హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ ఆదాయ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మధ్యస్థంగా ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘సామర్థ్యం పెంపు కారణంగా ఆక్యుపెన్సీ కొద్దిగా మితంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. ఒక్కో పడక ద్వారా సగటు ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కీలక శస్త్ర చికిత్సల విభాగంలో వ్యవస్థీకృత సంస్థల మార్కెట్ వాటా పుంజుకుంది.
విదేశీ రోగుల రాకతో మెట్రో నగరాల్లోని ఆసుపత్రుల్లో రద్దీ అధికం అయింది. దేశవ్యాప్తంగా పెద్ద సంస్థలు కొన్ని నూతన ఆసుపత్రుల ఏర్పాటు, మరికొన్ని ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో పడకల సామర్థ్యం పెంచనున్నట్టు ఇటీవల వెల్లడించాయి. రెండు మూడేళ్లుగా కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి బదులు ఉన్న కేంద్రాల్లో ఆదాయాల పెరుగుదలపై వైద్య పరిశ్రమ దృష్టిసారించింది.’ అని ఇక్రా వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment