కొరత ఏర్పడడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు పంటను విక్రయించుకునేందుకు నిద్రహారాలు మాని రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులుకాయాల్సిన పరిస్థితి దాపురించింది. – ఆదిలాబాద్ రూరల్ ప్రభుత్వ సూచన మేరకు ఈ ఖరీఫ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు పత్తి సాగు తగ్గించి పప్పుదినుసుల సాగు పెంచారు. ప్రధానంగా కందిని వివిధ పంటల్లో అంతర పంటగా సాగు చేశారు. గత ఖరీఫ్ సీజన్ లో సుమారు ఉమ్మడి జిల్లాలో 46వేల హెక్టార్లు కది సాగైతే ఈ ఖరీఫ్‌లో 90వేల హెక్టార్ల వరకు సాగు చేశారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోనే అధికంగా పంట సాగైంది. దిగుబడి బాగానే వచ్చింది. దీంతో కందులను ఆయా జిల్లాల్లో మార్క్‌ఫెడ్, హకా ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుండగా, నిర్మల్ జిల్లాలో హకా ఆధ్వర్యంలో కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు రైతులు పండించిన కంది పంటను విక్రయించేందుకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో పలు మండల కేంద్రాల్లో కంది కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాని అధికారుల్లో ముందు చూపు కొరవడింది. కంది పంట కొనుగోళ్లుకు అవసరమైన గన్నీ బ్యాగులు సరఫరా చేయకపోవడంతో రైతులు నాలుగేసి రోజులు మార్కెట్ యార్డుల్లో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, జైనథ్, తాంసి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లిలో కందులు కొనుగోళ్లు చేస్తున్నారు. కుమురం భీం జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లిలో, నిర్మల్ జిల్లాలో భైంసా, కాగజ్‌నగర్, ఖానాపూర్, కుభీర్‌లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. గన్నీ సంచుల కొరత.. కందులు కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా జిల్లాలకు సరిపడా గన్నీ సంచులు సరఫరా చేయలేదు. దీంతో అంతటా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాకు 2,50,000, మంచిర్యాల జిల్లాకు 15వేలు, కుమురం భీం 20వేలు, నిర్మల్ జిల్లాకు సుమారు లక్ష వరకు గన్నీ బ్యాగులు సరఫరా చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా గన్నీ సంచుల సరఫరా లేకపోవడంతో రైతులు నాలుగేసి రోజులు యార్డులో నిద్రించాల్సిన పరిస్థితి దాపురించింది. పప్పు దినుసుల సాగు పెంచాలని సూచనలు చేసిన ప్రభుత్వం ముందస్తుగా గన్నీ బ్యాగులు ఎందుకు ఉంచలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. దళారులకే ప్రాధాన్యం కంది పంట అధికంగా సాగు చేసిన రైతులు ఆయా మార్కెట్లకు పంటను విక్రయానికి తెస్తే దళారులు అంటున్నారని, అదే దళారులు బయట కొనుగోళ్లు చేసుకొని విక్రయానికి వస్తే అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు రైతులు అంటున్నారు. కానీ అసలైన రైతు అధిక మొత్తంలో కందిని తీసుకొస్తే లేనిపోని ఆరోపణలు చేస్తూ కొనగోలుకు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ సంచులు అందుబాటులో ఉంచి కందులు కొనుగోళ్లు చేయాలని రైతులు కోరుతున్నారు. -
కంది ‘మద్దతు’ దళారులకే..
రైతుల నుంచి తక్కువకు కొని ఎంఎస్పీకి సర్కారుకు విక్రయం సాక్షి, హైదరాబాద్: కందులకు ప్రభుత్వం ఇస్తున్న కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) రైతుల కు కాకుండా దళారులకే చేరుతోందన్న విమ ర్శలు వినవస్తున్నాయి. కందుల ధర మార్కె ట్లో పతనం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిం ది. గతేడాది కందుల ధర మార్కెట్లో క్వింటా లుకు రూ.10 వేల వరకు ఉండగా... ఈసారి ఏకంగా రూ. 4 వేలకు మించి పలకడం లేదు. అంటే రూ. 6 వేల వరకు ధర తగ్గింది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత్యంతర లేక దళారులను, వ్యాపారులను ఆశ్రయించి అదే ధరకు విక్రయిస్తున్నారు. ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను దళారు లు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నడిచే కొనుగోలు కేంద్రాల్లో ఎంఎస్పీకి విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. రైతుల పాసు పుస్తకాలు దగ్గర పెట్టుకొని కొందరు మార్క్‌ఫెడ్ అధికా రుల అండతో ఇలా చేస్తున్నట్లు తెలిసింది. 95 వేల టన్నులే సేకరణ... రాష్ట్రవ్యాప్తంగా 5.15 లక్షల మెట్రిక్ టన్నుల కంది దిగుబడులు రావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఎఫ్‌సీఐ, నాఫెడ్ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తానని కేంద్రం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలోని మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా కేవలం 45 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతిచ్చింది. కొనుగోలుకు పరిమితి తక్కువ ఉండటంతో దళారులు, వ్యాపారులే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. క్వింటాల్ కందులకు కేంద్రం ఎంఎస్పీ రూ. 5,050కి ఖరారు చేసింది. రైతుల నుంచి రూ. 4 వేల వరకు కొనుగోలు చేసే వ్యాపారులు సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రూ. 5,050కు విక్రయిస్తున్నారు. దీంతో ఒక్కో క్వింటాలుకు ఏకంగా రూ. వెయ్యికి మించి లాభం పొందుతున్నారు. రైతు మాత్రం దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నాడు. 95 వేల మెట్రిక్ టన్నులే పరిమితి విధించడం వల్ల కొందరు అధికారులు.. దళారులకే మద్దతు పలుకు తున్నారన్న ఆరోపణలున్నాయి. మార్క్‌ఫెడ్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 6,500 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. అందులో ఎక్కువ భాగం వ్యాపారుల నుంచే కొన్నారని తెలిసింది. ముందు ప్రోత్సహించి... ఇప్పుడు గాలికొదిలేశారు 2015 ఖరీఫ్‌లో రాష్ట్రంలో కేవలం 5.62 లక్షల ఎకరాల్లోనే కంది సాగైంది. అప్పట్లో కరువు పరిస్థితులు కూడా కంది దిగుబడిని దెబ్బకొట్టాయి. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో కంది సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించింది. ఈ ఏడాది తెలంగాణలో ఖరీఫ్‌లో కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.44 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది ఏకంగా 10.30 లక్షల (168%) ఎకరాల్లో సాగైంది. రైతులను కందివైపు ప్రోత్సహించిన ప్రభుత్వం వారికి అవసరమైన ఎంఎస్పీ దక్కేలా పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. రైతులు పండించే కందులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. పండే మొత్తం కందిని ఎంఎస్పీకి కొనుగోలు చేస్తే.. దళారులకు కళ్లెం వేయడమే కాకుండా రైతులు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. -
ధాన్యానికి రాజకీయ రంగు
► కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలతో సమావేశం ► వారి నిర్ణయంతోనే కేంద్రాల ఏర్పాటు? ► అప్పటివరకూ ధాన్యం కొనుగోళ్లకు బ్రేక్ ధాన్యం కొనుగోలులో అన్నదాతలకు కొత్త కష్టాలు ఎదురుకానున్నాయి. ఇది వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం రైతులకు అనుకూలమైన చోట ఏర్పాటు చేసేది. ఇప్పుడు దానిని రాజకీయ నేత చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధమవుయింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో రాజకీయ నేతలతో సమావేశం ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. రాజకీయ నేతలకు అనుకూలమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మిల్లర్లకు పరోక్షంగా సహకారం అందినట్టే. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ జోక్యం వల్ల రైతులకు నష్టమే తప్ప లాభమేమీ ఉండదనే వాదనలూ వినిపిస్తున్నాయి. విజయనగరం కంటోన్మెంట్: ధాన్యం పండిన చోట దళారులు రాక ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మద్దతు ధర కల్పించాల్సిన యంత్రాంగం ఇందులో రాజకీయ జోక్యానికి తెర లేపనుంది. రైతులకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఈ సారి రాజకీయ జోక్యం మితిమీరనుంది. రాజకీయ నాయకులు ‘‘మాకో మూడివ్వండి లేదా నాలుగివ్వండి’’ అన్న సిఫార్సులకు ఇబ్బందులొస్తాయని ఆలోచిస్తున్నది. దీని వల్ల ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కష్టమని అనుకుంటోంది. అందుకే జిల్లా యంత్రాంగం ముందుగా వారిచేతనే ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేంద్రాలే ఏర్పాటు చేయాలోనన్న విషయాన్ని తెలుసుకునేందుకు కొత్త అడుగులేస్తుంది. దీనికోసం త్వరలోనే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. అప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లేనట్టేనని తెలుస్తోంది. ఈ లోగా దళారులు ఎప్పటిలానే ధాన్యం కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలించేందుకు మంచి అవకాశమిచ్చినట్టు కనిపిస్తుంది. జిల్లాలో గతేడాది 3.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగో లు చేశారు. ఈ ధాన్యం కొనుగోళ్లను మిల్లర్లు దాదాపు తమ చేతుల మీదుగానే నడిపించారన్న విమర్శలు ఉన్నారుు. పార్వతీపురం ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా ముందుగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతుం టా రుు. ఈ ఏడాది ఇప్పటికే ధాన్యం నూర్పిళ్లు ప్రారంభమయ్యారుు. వాటిని దళారులు కొనుగోలు చేసేందుకు సంసిద్ధమయ్యారు. రాజకీయ ప్రమేయం.. రాజకీయ పార్టీల అనుమతితో ఈ సారి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివిధ వర్గాల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇది జిల్లాలో ఎప్పు డూ లేని కొత్త అడుగు. ఎందుకంటే గతంలో కొనుగోలు కేంద్రాలను అధికారులే ఏర్పాటు చేసేవారు. ఎక్కడరుునా ధాన్యం విక్రరుుంచేందుకు రైతులు ఇబ్బందు లు పడుతున్నారన్న విషయం కానీ తెలిస్తే ఆ ప్రాంతంలో ఓ పీపీసీని ఏర్పాటు చేయాలని కోరితే అధికారులు ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రాజకీయ నాయకులతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం విశేషం. దీని వల్ల జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు తమ ప్రాంతంలో కూడా ఓ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే కోరికలు కోరవచ్చు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధాన్యం పండిన చోట్లనే ఏర్పాటు చేయాలనే నిబందనలున్నారుు. మిల్లర్లకు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడు రాజకీయ ఉచ్చులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పడితే మిల్లర్ల ఆగడాలకు అడ్డుండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ జోక్యం వల్ల ధాన్యం కొనుగోలు నిబంధనలు వర్తిస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. -
కొనుగోడు కేంద్రాలు
► అన్నదాతను వెంటాడుతున్న కొనుగోలు కష్టాలు ► కేంద్రాల ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టత కరువు ► అప్పుడే మొదలైన అక్రమ రవాణాలు ► ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్న దళారులు ► రైతన్నకు మిగిలింది కష్టమే... అష్టకష్టాలు పడి... ప్రకృతికి ఎదురీది... ఆర్థిక సమస్యలను అధిగమించి... కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట కోతలు మొదలయ్యారుు. అప్పుడే కళ్లాలకు చేను తరలుతోంది. ఇప్పుడిప్పుడే నూర్పులు మొదలుపెట్టి బస్తాల్లో భద్రపరుస్తున్నారు. ఆరుగాలం కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించే తరుణమిది. పెట్టుబడికి తగిన గిట్టుబాటుకోసం పరితపించే సమయమిది. సర్కారు ఇందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాల్సిన కాలమిది. కానీ సర్కారు ఇంకా దీనిపై దృష్టిసారించలేదు. మద్దతు ధరను అధికారికంగా ప్రకటించి... విసృ్తత ప్రచారం చేపట్టలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత నివ్వలేదు. కానీ అన్నింటా ముందుండే దళారీ వ్యవస్థ మాత్రం అప్పుడే సిద్ధమైంది. రైతన్న కష్టాన్ని తక్కువ మొత్తానికే కాజేసేందుకు బాటలు వేసుకుంది. - పార్వతీపురంరూరల్/ బలిజిపేటరూరల్/సీతానగరం బలిజిపేట మండలంలో గత ఏడాది ఇలా... కొనుగోలు కేంద్రాలు: వెలుగు ఆధ్వర్యంలో 5, పీఏసీఎస్ 2 విక్రరుుంచిన రైతులు: 3075 సేకరించిన ధాన్యం: 38,041.48టన్నులు ఈ ఏడాది ఖరీఫ్ సాగు: 6,307 హెక్టార్లలో జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో అప్పుడే కోతలు మొదలయ్యారుు. వరి నూర్పులు చేసి కళ్లాల్లో అమ్మకానికి ధాన్యం సిద్ధమైంది. కానీ సర్కారు మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీనివల్ల అప్పుడే దళారులు కళ్లాల్లో వాలుతున్నారు. ధాన్యాన్ని అక్రమంగా మిల్లుకు తరలించేస్తున్నారు. సర్కారు క్వింటా సాధారణ రకం రూ. 1470లుగా ప్రకటించినప్పటికీ దళారులు మాత్రం క్వింటాకు రూ. 1250లే చెల్లిస్తున్నారు. రైతన్న అవసరాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. పార్వతీపురం మండల వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ పంట అన్నదాతకు అనుకూలంగా మారినా.. కొనుగోలు కేంద్రాలు సర్కారు ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారులు అప్పుడే లాభాలు పొందుతున్నారు. . దాదాపు 30శాతం వరకు వరి కోతలు పూర్తయ్యారుు. పండిన ధాన్యాన్ని విక్రరుుంచేందుకు ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల కన్ను వాటిపై పడింది. గత ఏడాది ప్రారంభంలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు దశలవారీగా 13 కేంద్రాలకు విస్తరించారు. బిల్లుల చెల్లింపు మాత్రం మార్చివరకు కొనసాగారుు. ఈ ఏడాది ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. ఈ నెలాఖరు నాటికి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నారుు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. ఈ ఏడాది 35వేల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నారుు. సుమారు 26వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల్లో సేకరించడానికి సన్నద్ధమవుతున్నాం.- ఎం.వాసుదేవరావు, మండల వ్యవసాయాధికారి తరలిపోతున్న ధాన్యం : సీతానగరం మండలం 2016-17 ఖరీఫ్ సీజన్లో రైతులు వరి ఎదలు, ఉభాల రూపంలో 6,148 హెక్టార్లలో వరిపంట సాగుచేసి 1.5లక్షల క్వింటాళ్ళ ధాన్యం పండించినట్లు అధికారుల అంచనా. అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు కురవడంతో తొలుత ఆరుతడి భూముల్లో వరి ఎదలు వేశారు. నీటి వనరులున్న భూముల్లో ఉభాలు చేశారు. దీంతో నవంబర్ రెండో వారం నుంచే వరి కోతలు ముమ్మరంగా ప్రారంభించి... నూర్పులు మొదలెట్టేశారు. కానీ సర్కారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో పండించిన పంటలో చాలా వరకూ ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. రైతుల అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు విక్రరుుంచాల్సి వస్తోంది. ఈ మండలంలో ప్రైవేటు వర్తకులు క్వింటాలు ధాన్యానికి కేవలం రూ. 1190లే చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు.... మండలంలోని వరిచేలు కోతలు జరుగుతున్న కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలని నిర్ణరుుంచాం. 9 పీఏసీఎస్‌లు, 5 గ్రామైక్య సంఘాల ద్వారా కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. - బి సత్యనారాయణ, తహసీల్దార్, సీతానగరం. -
మళ్లీ మళ్లీ.. పెళ్లి!
♦ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లో బయటపడుతున్న లీలలు ♦ అధికారులు, దళారుల మిలాఖత్ ♦ సరూర్‌నగర్ మండలంలోనే 100కుపైగా నకిలీలు ♦ ఓ మధ్యవర్తి మూడు దరఖాస్తుల్లో పెళ్లికొడుకు ♦ రెండు గంటల్లోనే కుల, ఆదాయ సర్టిఫికెట్లు ♦ తీగలాగుతున్న అవినీతి నిరోధక శాఖ ♦ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ సరూర్‌నగర్ మండలానికి సంబంధించి దాదాపు వందకుపైగా నకిలీ లబ్ధిదారులున్నట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్రమంలో 16 మంది నకిలీల బాగోతాన్ని బయటపెట్టింది. ఇప్పటివరకు నకిలీలుగా గుర్తించిన దరఖాస్తుల్లో ఎజాజుల్లాఖాన్ అనే మధ్యవర్తి తానే మూడు చోట్ల పెళ్లికొడుకు స్థానంలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో అక్రమాల డొంక కదులుతోంది. ఈ పథకాల సొమ్ము లబ్ధిదారులు కాకుండా మధ్యవర్తులకు దక్కుతోందని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే పదిరోజుల క్రితం అక్రమాలు జరుగుతున్న తీరును బయటపెట్టిన ఏసీబీ.. తాజాగా సర్కారు సొమ్ము దారిమళ్లిందన్న విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారంలో సూత్రధారుల బాగోతాన్ని బహిర్గతం చేస్తూ.. అందుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేసింది.- సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : నిరుపేద దళిత, మైనార్టీల కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రక్రియను సాజావుగా సాగించి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాల్సి ఉండగా.. కొందరు అధికారులు ధనార్జనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. షాదీముబారక్ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలుగులోకి తెస్తోంది. ఈ క్రమంలో తవ్వేకొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. పది రోజుల క్రితం సరూర్‌నగర్ మండలానికి చెందిన సుల్తానాబేగం పేరిట మంజూరైన షాదీముబారక్ నగదును ఇతరులు కాజేసిన వైనాన్ని ఏసీబీ బయటపెట్టింది. అయితే ఈ మొత్తాన్ని ఎవరు తీసుకున్నారు.. ఎలా చెల్లింపులు జరిగాయి.. సుల్తానాబేగం పేరిట దరఖాస్తు చేసిన తీరును పూర్తిగా అధ్యయనం చేసిన ఏసీబీ పలు ఆసక్తికర విషయాల్ని మంగళవారం మీడియాకు వెల్లడించింది. మైనార్టీ శాఖలో దళారుల రాజ్యం.. ప్రస్తుతం షాదీముబారక్ పథకంలో అక్రమాలను వెలికితీసే క్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ తాహెరుద్దీన్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. షాదీముబారక్ పథకం కింద నకిలీ దరఖాస్తులను సృష్టిస్తూ.. వాటిని శాఖపరంగా ఓకే చేయించే క్రమం లో తాహెరుద్దీన్ చురుకైన పాత్ర పోషిం చినట్లు ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది. అదేవిధంగా అన్ని అర్హతలున్న ఒక్కో లబ్ధిదారుడి నుంచి కూడా కనిష్టంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసి వారికి మంజూరు పత్రాన్ని అందిస్తున్నట్లు గుర్తించింది. మైనార్టీ శాఖ ఉద్యోగిలా కాకుండా.. బయటివ్యక్తిలా మాట్లాడుతూ లబ్ధిదారులతో బేరసారాలు చేయడం, అనర్హుల నుంచి దరఖాస్తు చేయించడంలో ఒక ముఠాను ఏర్పాటు చేసి చక్రం తిప్పుతున్న తీరును కూడా ఏసీబీ నిగ్గుతేల్చింది. ఇలా దరఖాస్తు.. అలా సర్టిఫికెట్.. సరూర్‌నగర్ మండలానికి సంబంధించి దాదాపు వందకుపైగా నకిలీ లబ్ధిదారులున్నట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్రమంలో 16 మంది నకిలీల బాగోతాన్ని బయటపెట్టింది. వీరికి సంబంధించి దరఖాస్తు చేసుకునే తీరు మొదలు.. నగదు మంజూరయ్యే వరకు ప్రతిచోట దళారులు చురుకైన పాత్ర పోషించారు. సరూర్‌నగర్ మండలంలో ఎజాజుల్లాఖాన్ అనే మధ్యవర్తి మీసేవా కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తాడు. అనంతరం వారికి సంబంధించి కుల, ఆదాయ సర్టిఫికెట్లను చంద్రాయణగుట్టలోని క్లిక్ నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసిన తర్వాత.. సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో మరో మధ్యవర్తిని ఆశ్రయించి కుల, ఆదాయ సర్టిఫికెట్లను రెండు మూడు గంటల్లో పొందుతాడు. ఆ తర్వాత పహడీషరీఫ్‌లోని ఇండియన్ బ్యాంకులోనూ ఎలాంటి పరిచయస్తులు, ఆధారాలు లేకుండా బ్యాంకు ఖాతాను తెరిచి ఒక రోజులోనే ఈ వివరాలను మైనార్టీ శాఖలోని తాహెరుద్దీన్‌కు అందిస్తాడు. ఇక శాఖాపరంగా జరిగే పరిశీలన.. ఫైల్ మూవ్మెంట్ అంతా అక్కడ చకచకా సాగిపోతుంది. ఈ ప్రక్రియకోసం తాహెరుద్దీన్ సగటున రూ.5 నుంచి రూ.10వేలు తీసుకుంటాడని, క్షేత్రస్థాయిలో పని పూర్తిచేసేందుకు ఎజాజుల్లాఖాన్ రూ.వెయ్యి రూపాయలు తీసుకుంటాడని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ లక్ష్మి విలేకర్లకు వివ రించారు. నకిలీలుగా గుర్తించిన 16 దరఖాస్తుల్లో ఎజాజుల్లాఖాన్ మూడు చోట్ల పెళ్లికొడుకు స్థానంలో ఉన్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే తాహెరుద్దీన్, ఎజాజుల్లాఖాన్లను అదుపులోకి తీసుకోగా.. తహసీల్దార్ కార్యాలయం, ఇండియన్‌బ్యాంకులో వీరికి సహకరించినవారిని త్వరలో పట్టుకోనున్నట్లు పేర్కొన్నారు. -
ఇసుక ధరలకు రెక్కలు
♦ కొత్త పాలసీతో దళారులకు మేలు ♦ బినామీ పేర్లతో ఆన్లైన్లో బుక్కింగ్ ♦ ఇళ్ల నిర్మాణదారులకు ఎక్కువకు అమ్మకాలు ♦ రూ. రెండు వేల వరకు అదనపు భారం ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టి క్వారీ పాయింట్లకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం జిల్లాలో బీర్కూర్, హజ్గుల్, పొతంగల్, సిద్ధాపూర్, బండరెంజల్ ఇసుక క్వారీల్లో ఇసుక లభ్యమవుతోంది. ఆన్లైన్ బుకింగ్ పాలసీ ప్రకారం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. క్యూబిక్ మీటర్‌కు రూ. 600 చొప్పున చెల్లించి ఇసుకను పొందాల్సి ఉంది. ఆయా క్వారీల నుంచి ప్రస్తుతం రోజూ 150 నుంచి 200 లారీలు ఇసుక తరలిస్తున్నారు. ఒక్కొక్క లారీలో 13.50 క్యూబిక్ మీటర్ల ఇసుక నింపుతున్నారు. నిబంధనలు ఇవి నిబంధనల ప్రకారం భవన నిర్మాణదారులే ఇసుక క్వారీల నుంచి ఇసుకను పొందాలి. ఆన్లైన్ బుకింగ్‌లో భవన నిర్మాణదారుడి పేరు, ఓటర్/ఆధార్/రేషన్ ఐడీ నంబర్లు నమోదు చేసుకోవాలి. పూర్తి చిరునామా ఇవ్వాలి. అయితే కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు తమ బంధువులు, మిత్రుల పేర్లతో ఇసుకను బుక్ చేసుకుంటున్నారు. భవన నిర్మాణదారులు ఇసుక కోసం వస్తే నిబంధనల పేరుతో భయపెడుతున్నారు. లారీ యజమానులతో మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. అప్పటికే లారీల యజమానులు బినామీ పేర్లతో ఇసుక బుక్ చేసుకుని, ఒక్కో లారీకి రూ. 8,100లు మీసేవ కేంద్రాల్లో చెల్లిస్తున్నారు. ఇలా బుక్ చేసుకున్న ఇసుకను అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఆన్లైన్ దరఖాస్తులో ఇచ్చిన అడ్రస్‌కు ఇసుకను తరలిస్తున్నారా? లేదా? అన్న విషయమై విచారణ జరిపితే అసలు విషయం బయటపడే అవకాశాలున్నాయి. కానీ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, లారీ యజమానులతో మీసేవ కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కవడం వల్ల ఇసుక ధర భారీగా పెరిగింది. దళారులకే లబ్ధి ప్రభుత్వం ఇసుక ధరలను నిర్మాణదారులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కొత్త పాలసీని ప్రవేశపెట్టినా.. దళారులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, ఇసుక లారీల యజమానులకే లబ్ధి చేకూరుతోంది. గతంలో ఇసుక క్వారీల్లో ఒక్కో లారీకి రూ. 16 వేల వరకు చెల్లించి ఇసుకను తరలించేవారు. ఇప్పుడు దళారులకు సగం ధరకే ఇసుక వస్తోంది. దానిని అమ్ముకుంటూ లబ్ధిపొందుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు మంజీర నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండడంతో భూగర్భ జలాలు సైతం పూర్తిగా తగ్గిపోతున్నాయి. తాగునీటికి సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భూగర్భ జల నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వర్షాకాలంలో జిల్లాలో సగటున 9.86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు తక్కువగా కురవడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఇప్పటికే ప్రమాదకర స్థితికి పడిపోయాయి. సర్కారు స్పందించి ఇసుక రవాణాను నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు. -
గోనెల మాటున గోల్మాల్!
ధాన్యం వ్యాపారులు కాసులు దండుకోవడమే లక్ష్యంగా రోజురోజుకూ కొత్త మోసాలతో బరితెగిస్తున్నారు. నిన్నటి వరకు సాధారణ గోనెసంచుల్లో పక్క జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్న వీరు.. ఇప్పుడు ఏకంగా కొనుగోలు కేంద్రాల అనుమతులు పొందిన మిల్లులు ముద్రించిన గోనెసంచులతో అడ్డుగోలు వ్యాపారానికి తెరతీస్తున్నారు. వీరఘట్టం: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలను అధికారుల ఆధ్వర్యంలో ధాన్యం అమ్మే రైతులకు ఇవ్వాన్నది ప్రభుత్వ నిబంధన. అయితే కొనుగోలు కేంద్రాల సిబ్బందితో దళారులు, వ్యాపారులు చీకటి ఒప్పందం కుదుర్చుకోవడంతో గోనె సంచులు అడ్డుగోలుగా దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేటట్లు చూపించాలంటే సాధారణ గోనెసంచులలో ఉన్న ధాన్యాన్ని మిల్లర్ల ముద్రించిన గోనె సంచుల్లోకి మార్చేందుకు కలాసీ కూలీ అదనంగా బస్తాకు రూ.3.50 అవుతుంది. దీంతో ఈ కూలీ ఎగ్గొట్టేందుకు నేరుగా అనుమతి ఉన్న గోనె సంచుల్లోనే ధాన్యం తరలిస్తున్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలసలో ఉన్న మిల్లర్లు, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో పలువురు దళారులతో ఒప్పందాలు కుదుర్చుకుని యథేచ్ఛగా అక్రమం వ్యాపారానికి తెగబడ్డారు. జోరుగా జీరో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లాలో గోనె సంచుల కొరతమన జిల్లాలో గోనెసంచులు కొరత ఉండడంతో ఇదే అదునుగా వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. 45 రోజుల నుంచి విజయనగరం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడ కొనుగోలు కేంద్రాలతో కుమ్మక్కైన అయిన మిల్లర్ల వద్ద ప్రస్తుతం ఖాళీ గోనెసంచులు ఉన్నాయి. దీంతో అక్కడ కొందరు దళారులు ఆ గోనె సంచులను నేరుగా వీరఘట్టానికి ఆటోల ద్వారా, ఇతర వాహనాల ద్వారా తెప్పిస్తూ బహిరంగ వ్యాపారాన్ని చేస్తున్నారు. గోనెసంచులపైముద్రలు చిన్నవిగా ఉండడంతో ఇవి వీరఘట్టానికి చెందినవే అని అందరూ పొరబడుతున్నారు. పట్టించుకోని అధికారులు అధికారుల కళ్లముందే రోజూ మండలం నుంచి 25 లారీల వరకు ధాన్యం లోడులు తరలిపోతున్నా ఏ ఒక్క అధికారీ ఈ లారీలను అడ్డుకోవడం లేదు. వాస్తవంగా అనుమతులు ఉన్న వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తే ఒక్క శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. అలాగే రూట్ అనుమతులు పొంది ఉండాలి. ఈ ప్రాంతంలో చెక్ పోస్టులు లేకపోవడం వీరికి బాగా కలిసి వచ్చింది. విజయనగరం జిల్లా రాయవలస వద్ద వ్యవసాయ చెక్ పోస్టు ఉన్నప్పటికి ఇక్కడ పూర్తిస్థాయిలో వాహనాలను సోదా చేయకపోవడంతో ధాన్యం అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.చర్యలు తప్పవువిజయనగరం జిల్లాకు చెందిన గోనె సంచులతో అడ్డుగోలు వ్యాపారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ ఎం.వి. రమణ సాక్షికి తెలిపారు. తమ సిబ్బందితో నిఘా వేసి ధాన్యం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుంటామన్నారు. -
అన్నదాతను అక్కడా ముంచేశారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :అకాలవర్షాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే దశలోనూ అన్నదాత నిలువునా మునిగిపోయాడు. మిల్లర్లు, దళారుల మాయాజాలం, అధికారుల అవినీతి వెరసి ఖరీఫ్‌లో కష్టపడి పండించిన పంటను రైతు అయినకాడికి తక్కువ ధరకు అమ్మేసుకున్నాడు. 75 కేజీల బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1087.50 కాగా, అధిక శాతం మంది రైతులు బస్తాను రూ.600 నుంచి గరిష్టంగా రూ.850కే అమ్మేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణను పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కొనుగోళ్లు జరిపి మిల్లింగ్ కోసం మిల్లర్లకు పంపాలి. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 305 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందిరాక్రాంతి పథకం ద్వారా 150, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 150 కేంద్రాలను, మరో ఐదు కేంద్రాలను మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో దాదాపు 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రాథమిక అంచనా వేశారు. అయితే సరిగ్గా దిగుబడి చేతికొచ్చే దశలో గత నవంబర్‌లో కురిసిన అకాలవర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడులపై ప్రభావం చూపించింది. భారీవర్షాలకు వరిపంట తడిసి ముద్దవడంతో సుమారు రెండున్నర లక్షల మెట్రిక్ ధాన్యం రంగు మారిందని అధికారులే ప్రకటించారు. పంట నీటిలో నానడంతో ధాన్యం మొలకలు రావడం, రంగు మారే పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో 17శాతం లోపు తేమ ఉంటేనే కొనుగోలు చేయాలనే నిబంధనలను విధించారు. ఇక రంగు మారిన ధాన్యంపై ప్రభుత్వం చివరి వరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ప్రభుత్వ కేంద్రాల్లో పెద్దగా కొనుగోళ్లు జరగలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు అయినకాడికి దళారులకు, మిల్లర్లకు అమ్మేసుకున్నారు.75 కేజీల బస్తాను రూ.1087.50కు అమ్ముకోవాల్సిన రైతులు రూ.600 నుంచి రూ.850కే దళారులకు అమ్మేసుకున్నారు. మొత్తంగా బస్తాకు రూ.300 నుంచి రూ.500 వరకు నష్టాన్ని చవిచూశారు. ఇదే సందర్భంలో మిల్లర్లు, దళారులు, కొనుగోళ్ల కేంద్రాల నిర్వాహకులు మాత్రం కుమ్మక్కై అందినకాడికి దోచేసుకున్నారు. లెక్కలు తారుమారు రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నేరుగా కొనుగోలు చేయకపోవడంతో దళారులు, మిల్లర్లే రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొన్నారు. కానీ ఆ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు. రూ.600కు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రూ.1087కి కొన్నట్టు లెక్కలు తారుమారు చేసి రూ.కోట్లు నొక్కేశారు. చివరికి తడిసిన ధాన్యాన్ని కూడా నిబంధనల మేరకు తేమ శాతం తక్కువగానే ఉందని చూపించి కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు జరిపారు. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా 80 శాతం మంది రైతులు నేరుగా దళారులు, మిల్లర్లకే ధాన్యం అమ్మేసుకోగా, అధికారులు మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 10లక్షల97వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. సుమారు ఒక్కో రైతు.. బస్తాకు సగటున రూ.250 చొప్పున నష్టపోయారని లెక్కగట్టినా.. మిల్లర్లు, దళారులు, ఐకేపీ నిర్వాహకులు మింగేసింది రూ.200 కోట్లపైనే ఉంటుందని అంచనా. జిల్లాలో అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన ఈ ధాన్యం కొను‘గోల్మాల్’పై అధికారులు మాత్రం అటువంటిదేమీ జరగలేదని వాదిస్తున్నారు. ఆగని మిల్లర్ల మాయాజాలం లెవీ ఎత్తివేయడంతో మిల్లర్ల నుంచి ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసే అవకాశం లేదు. దాంతో మిల్లర్లు.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై అక్రమ పద్ధతులకు తెరతీశారు. గతంలో మాదిరిగానే రైతుల నుంచి మిల్లర్లే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరిపినట్టు లెక్కలు చూపించారు. ఫలితంగా గతంలో ఏరకంగా అయితే మిల్లర్ల మాయాజాలంలో చిక్కుకుని అయినకాడికి అమ్ముకుని రైతులు నష్టపోయారో ఇప్పుడు కూడా అదే మిల్లర్లకు దెబ్బతిన్నారు. లెవీ సేకరణ ఎత్తివేయడంతో రైతు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. -
ధర దడ
- దళారుల చేతుల్లో మార్కెట్ - టమోటా, మిర్చి, కాకర, బీర రేట్లకు రెక్కలు - బహిరంగ మార్కెట్లో కేజీ రూ.30-60 సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల కింద సాగవుతున్న కూరగాయల పంటలు ఎండిపోతున్నాయి. నగరం చట్టుపక్క జిల్లాల్లో టమోటా సాగు చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి తగ్గిపోయింది. దీన్ని సాకుగా చూపుతూ నగరంలో రిటైల్ వ్యాపారులు ఒక్కసారిగా వీటి ధరలు పెంచేశారు. ఏటా జూన్, జులై నెలల్లో ఎదురయ్యే కూరగాయల కొరతను ఆసరాగా చేసుకొని దళారులు ధరలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. హోల్‌సేల్‌తో సంబంధం లేకుండా తమ ఇష్టారీతిన రేట్లు పెంచి వినియోగదారుని దోచుకుంటున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా... రూ.30-60 మధ్యలో ధర పలుకుతున్నాయి. స్థానికంగా కూరగాయల దిగుబడి తగ్గిపోవడంతో మదనపల్లి, బెంగళూరు, ప్రాంతాల నుంచి వచ్చే సరుకుపైనే నగరం ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా డిమాండ్-సరఫరాల మధ్య అంతరం ఏర్పడి... ఆ ప్రభావం ధరలపై పడుతోంది. టమోటా, మిర్చి, బెండ, బీర, చిక్కుడు, కాకర ధరలు సామాన్యుడికి అందనంతగా పైకి ఎగబాకాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్యాప్సికం, ఫ్రెంచి బీన్స్ ధరలు నిప్పు మీద ఉప్పులా చిటపటలాడుతున్నాయి. వీటి ధర కేజీ రూ.60-100 పలుకుతుండడం వాటి కొరతకు అద్దం పడుతోంది. బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్లో టమోటా ధర కేజీ రూ.20 పలుకగా... ఇదే సరుకును బహిరంగ మార్కెట్లో రూ.35కు విక్రయిస్తున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా 30-40శాతం పెంచేశారు. తగ్గిన సరఫరా... నగర అవసరాలకు నిత్యం 45-50 వేల క్వింటాళ్ల కూరగాయలు కావాల్సి ఉంది. ప్రస్తుతం 30-35% మేర సరఫరా తగ్గినట్లు తెలుస్తోంది. ధరలకు కళ్లెం వేయాల్సిన మార్కెటింగ్ శాఖ మాత్రం ఏటా ఈ పెరుగుదల సర్వసాధారణమే అంటూ చోద్యం చూస్తోంది. ఈ సీజన్లో ఎక్కడా సమృద్ధిగా కూరగాయలు దొరకవు గనుక తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జూన్‌లో వర్షాలు కురిస్తే కొత్తపంట వేస్తారు. దిగుబడికి 45-65రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున మరో రెండు నెలల వరకు కూరగాయల ధరలు అస్థిరంగానే ఉండొచ్చనివారు చెబుతున్నారు. ట‘మోత’ టమోటా ధర సామాన్యుడికి అందనంటోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ టమోటా రూ.30 పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు కిలో రూ.14కు లభించిన టమోటా ఇప్పుడు రైతుబజార్లోనే రూ.23కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.20 పలికిన టమోటాకు మంగళవారం బహిరంగ మార్కెట్లో రూ.30-35ల చొప్పున వసూలు చేశారు. స్థానికంగా ఈ పంట సాగు చివరి దశకు చే రుకోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయి ఆ ప్రభావం ధరలపై పడింది. నగర డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. నగరానికి రోజుకు 400 టన్నుల టమోటా అవసరం. ప్రస్తుతం సుమారు 250 టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. ఈ కొరతే ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. గత పది రోజుల్లోనే ధరలు రెట్టింపవడంతో సామాన్యుడి కూరగాయల బడ్జెట్ తల్లకిందులైంది. బెంగళూరు, మదనపల్లి మార్కెట్లలోనే మంచి ధర లభిస్తుండటంతో నగరానికి సరఫరా తగ్గి, కొరత ఎదురైందని వ్యాపారులు చెబుతున్నారు. -
కొనుగోలు కేంద్రాల్లో దళారుల దందా
- ఎదురుతిరిగిన రైతులు - తహ శీల్దార్‌కు ఫిర్యాదు - కొడుముంజలో ఘటన వేములవాడ అర్బన్ : దళారుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయనేదానికి ఈ ఘటనే నిదర్శనం. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది. అరుుతే ఓ దళారీ ఏకంగా కొనుగోలు కేంద్రంలోనే కాంటా పెట్టి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఘటన వేములవాడ మండలం కొడుముంజలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని కొడుముంజలోని సింగిల్‌విండో కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రరుుంచేందుకు ఓ రైతు వచ్చాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఓ దళారీ, రైతుకు మాయమాటలు చెప్పి క్వింటాల్‌కు రూ.1200 చొప్పున చెల్లిస్తానని చెప్పి ధాన్యాన్ని ఏకంగా కొనుగోలు కేంద్రంలోనే తూకం వేశాడు. అంతేకాకుండా ట్రాక్టర్లో లోడ్ కూడా చేరుుంచాడు. ఇది గమనించిన మరో రైతు విషయాన్ని సింగిల్‌విండో చైర్మన్ నీలం శ్రీనివాస్‌కు అందజేయగా.. ఆయన అక్కడికి చేరుకుని ఈ విషయంపై కూపీ లాగాడు. రైతు వద్ద మధ్య దళారీ ధాన్యం కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో సదరు దళారీపై తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. అనంతరం తూకం వేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే దింపేశారు. అధికారుల నిఘా, పర్యవేక్షణ లోపంతోనే కొనుగోలు కేంద్రాల్లోకే దళారులు వస్తున్నారని రైతులు ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద మధ్య దళారుల బెడద లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
రుణాల పేరుతో ఘరానా మోసం!
- నిలువుదోపిడీ చేస్తున్న దళారులు - అవసరాలు.. అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ.. - పట్టణంలోనే 19 మంది బాధితులు సంగారెడ్డి మున్సిపాలిటీ: ‘మీకు అప్పు కావాలా..?, మేమడిగిన డాక్యుమెంట్లు చూపండి’ అంటూ పేపర్లలో ప్రకటన లు ఇస్తారు.. ఎవరో కొందరు అమాయకులు ఆ వలలో చిక్కగానే సర్వీస్ చారీ్జలు, డాక్యుమెంట్ చార్జీల పేరుతో కొంత డబ్బు మా బ్యాంకు అకౌంట్లో వేయండని వారిని బుట్టలో పడేస్తారు. ఇంకేముంది ఆ మాయగాళ్లు మళ్లీ కనబడితే ఒట్టు.. ఇలా ఎందరో అమాయకులు బలైపోతున్నారు. మోసపోయి చెప్పుకునే వారు అందులో కొంతమందే... వ్యక్తిగత, ల్యాండ్ మార్టిగేషన్, వ్యాపార రుణాలిస్తామని కొంద రు వ్యక్తులు పలు పత్రికల్లో ప్రకటన లు జారీ చేస్తున్నారు. వీటిని పరిశీ లించిన స్థానికులు మొబైల్ ఫోన్ ద్వారా వారిని సంప్రదిస్తున్నారు. ముందుగా ఏ రుణం కావాలి..?, ఏం చేస్తారు..?, ఎంత కావాలి? అనే వాటి వివరాలు సేకరిస్తారు. ‘అందుకు మీ ఐడీకార్డు, బ్యాంక్ పాస్‌బుక్, కరెంట్ బిల్లులను మెయిల్ చేయాలని వారికి సూచి స్తారు. అనంతరం మీ డాక్యుమెంట్లు చూశాం.. రుణం మంజూరు చేస్తాం అందుకోసం మీకు ఇచ్చే రుణంలో 50 శాతం కమీషన్ చెల్లిం చాల్సి ఉంటుంది’ అని నిర్వాహకులు అర్జీదారులకు తెలుపుతారు. వాటితో పాటు డాక్యుమెంట్ చార్జి రూ.2,350, జనరల్ ఇన్సూరెన్స్, ప్రాజెక్టు రిపోర్టు తయా రు చేయడానికి ముందుగా డబ్బులు చెల్లించాలంటారు. వాటిని శ్రీ దత్తసాయి ఎంటర్ప్రైజెస్ ఖాతా లో జమచేయాలని తర్వాత రెండు రోజుల్లో రుణం మంజూరవుతుందని తెలియజేస్తారు. కానీ వారమైనా నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం రాదు. ‘అర్జీదారులు ఫోన్‌చేస్తే మీకు అర్జెంటుగా రుణం కావాలంటే అదనంగా 2 శాతం కమీషన్ చెల్లించాలి. అలా అయితే వెంటనే చెక్కు జారీ చేస్తాం’ అని చెబుతారు. అసలు డాక్యుమెంట్లు పరిశీలించి వారం రోజుల్లో రుణం అందజేస్తామంటారు. వారు నెలరోజులైనా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఫోన్‌చేస్తే మరికొంత కమీషన్ చెల్లించాలంటూ అడుగుతున్నారని బాధితులు తెలిపారు. ఇలా పట్టణంలోనే 19 మంది తమ అవసరాల కోసం దరఖాస్తు చేసుకొని ఆ సంస్థ పేరున రూ.19,600 చొప్పున రూ.3,72,400 ను 863720110000472 ఖాతాలో జమచేశారు. మోసపోయా: శ్యాముల్ రాజు పత్రికల్లో రుణం ఇస్తామనే ప్రకటనలు చూసి ఆ సంస్థను సంప్రదించా. నేను రూ.19,600 చెల్లించాను.. -
పాస్‌పోర్టుల కోసం దళారులు, ఏజెన్సీలను ఆశ్రయించొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): పాస్‌పోర్టు కోసం తప్పుడు డాక్యుమెంట్లు, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఇబ్బందుల్లో పడవద్దని పాస్‌పోర్టు రీజినల్ అధికారి అశ్వని సత్తారు తెలిపారు. పాస్‌పోర్టుల అవసరం పెరిగిందని, వీటిని అందరికీ త్వరగా, పారదర్శకంగా ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. పాస్‌పోర్టుల కోసం ఏజెన్సీలను, దళారీలను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు. శనివారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో 2 రోజుల పాస్‌పోర్టు సేవ శిబిరాన్ని ఆమె జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు రీజినల్ అధికారి మాట్లాడుతూ ఈ ఏడాది ఇంతవరకు పాస్‌పోర్టు కోసం 7.10 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 6.9 లక్షల పాస్‌పోర్టులు ఇచ్చామని తెలిపారు. పోలీస్ వెరిఫికేషన్ త్వరగా అవుతుండటం వల్ల ఎటువంటి జాప్యం లేకుండా ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది నవంబర్ 25 తర్వాత హ్యాండ్ రిటర్న్ పాస్‌పోర్టులు చెల్లుబాటు కావని, వాటిని మిషన్ రీడబుల్ పాస్‌పోర్టులుగా మార్చుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా నుంచి పాస్ పోర్టు కోసం 300 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, డాక్యుమెంట్లు, ధృవపత్రాల వెరిఫికేషన్ కోసం తీవ్ర వ్యయప్రయాసాలకు గురై హైదరాబాదుకు రాకుండా భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆదేశాల మేరకు కర్నూలులో సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి జిల్లాలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉందని తెలిపారు. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నా రానివారు ఏజెన్సీలు, బ్రోకర్లను ఆశ్రయించరాదని, ఎందుకు రాలేదో స్వయంగా సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో ప్రతి పనిదినం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు సంప్రదించవచ్చని తెలిపారు. విమానాల్లో ప్రయాణించేవారు ప్రయాణించే వాటికి పాస్‌పోర్టు చెల్లుబాటు(వ్యాలిడిటీ) కనీసం ఆరు నెలలు ఉండాలన్నారు. మైనర్లకు పాస్‌పోర్టు ఐదేళ్ల వ్యాలిడిటీతో ఇస్తామన్నారు. తర్వాత వాటిని పదేళ్ల వ్యాలిడిటీకి మార్చుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా బయోమెట్రిక్ ఇ-పాస్‌పోర్టులు రానున్నాయని తెలిపారు. సరైన డాక్యుమెంట్లు, ధృవపత్రాలు, వివరాలు ఇస్తే జాప్యం లేకుండా పాస్‌పోర్టులు ఇస్తామన్నారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కర్నూలు ఆర్థిక రాజధాని కానుందని, ఇందుకు తగిన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ పాస్‌పోర్టు కోసం వచ్చిన దరఖాస్తులను 21 రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ పాస్‌పోర్టు అధికారి రవికోసూరి కూడా పాల్గొన్నారు. మొదటి రోజు 150 దరఖాస్తుదారుల ధ్రువపత్రాలను వెరిఫికేషన్ చేశారు. ఆదివారం కూడా సేవా శిబిరం కొనసాగనుంది. -
దళారులదే హవా!
రైతులకు తగిన మద్దతు ధర కల్పించి, వారి నుంచి సేకరించేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు దళారులకు అడ్డాలుగా మారాయి. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తూ వారు సొమ్ము చేసుకుంటున్నారు. కళ్లాలవద్దకు వచ్చి సొమ్ము చెల్లిస్తుండడంతో రైతులు, తమకు శ్రమ లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువస్తున్నందుకు అధికారులు.. దళారులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయాలు జోరుగా సాగడానికి ఇదే అసలు కారణం. విజయనగరం కంటోన్మెంట్: అధికారుల పర్యవేక్షణ లోపం, తగిన సౌకర్యాలు కల్పించకపోవడం, నిబంధనల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులు ప్రయోజనం పొందలేకపోతున్నారు. ధాన్యం సరఫరా చేసిన వెంటనే డబ్బులు చెల్లించకపోవడం, శాంపిళ్ల అవస్థలు, రవాణా ఖర్చుల భారంతో పాటు పెట్టుబడుల కోసం దళారులు ముందుగా అడ్వాన్సులివ్వడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా కళ్లాల వద్దకు వస్తున్న దళారులకే దాన్యం విక్రయిస్తున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసినా నోరు మెదపడంలేదు. ఎందుకంటే ప్రభుత్వం విధించిన సవాల క్ష నిబంధనల కారణంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం ఇవ్వడం లేదు. ఇలా అయితే లక్ష్యాలు చేరుకోవడం కష్టం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎటూ దళారులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయిస్తున్నారు కాబట్టి లక్ష్యం నెరవేరుతోందని అధికారులు మిన్నుకుంటున్నారు. రైతులకు అందని మద్దతు ధర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.1360 కంటే రూ. 200 నుంచి రూ.300 తక్కువకు దళారులు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం నెరవేరుతున్నా... రైతులకు మద్దతు ధర అందకుండా పోతోంది. అయినా అధికారులు గమ్మునుంటున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తున్నది దళారులే....కానీ ఆ ధాన్యాన్ని ఎవరి వద్ద కొనుగోలు చేస్తున్నారో వారి పట్టా పాసు పుస్తకాలు, వారి వివరాలను అధికారులకు వ్యాపారులు అప్పగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కొత్తలో ధాన్యాన్ని సివిల్సప్లై అధికారులే కొనుగోలు చేశారు. అయితే ధాన్యం అమ్మకాలు జోరందుకోవడంతో ఇప్పుడు ప్రైవేటు వ్యాపారులు రంగప్రవేశం చేశారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేందుకు అధికారులు గోనె సంచులు ఇస్తారు. వాటి ద్వారానే కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు దీనికి భిన్నంగా జరుగుతోంది. పౌరసరఫరాల శాఖ ఇస్తున్న పురి గోనెలు కాకుండా తెల్లని ప్లాస్టిక్ సంచుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. తూర్పారబట్టిన చోటే వీటిని ఆ గోనె సంచుల్లో ఎక్కిస్తున్నారు. వాటి ద్వారానే మిల్లులకు నేరుగా ధాన్యం వెళుతోంది. అయినా అధికారులు స్పందించడం లేదు. దీంతో ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తున్నట్టు ? అధికారులా? దళారులా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 81 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్న అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారా ? లేదా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యం వెళ్తున్నాయా అంటే స్పష్టమయిన సమాచారం లేదు. జిల్లాలో ఉన్న కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నామని చెబుతున్న అధికారులు, కొనుగోలు చేస్తున్న తీరును మాత్రం గమనించడం లేదు. కొంత మంది దళారులు వరిపంట వేసే ముందే రైతులకు అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారు. అలా అడ్వాన్సు వ్యాపారం చేస్తున్న దళారులు ఇప్పుడు తమకు ధాన్యం ఇవ్వాలని కోరడంతో రైతులు కూడా వారికే తూకం వేసి ఇస్తున్నారు. ఇలా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని వారు నేరుగా మిల్లులకు పట్టుకెళుతున్నారు. దీంతో అధికారులు ఇంత ప్రచారం చేసినా ధాన్యం మాత్రం ప్రైవేటు వ్యాపారుల పరమవుతోంది. జిల్లాలో ఇంత వరకూ స్తబ్దుగా ఉన్న ధాన్యం వ్యాపారం ఇప్పుడు జోరందుకుంది. జిల్లాలో ఇప్పటివరకూ దాదాపు రూ. 32 కోట్ల విలువైన 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా రైతులకు రూ.14 కోట్ల పై చిలుకు బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారమంతా నేరుగా రైతులు చేయకుండా దళారుల ద్వారా జరుగుతోంది. దీంతో ఇటు రైతులు నష్టపోవడమే కాకుండా, అటు రైతులకు మద్దతు ధర చెల్లించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. -
అక్రమ దందాకు సీఛీఐ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతుకు భరోసా ఇవ్వాల్సిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) దళారులు, వ్యాపారులకు అండగా నిలుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల పత్తిని మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జిన్నింగ్ మిల్లుల యజమానులు, దళారుల పత్తిని యథేచ్ఛగా అక్రమంగా కొనుగోలు చేస్తోంది. వీరితో కుమ్మక్కవుతున్న సీసీఐ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ దందాకు తెరలేపారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ అధికంగా ఉందంటూ తిరస్కరిస్తున్న సీపీవోలు (కాటన్ పర్చేస్ ఆఫీసర్లు).. తమతో కుమ్మక్కైన వ్యాపారుల పత్తి నాణ్యతను ఏ మాత్రం పరిశీలించకుండానే కొనుగోళ్లు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమాల్లో ఆ సంస్థలోని కింది నుంచి పైవరకు స్థాయిని బట్టి ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాల్లో సీపీవోలు కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కొనుగోళ్లు.. 30 శాతానికి పైనే.. ఈ కొనుగోలు సీజన్లో సీసీఐ జిల్లాలో 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 5.14 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పత్తి విలువ సుమారు రూ.208 కోట్ల వరకు ఉంటుంది. ఇలా సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో సుమారు 30 శాతం పైగా పత్తిని దళారులు, వ్యాపారుల వద్దే కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమ కొనుగోలు చేసిన పత్తి విలువ సుమారు రూ.50 కోట్లకుపైగానే ఉంటుందంటే.. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఏ మేరకు అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బినామీ రైతుల పేరుతో.. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస మద్దతు ధరైనా దక్కుతుందనే ఎంతో ఆశతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చాక పత్తిలో తేమ శాతం 12 మించి ఉందంటూ కాటన్పర్చేజ్ అధికారులు రైతుల పత్తిని కొనుగోలును తిరస్కరిస్తున్నారు. చేసేదేమీ లేక ఆ రైతులు ఆ పత్తిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలో రూ.300 నుంచి రూ.400 వరకు కోత విధించి క్వింటాల్‌కు రూ.3,500 నుంచి 3,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా రైతుల వద్ద కొనుగోలు చేసిన ఇదే పత్తిని బినామీ రైతుల పేరుతో సీసీఐకి రూ.4,050 (కనీస మద్దతు ధర) చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో క్వింటాల్‌పై సుమారు రూ.400 చొప్పున సీసీఐ అధికారులు, వ్యాపారులు కలిసి పంచుకుంటున్నారు. ఇలా నిత్యం వేల క్వింటాళ్ల అక్రమ కొనుగోళ్లతో రూ.లక్షలు దండుకుంటున్నారు. బోగస్ పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్‌లను పెట్టి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. చెక్కుల విధానంతో అక్రమాలకు ఊతం.. రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తికి సంబంధించిన డబ్బుల చెల్లింపుల్లో ప్రస్తుతం చెక్కుల విధానం అమలవుతోంది. కానీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే విధానం ఉంటే ఈ అక్రమ కొనుగోళ్లకు చాలా వరకు చెక్ పడుతుంది. కానీ ఈ ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయడంలో సీసీఐ అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విధానం అమలయ్యేలా చూడాల్సిన జిల్లా అధికార యంత్రాం గం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతేడాది సీజన్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే పత్తి డబ్బులు జమ చేసే వారు. దీంతో ఈ అక్రమాలకు చెక్ పడింది. కానీ ఈ ఏడాది కొనుగోలు సీజన్ ఊపందుకున్నా ఆన్లైన్ చెల్లింపుల విధానం ఇంకా అమలు చేయడం లేదు. విజిలెన్స్ దృష్టి సారించాలి.. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమ దందాపై కాటన్ కార్పొరేషన్ విజిలెన్స్ విభాగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొనుగోళ్ల తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే రూ.కోట్లలో జరుగుతున్న అక్రమ దందా వెలుగు చూస్తుందని పత్తి రైతులు పేర్కొంటున్నారు. సీసీఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం జిల్లాలో అడిగే నాథుడే లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా తయారైందనే ఆరోపణలున్నాయి. -
ఏటా నిరాశే!
జడ్చర్ల: రైతన్నకష్టం దళారుల భోజ్యమవుతోంది. శ్రమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడమే గగనమైపోయింది. మద్దతుధర కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), నాఫెడ్ కొనుగోలు కేంద్రాల ఊసే లేకుండాపోయింది. మంచిధర వస్తుందని ఆశించి భంగపడిన రైతులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. గిట్టుబాటు ధర దక్కకపోతుం దా.. అప్పులబాధ నుంచి గట్టెక్కకపోతామా? అని యోచించిన రైతులకు ఏటా నిరాశే ఎదురవుతోంది. జిల్లాలో ఈ ఏడాది 2.15లక్షల హెక్టార్లలో పత్తిని సాగుచేశారు. ఎకరా సాగుకోసం రూ.30 నుంచి రూ.40వేల వరకు ఖర్చుచేశారు. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, ఆ తరువాత తెగుళ్ల బెడద కారణంగా ఎకరా పొలంలో ఏడు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో పత్తి క్వింటాలుకు రూ.5వేలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఈ ధరలు చెల్లించేందుకు జిల్లాలో షాద్‌నగర్ మినహా ఎక్కడా సీసీఐ కొనుగోలుకేంద్రం లేదు. 2004లో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం ఉన్నా అప్పట్లో పత్తికి సరైనధరలు రావడం లేదనే సాకుతో ఈ కేంద్రాన్ని ఎత్తివేశారు. ఇదిలాఉండగా, రెండేళ్ల క్రితం మాత్రం సీజన్ చివరి సమయంలో జడ్చర్లలో నాఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రభుత్వ మద్దతుధరలకు కొనుగోళ్లు జరిపారు. ఆ తరువాత నాఫెడ్ కూడా జాడేలేకుండాపోయింది. జడ్చర్ల శివారులో గంగాపురం గ్రామ సమీపంలో పత్తి క్రయవిక్రయాలకు సంబందించి ప్రత్యేకంగా పత్తి మార్కెట్‌ను నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏడాది రెండు లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి విక్రయాలు జరుగుతాయి. రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నా.. సీసీఐ, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవచూపడం లేదు. జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా పరిగి, తాండూరు తదితర సుదూర ప్రాంతాల నుండి కూడా రైతులు ఇక్కడికే వచ్చి పత్తిని విక్రయిస్తారు. అయితే అన్నిహంగులతో ప్రత్యేకంగా యార్డు ఉన్నా సీసీఐ కేంద్రం లేకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. సీసీఐ కొనుగోలుచేస్తే.. పత్తిని సీసీఐ కొనుగోలుచేస్తే రైతులకు లాభం చేకూరుతుంది. సీసీఐ ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలకు తక్కువకాకుండా కొనుగోలుచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొనుగోళ్ల కారణంగా వ్యాపారుల్లో పోటీతత్వం పెరిగి.. సీసీఐ కంటే ఎక్కువధరలు చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ సీసీఐ కొనుగోలు చేయకపోతే వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా తక్కువధరలు కేటాయించే అవకాశం ఉంది. మార్కెట్ యార్డుకు పత్తి భారీమొత్తంలో విక్రయానికి వచ్చిన సమయంలో వ్యాపారులు కుమ్మకై అతితక్కువ ధరలు చెల్లించే అవకాశం లేకపోలేదు. పత్తి దిగుబడులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. రైతులు పత్తితీత పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. తీసిన పత్తిని విక్రయించేందుకు.. మంచి ధరల కోసం ఎదురుచూస్తున్నారు. దళారుల మోసం.. ఏటా నష్టం పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర కూడా నామమాత్రంగానే ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పత్తి క్వింటాలుకు ప్రభుత్వం పెంచిన ధర కేవలం రూ.50మాత్రమే. దీంతో గరిష్ట మద్దతు ధర రూ.4050, కనిష్టంగా రూ.3750 ఉంది. ఇదిలాఉండగా, పత్తి కొనుగోళ్లకు సంబంధించి దళారులు గ్రామాలపై కన్నేశారు. ధరలు లేవని రైతులను నమ్మించి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా విత్తనాలు, పురుగు మందుల వ్యాపారులు దళారుల అవతారమెత్తి నిలువునా దోచుకుంటున్నారు. మార్కెట్ కంటే తామె ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నామని నమ్మబలుకుతున్నారు. కలెక్టర్ స్పందించి దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు చర్యలు తీసుకుని సీసీఐ, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని పత్తి రైతులు కోరుతున్నారు. -
దళారీ వ్యవస్థకు చెక్ పడేనా?
ఒంగోలు టూటౌన్ : రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బజార్లు దళారులకు అడ్డగా మారాయి. రైతుల పేరుతో కార్డులు పొంది అక్రమాలకు పాల్పడుతున్నారు. అర్హులైన రైతులకు రైతుబజార్లో చోటు దక్కడం గగనంగా మారింది. జిల్లాలో పండించిన కూరగాయలను రైతులు ఇక్కడే అమ్ముకునే విధంగా చర్య లు తీసుకోవాలన్న లక్ష్యంతో 1999లో అప్పటి ప్రభుత్వం జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు చీరాల, తదితర ప్రాంతాల్లో రైతు బజార్లను ఏర్పాటు చేసింది. కందుకూరులో 2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఒక్క ఒంగోలులోనే కొత్తపట్నం బస్టాండ్, లాయర్‌పేట, సీతారామపురం ప్రాంతాల్లో రైతు బజార్లు ప్రారంభించారు. చీరాలలో రైతు బజారు మూతపడి చాలకాలమైంది. తిరిగి ప్రారంభించే చర్యలను అధికారులు తీసుకోలేకపోయా రు. ప్రారంభంలో రైతు బజార్లలో చోటు దక్కించుకునేందుకు రాజకీయ పైరవీలు రాజ్యమేలాయి. అప్పట్లో పలుకుబడి ఉన్న వారికే షాపు దక్కింది. అర్హులైన రైతులకు నిరాశే ఎదురైంది. అప్పటి నుం చి ప్రభుత్వాలు మారుతున్నా రైతు బజార్లను పట్టించుకున్న వారు లేరు. రైతుబజార్లను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం రాష్ర్టం విడిపోయి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రైతు బజార్ వారోత్సవాలకు తెరలేపింది. ఈ నెల 11న సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ కె.యాకూబ్‌నాయక్ తన చాంబర్లో రైతు బజార్ వారోత్సవాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, వ్యవసాయమార్కెటింగ్ శాఖ అధికారు లు పాల్గొన్నారు. రైతు బజార్లలో దళారులను గుర్తించి అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం నుంచి వరుసగా ఐదు రోజు ల పాటు వారోత్సవాలు నిర్వహించనున్నారు. తొలిరోజు లాయర్‌పేట రైతుబజార్లో వారోత్సవాలు ప్రారంభిస్తారు. 17వ తేదీ పచ్చదనం-పారిశుధ్యం, 18న కూరగాయలు పండించే రైతులకు యాజ మాన్య పద్ధతులు, గ్రేడింగ్‌పై శిక్షణ, 19న సంచార రైతు బజార్లు, 20న రైతు బజార్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా దళారీ వ్యవస్థను నిర్మూలించి అర్హులైన రైతులకు అవకాశం కల్పిస్తారో లేదోనన్న సందేహం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది. ఎందుకంటే 15 ఏళ్లుగా తిష్టవేసిన దళారులను ఒక్కసారిగా తొలగిం చడం సాధ్యమయ్యే పనేనా.. అంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ప్రతి రైతుబజార్లో 10 నుంచి 15 షాపుల వరకు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎవరికీ కేటాయించలేదు. వారోత్సవాలతోనైనా రైతు బజార్లను ప్రక్షాళనా చేసి అర్హులకు అవకాశం కల్పిస్తారో లేదో వేచిచూడాలి. -
‘దళారీ’బజార్
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం రైతుబజార్లో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలు, ఆకుకూరలను అమ్ముకునే రైతులకు ఇక్కడ స్థానం లేకుండా పోతోంది. తక్కువ ధరలకే తాజా కూరగాయలు ైరెతులకు అందించాలనే లక్ష్యంతో నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన రైతుబజార్ దళారుల మూలంగా బేజార్ అవుతోంది. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచి కొంతమంది దళారులు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో రైతుబజార్లో పాగావేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం అర్బన్, రూరల్ మండలాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు ఉపాధి పొందాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ బజార్‌ను పూర్తిగా దళారులు చేతుల్లోకి తీసుకున్నారు. వ్యాపారులు, దళారులు హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ నుంచి సరుకును కొనుగోలు చేసి రైతుబజార్లో అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. రైతులకు మాత్రమే అవకాశం ఇక్కడ కూరగాయల విక్రయాలు జరుపుకునే అవకాశం కేవలం రైతులకు మాత్రమే ఉంది. అనుమతిపొందిన డ్వాక్రా గ్రూపులు కూడా ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇక్కడ కూరగాయలు అమ్మేది రైతులా? కాదా? అనే విషయాన్ని ఉద్యానవనశాఖ, రెవెన్యూశాఖల అధికారులు ధ్రువీకరించాల్సి ఉం టుంది. సంబంధిత శాఖ ల అధికారులు క్షేత్ర పర్యటనకు కూడా వెళ్లాలి. రైతుబజార్లలో అమ్మకాలు జరుపుతున్న రైతులందరూ కూరగాయలు పండిస్తున్నారో..లేదో ధ్రువీకరించాలి. సంబంధిత రైతులకు గుర్తింపుకార్డులు ఇచ్చి రైతుబజార్లో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకునే అవకాశం కల్పించాలి. కానీ ఈ నిబంధనలేవి ఇక్కడి రైతుబజార్లో అమలు కావడం లేదని తెలుస్తోంది. రైతుల పేరుతో కొందరు కూరగాయలు తెచ్చి అమ్ముతుండగా, మరికొందరు వ్యాపారులు నేరుగానే సరుకును హోల్‌సేల్‌గా కొనుక్కు వచ్చి అమ్ముతున్నారు. ధరల నియంత్రణ లేదు నిబంధనల ప్రకారం హోల్‌సేల్ మార్కెట్ రేటుకన్నా 25 శాతం ఎక్కువ, రిటైల్ ధరల కన్నా 25 శాతం తక్కువకు రైతుబజారు లో రైతులు సరుకును అమ్మాలి. కానీ ఆ నిబంధన ఇక్కడ అమలుకావడం లేదు. వ్యాపారులు సిండికేటై తాము నిర్ణయిం చుకున్న ధరలకే అమ్మకాలు జరుపుతున్నారు. అవే ధరలను బోర్డుపైనా రాయిస్తున్నారు. ఇదేమని వినియోగదారులు ప్రశ్నిస్తే అంతా ఏకమై తిరగబడుతున్నారు. ధరల విషయంలోనూ అధికారుల నియంత్రణ లేకపోవడమే దీనికంతటికీ కారణమని వినియోగదారులు అంటున్నారు. నిబంధనలో లోపాలను ఆస రా చేసుకుని దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుమతిలేకపోయినా సరుకును రైతుబజార్‌కు తెచ్చి అమ్ముతున్నారు. కొందరు రైతుబజార్లో దుకాణ స్థలాలను సొంత జాగీరులా ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని అంటున్నారు. రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఉంటే ఇటువంటి సమస్య వచ్చి ఉండేదికాదని చెబుతున్నారు. చర్యలకు పూనుకోని ప్రభుత్వశాఖలు రైతుబజార్ ఏర్పాటు లక్ష్యం నీరుగారిపోతున్నా దాని నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వశాఖలు ఎటువంటి చర్యలకు పూనుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రైతుబజార్లో ఎటువంటి సమస్య ఏర్పడినా, గొడవలు జరిగినా అధికారులు వెళ్లి తాత్కాలికంగా పరిష్కరించి వస్తున్నారే తప్ప శాశ్వ త పరిష్కారం చూపటంలేదని రైతులు విమర్శిస్తున్నారు. జిల్లా జా యింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పర్యవేక్షణలో నిర్వహిం చే ఈ రైతుబజార్ బాధ్యతలను జిల్లా మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ కోట చౌదరిరెడ్డి చూస్తున్నారు. ఒకవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం..మరోవైపు ఉద్యాన, రెవెన్యూశాఖల నిర్లక్ష్యంతోనే రైతుబజార్ బేజారవుతోందనే విమర్శలు వస్తున్నాయి. -
రైతుకష్టం దళారిపాలు
►సుబాబుల్, జామాయిల్‌కు దక్కని ధర ►ఏడాదికి రూ.42 కోట్లు దళారుల పాలు ► దళారులను ప్రోత్సహిస్తున్న పేపర్‌మిల్లుల ప్రతినిధులు ►పెంచిన ధరలను అమలు చేయకుండా మెలికలు ► గుర్తింపు కార్డులంటూ కాలయాపన చేస్తున్న మార్కెట్ కమిటీలు చీమకుర్తి: స్వేదం చిందించి ఏడాదిపాటు రైతుపడ్డ కష్టాన్ని అడ్డదారిలో వచ్చిన దళారులు దోచుకుంటున్నారు. ఏడాదికి సుమారు రూ.42 కోట్లు దళారుల పాలవుతుండగా, కష్టపడిన రైతన్నకు నష్టాలే మిగులుతున్నాయి. పేపర్‌మిల్లుల ప్రతినిధులు, దళారులు కుమ్మక్కవుతుండటంతో సుబాబుల్, జామాయిల్ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెంచిన ధరలను అమలు చేయకుండా టన్నుకు రూ.700 లెక్కన రైతు కష్టాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుబాబుల్, జామాయిల్ సరాసరిన నెలకు 50 వేల టన్నుల కర్ర కొనుగోలు చేస్తున్నారు. 50 వేల టన్నుల మీద టన్నుకు రూ.700 లెక్కన నెలకు రూ.3.5 కోట్లు దారిమళ్లుతున్నాయి. ఏడాదికి రూ.42 కోట్లు రైతుల కష్టం దళారుల పాలవుతోంది. గుర్తింపు కార్డులంటూ మార్కెట్ కమిటీలు కాలయాపన పనులే తప్ప రైతులకు జరుగుతున్న నష్టాన్ని నివారించింది లేదు. వివరాల్లోకి వెళితే.... ►మార్కెట్ కమిటీల ద్వారా పేపర్ మిల్లుల ప్రతినిధులు సుబాబుల్, జామాయిల్ కర్రను కొనుగోలు చేస్తున్నారు. సుబాబుల్ టన్ను రూ.3700, జామాయిల్ టన్నుకు రూ.3900 లెక్కన గతేడాది వరకు కొనుగోలు చే శారు. దానిని గత ఫిబ్రవరి 18వ తేదీన విజయవాడలో రైతుసంఘాల నాయకులు, పేపర్ మిల్లుల యాజమాన్యాలు కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. టన్ను ధర సుబాబుల్‌ను రూ. 3700 నుంచి రూ. 4400కు, జామాయిల్ ధరను రూ.3900 నుంచి రూ.4600కు పెంచారు. అందరి ఏకాభిప్రాయం మేరకు పెంచిన ధరలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఇంత వరకు పెంచిన ధరలను అమలు చేయకుండా పాత ధరలనే పేపర్‌మిల్లుల ప్రతినిధులు చెల్లిస్తున్నారు. దాని వలన ఒక్కొక్క రైతు టన్నుకు రూ.700 లెక్కన నష్టపోతున్నారు. ►జిల్లాలో 14 మార్కెట్ కమిటీలున్నాయి. వాటిలో ఏడు మార్కెట్ కమిటీల ద్వారానే కర్ర కొనుగోలు చేస్తున్నారు. నెలకు సరాసరిన 50 వేల కర్రను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. రైతులకు చెందాల్సిన సొమ్మును అడ్డదారిలో పేపర్ మిల్లుల ప్రతినిధులు, దళారులు కలిసి దోచుకుంటున్నారు. ►దానిపై రైతులు, రైతు సంఘాల నాయకులు పలుమార్లు మార్కెట్ కమిటీ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. కలెక్టర్‌తో పాటు వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు ఇటీవల జిల్లాకు వచ్చినపుడు ఆయన కూ విన్నవించారు. దీంతో ఇంకా ఈ జిల్లాలో పెరిగిన ధరలను ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి ఆరా తీశారు. ►కలెక్టర్, మార్కెట్ కమిటీలు పెంచిన ధర అమలు చేసేందుకు పేపర్‌మిల్లుల ప్రతినిధులపై వత్తిడి తీసుకురావడంతో దానికి వారు రైతులు తీసుకొస్తున్న కర్ర సన్నగా ఉందని, నాణ్యంగా లేదని మెలికలు పెడుతున్నారు. సన్నకర్ర తీసేసి మంచి నాణ్యమైన కర్ర తీసుకొస్తే దానికి పెంచిన ధరలను అమలు చేస్తామని చెబుతున్నారు. దాంతో రైతులు ఏం చేయాలో తోచక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ►మార్కెట్ కమిటీల అసిస్టెంట్ డెరైక్టర్ మహ్మద్ఫ్రీ రైతుల గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా వారికి జరిగే అన్యాయాన్ని నివారిస్తానని చెప్తున్నారు. రైతులకు గుర్తింపు కార్డులిచ్చి వారి ఎకౌంట్లలో నేరుగా డబ్బు పడేలా చూస్తానని, తద్వారా దళారి వ్యవ స్థను నిలువరించవచ్చంటున్నారు. ►కానీ దళారులు కూడా అందుకు తగ్గట్లుగానే రైతుల్లో తమకు అనుకూలమైన వారి పేర్ల మీదనే కర్రకొనుగోలు చేసి, వారి ద్వారానే తమకు అనుకూలంగా మలుచుకునే మార్గాలు కూడా ఉన్నాయని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ►పెంచిన ధరలను పేపర్‌మిల్లుల ప్రతినిధులు అమలు చేయకుండా తమ శ్రమను నిలువునా దోచుకుంటుంటే ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ►చీమకుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ర కొనుగోలు చేసే రైతులు ఒక్కొక్క మార్కెట్ కమిటీ పరిధిలో సుమారు ఐదారు వందల మంది ఉన్నట్లు అంచనా. ఇలా జిల్లా మొత్తం మీద వేలల్లో ఉన్న రైతులను దళారులు మోసగిస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కర్ర కొనుగోలుపై పెంచిన ధరలను తక్షణమే అమలు చేసి సన్నకర్ర, నాణ్యత లేదనే మెలికలు పెట్టకుండా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
పేదల బియ్యం పక్కదారి!
- డీలర్లు.. మిల్లర్ల మాయాజాలం - అక్రమంగా తరలుతున్న రూ.కిలో బియ్యం - గుట్టుగా మహారాష్ట్రకు తరలింపు - మన మిల్లుల్లోనూ రీసైక్లింగ్ - అనంతరం మార్కెట్‌కు... - పౌరసరఫరాల మంత్రి ఇలాఖాలోనే అవినీతి దందా! సాక్షి, కరీంనగర్ : రేషన్ బియ్యం అక్రమంగా తరలుతోంది. బియ్యం అక్రమ రవాణాలో డీలర్ల పాత్ర కీలకంగా మారింది. కొంత మంది డీలర్లు తమకు వచ్చిన బియ్యాన్ని కోటా నుంచి మిగుల్చుకుంటే.. ఇంకొందరు పేదలకు ఇవ్వాల్సిన దాంట్లో సగం కోటా ఇవ్వకుండా స్థానికంగా ఉండే రైస్‌మిల్లర్లు, దళారులు, వ్యాపారులకు రూ.10 నుంచి రూ.15కు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు దళారులు, వ్యాపారులు నేరుగా ఆ బియ్యాన్ని రోడ్డు, రైలు మార్గాల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి (మరపట్టి) జిల్లాకు తీసుకొచ్చి.. మళ్లీ మనకే బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.23 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై రెవెన్యూశాఖ రైల్వేస్టేషన్లపై నిఘా పెట్టి అప్పుడప్పుడు దాడులు చేస్తుండగా అక్రమంగా తరలుతోన్న క్వింటాళ్లకొద్దీ బియ్యం పట్టుబడుతోంది. అధికారుల దాడులు తెలుసుకున్న కొందరు రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా బియ్యాన్ని రైళ్లలో సరిహద్దు దాటిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలోనే జరిగే రీసైక్లింగ్ ఇప్పుడు మన జిల్లాలోని పలు రైస్‌మిల్లుల్లోనూ జరుగుతున్నట్లు సమాచారం. కొందరు డీలర్లు మిల్లర్లకు ఐదారు రూపాయలకు కిలో బియ్యం విక్రయిస్తున్నారు. మిల్లర్లు.. ఆ బియ్యాన్ని స్థానిక మిల్లుల్లో మరపట్టించి.. బహిరంగ మార్కెట్లో కిలో రూ.23 నుంచి రూ.27కు అమ్ముతున్నారు. రేషన్‌బియ్యం పక్కదారి పట్టడం వెనక పలువురు రేషన్ డీలర్లు.. కాంట్రాక్టర్లతోపాటు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల పొట్ట కొట్టి బియ్యాన్ని పక్కదారి పట్టించిన చాలామంది డీలర్లు ఇప్పటికే లక్షలు గడించారు. ఇటు మిల్లర్లూ అదే బియ్యాన్ని మార్కెట్లో అధిక ధరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. తాజాగా ఈ నెల 15న.. విజిలెన్స్ అధికారులు కరీంనగర్‌లోని ఓ రైస్ మిల్లులో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జిల్లాలో జరుగుతున్న అవినీతి దందాకు అద్దం పడుతోంది. అదే రాత్రి జూలపల్లి మండలంలో 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. అక్రమంపై కొరడా ఝుళిపించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగడంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సాక్షాత్తూ.. రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే అవినీతి దందా ఈ స్థాయిలో జరగడం చర్చనీయాంశమైంది. తరలింపు తీరిది! బియ్యం అక్రమ రవాణాకు రైలు, రోడ్డు మార్గాలను ఎంచుకున్న దళారులు, వ్యాపారులు డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని ప్లాస్టిక్ బస్తాల్లో నింపి రోజుకు కొన్ని బస్తాల చొప్పున గుట్టుచప్పుడు కాకుండా జమ్మికుంట, పొత్కపల్లి, ఓదెల, కొలనూరు, పెద్దపల్లి, రాఘవపురం, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బెల్లంపల్లి, రేచినిరోడ్డు, ఆసిఫాబాద్ రోడ్డు, కాగజ్‌నగర్, సిర్పూర్ రైల్వేస్టేషన్ల నుంచి తరలిస్తారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా విరూర్ స్టేషన్‌కు బియ్యాన్ని చేరవేస్తారు. బస్తాలన్నీ ఒకే ప్రాంతం నుంచి లోడ్ చేసే సమయం ఉండకపోవడం.. అందరికీ అనుమానం వచ్చే అవకాశాలు ఉండడంతో దళారులు చాకచక్యంగా బియ్యాన్ని లారీలో నింపుకుని జిల్లా పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్లలో కొన్ని, కొన్ని చొప్పున డంప్ చే సుకుంటూ పోతున్నారు. మరో రోడ్డు మార్గాన్ని ఎంచుకున్న వ్యాపారులు జిల్లాలో పలు కేంద్రాలను చేసుకుని సిద్దిపేట- కామారెడ్డి మీదుగా మహారాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నారు. సుల్తానాబాద్, నిమ్మలపల్లి, వేములవాడ నుంచి బియ్యం లారీ ద్వారా పెద్ద ఎత్తున మహారాష్ట్రకు వెళ్తుంది. ఈ దందాతో దళారులకు అన్ని ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.3 లక్షలు మిగులుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. - ఈ నెల 15న కరీంనగర్ మండలం రేకుర్తి నుంచి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా జూలపల్లి మండలం వడ్కాపూర్ శివారులో పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. - 15న జిల్లా కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 99.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. - 12న కొడిమ్యాల నుంచి సిరిసిల్లకు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు వేములవాడలో పట్టుకున్నారు. - 4న.. ఓదెల మండలం కొలనూరులో 15 క్వింటాళ్లు పట్టుకున్నారు. - గత నెల 5న.. సుల్తానాబాద్‌లో ట్రాలీలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని రె వెన్యూ, డీటీసీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. - మే నెలలో సిరిసిల్ల మండలం పెద్దూరు వద్ద 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. - మార్చి 11న.. వేములవాడలో వాహనంలో 23 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. - జమ్మికుంట రైల్వేస్టేషన్ కేంద్రంగా.. రేషన్ బియ్యం రైళ్లో అక్రమంగా మహారాష్ట్రకు తరలుతోంది. మార్చి 29న జమ్మికుంటలో 10 క్వింటాళ్లు.. నాలుగు నెలల వ్యవధిలో 50 క్వింటాళ్ల బియ్యం మహారాష్ట్రకు తరలిస్తుండగా.. రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
దళారుల దయ..పాస్‌పోర్టు నీదయా!
బహిరంగంగా దళారుల దందా స్లాట్ల మంజూరులో కీలక పాత్ర వినియోగదారుల జేబులకు చిల్లు విశాఖపట్నం : పాస్‌పోర్టు సేవ లో దళారులు రాజ్యమేలుతున్నారు. నేరుగా జరగని పనిని దళారులు చిటికెలో చేసేసి దరఖాస్తుదారులను ఆశ్చర్యపరుస్తున్నారు. దరఖాస్తుదారుల అవసరాన్ని బట్టి దళారులు డబ్బు గుంజుతున్నారు. పాస్‌పోర్టు కోసం ప్రజలు దారుణంగా మోసపోతున్నారు. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ సామాన్యులకు అర్థం కాక దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న దళారులు చెలరేగిపోతున్నారు. వినియోగదారులను దోచుకుంటూ హవా కొనసాగిస్తున్నారు. వీరి మాయమాటలు నమ్ముతున్న ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. స్లాట్ బుకింగ్, దరఖాస్తు,నోటరీఅంటూదళారులు వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, గుర్తింపు, చిరునామాలు అప్పటికప్పుడు సృష్టించి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారు. వేగంగా పాస్‌పోర్ట్ మంజూరు కోసం అడ్డదారుల్లో ప్రయత్నించి సఫలీకృతులు కావడం గమనార్హం. దళారుల జోక్యాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రానికి అతి సమీపంలో దళారులు వ్యాపారాలు నిర్వహించినా అధికారులు చూసీ చూడనట్టు ఉండటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రానికి ఆనుకుని దళారుల కార్యాలయాలు ఉండటం సందేహాలకు తావిస్తోంది. కేంద్రానికి అతి సమీపంలో దళారుల కార్యాలయాల బోర్డులు అమర్చడంతో ప్రజలు విస్తుబోతున్నా రు. పాస్‌పోర్టు మంజూరు కోసం చట్టబద్ధమైన ఫీజులకు దళారులు మంగళం పాడేశారు. దళారుల కార్యాలయాలు బిర్లా కూడలిలో ఇష్టానుసారంగా వెలిశాయి. జిరాక్స్ కేంద్రాలుగా వెలిసి పాస్‌పోర్టు బుకింగ్‌లకు అడ్డాలుగా అవతరిస్తున్నాయి. మరికొందరు తాత్కాలిక టెంట్లు వేసి ఆకర్షిస్తున్నారు. ప్రజలు నేరుగా వెళ్తే పనులు జరగడం లేదని చెబుతున్నారు. అవసరమైన పత్రాలు తీసుకువెళితే ఇది నిజమేనా! ఒరిజినల్ తీసుకువచ్చావా! అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని అంటున్నారు. పోలీస్, నోటరీ సర్టిఫికెట్లకు వేలాది రూపాయలు ముట్టజెప్పాలని వాపోతున్నారు. ఇటీవల జరుగుతున్న మేళాలతో దళారులకు కాసుల పంట పండుతోందని కొందరంటున్నారు. మేళాలో పాస్‌పోర్ట్ స్లాట్ కోసం దళారులు ముందస్తు అడ్వాన్సులు తీసుకోవడం కొసమెరుపు.