Health Servicess
-
దేశంలో వైద్య ‘అవ్యవస్థ’
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 70 శాతానికి నేటికీ మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చాలా ఊళ్లలో డాక్టర్లుండరు. వాళ్లుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రముండదు. రెండూ ఉంటే సరైన సదుపాయాలుండవు. ఇదీ మన దేశంలో ఆరోగ్య సేవల పరిస్థితి!’’ అన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ‘‘వైద్య సదుపాయాలను పెంపొందించాలి. పరిశోధనలకు ఊతమివ్వాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్లను కూడా భాగస్వాములను చేయాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రామీణ ప్రాంతాల్లో అవి వైద్య సదుపాయాలు అందించేలా చూడాలి. వైద్య వ్యవస్థ మెరుగుకు ఓ రోడ్ మ్యాప్ తప్పనిసరి’’ అన్నారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతోందంటూ పలు గణాంకాలు వివరించారు. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే మహిళలు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. ‘‘భార్య విలువైనా, తల్లి విలువైనా వారు లేకుండా పోయాకే అనుభవానికి వస్తుంది. మా అమ్మ 80 ఏట కన్నుమూసింది. అయినా ఈనాటికీ అమ్మను మర్చిపోలేకపోతున్నా’’ అన్నారు. ఇల్లాలి ప్రాధాన్యతను ప్రతి కుటుంబమూ గుర్తించాలని సూచించారు. శనివారం ఇక్కడ డాక్టర్ కల్నల్ సీఎస్‌పంత్; డాక్టర్ వనితా కపూర్ రాసిన పుస్తక విడుదల కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. నిజాయితీగా కష్టపడి పని చేసే డాక్టర్లపై హింస, దాడులు పెరుగుతున్నాయన్నారు. వారిపై తప్పుడు కేసులు పెట్టే ధోరణి ప్రబలుతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. తన కూతురూ డాక్టరే కావడంతో వైద్యుల సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ‘‘రోగుల క్షేమం కోసం నిరంతరాయంగా చెమటోడ్చే వైద్యుల స్ఫూర్తిని అభినందిస్తున్నా. వైద్యులంటే మన మిత్రులు, కౌన్సెలర్లు, దిశానిర్దేశకులు. సమాజంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో వారిది చురుకైన పాత్ర కావాలి. వారు పని చేసేందుకు మరింత మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు. -
వైద్య రంగ వృద్ధి మధ్యస్థం: ఇక్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ ఆదాయ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మధ్యస్థంగా ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘సామర్థ్యం పెంపు కారణంగా ఆక్యుపెన్సీ కొద్దిగా మితంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. ఒక్కో పడక ద్వారా సగటు ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కీలక శస్త్ర చికిత్సల విభాగంలో వ్యవస్థీకృత సంస్థల మార్కెట్ వాటా పుంజుకుంది. విదేశీ రోగుల రాకతో మెట్రో నగరాల్లోని ఆసుపత్రుల్లో రద్దీ అధికం అయింది. దేశవ్యాప్తంగా పెద్ద సంస్థలు కొన్ని నూతన ఆసుపత్రుల ఏర్పాటు, మరికొన్ని ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో పడకల సామర్థ్యం పెంచనున్నట్టు ఇటీవల వెల్లడించాయి. రెండు మూడేళ్లుగా కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి బదులు ఉన్న కేంద్రాల్లో ఆదాయాల పెరుగుదలపై వైద్య పరిశ్రమ దృష్టిసారించింది.’ అని ఇక్రా వివరించింది. -
యూపీఐ తరహాలోనే యూహెచ్ఐ
Unified Health Interface Soon: యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) సర్వీసులను డిజిటల్ పేమెంట్స్ కోసం ఉపయోగిస్తున్నాం కదా! . గూగుల్ పే, ఫోన్ పే.. ఇలా మొత్తం యాభైకి పైగా థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో చెల్లింపులు చేసే విధంగా తీసుకొచ్చిన ఒకేఒక్క ప్లాట్‌ఫామ్ ఈ యూపీఐ. సరిగ్గా ఇదే తరహాలో త్వరలో యూహెచ్ఐ రాబోతోంది. మొత్తం వైద్య సేవల కోసమే రాబోతున్న ఈ సర్వీస్.. జనాభా ఆరోగ్య సమాచార సేకరణలో రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారీ హెల్త్ డేటా సేకరణకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకోసం యూపీఐ తరహాలో యూహెచ్ఐ (యునిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్) సర్వీస్ తీసుకురాబోతోంది. యూపీఐ తరహాలో ఇందులోనూ ఎన్ని హెల్త్ యాప్స్కైనా చోటు ఉండబోతుందని నేషనల్ హెల్త్ అథారిటీ అండ్ కొవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ చెప్తున్నారు. ఆన్లైన్-ఆఫ్‌లైన్ కన్సల్టేషన్, ఏయే ఆస్పత్రికి వెళ్లారు? ఎంత ఖర్చైంది? వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఏంటి?.. ఇలా పేషెంట్లకు సంబంధించిన సమాచారం మొత్తం యూహెచ్ఐ అనే ఒకే ప్లాట్ఫామ్లో డేటా మొత్తం ఉండబోతుందన్నమాట. అంతేకాదు యూహెచ్ఐ ద్వారా డాటా సేకరణతో పాటు చెల్లింపులకు సైతం వీలు కల్పించనున్నారు. చిన్న మెడికల్ షాప్ నుంచి పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి దాకా యాప్ ద్వారా యూహెచ్ఐ పరిధిలోకి వస్తాయి. కాబట్టి, నేరుగా అవి ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు వీలు ఉంటుందని శర్మ చెప్తున్నారు. National Digital Health Missionలో భాగంగా ఆరోగ్య సేవల పరిధిని విస్తృతం చేయడానికే ఈ ప్రణాళిక తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది. ఈరోజుల్లో వర్చువల్ ప్లాట్‌ఫామ్స్‌ను కమ్యూనికేషన్ పర్పస్‌లో ఎంతగా వినియోగించుకుంటున్నారో తెలిసిందే. కాబట్టే, వైద్య సేవల్లో ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అని శర్మ అభిప్రాయపడుతున్నారు. యునిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ సర్వీస్‌ను ఇప్పటికే ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించి చూశారు. త్వరలోనే ఈ సర్వీసును అన్ని స్టేట్స్లో అమలులోకి తీసుకురాబోతున్నారు. అదే జరిగితే వైద్య సేవలకు సంబంధించిన ప్రతీది ఒకే ప్లాట్‌ఫామ్ కిందకు వస్తుంది. ఇందుకోసం హెల్త్ స్టార్టప్స్.. యూహెచ్ఐలోకి ఫ్లగ్ ఇన్ అయితే చాలు. చదవండి: అరచేతిలో... ఆరోగ్యం?! -
తెలంగాణ సర్కార్‌కి జూడాల షాక్
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌కి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు తేల్చి చెప్పారు. డిమాండ్లు జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. జూడాలకు బీమా సౌకర్యంతోపాటు, తమ కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో కరోనా వైద్యం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైరస్ తగ్గుతున్న వేళ తెలంగాణలో కరోనా తగ్గుమఖం పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే 28 వరకు కొవిడ్ సేవలు కొనసాగిస్తామని జూడాలు హామీ ఇచ్చారు. అంతకు ముందే ఈ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపే అవకాశం ఉంది. -
డాక్టర్ల కోసం యూకే ప్రత్యేక వీసా
లండన్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హులైన వైద్యులు, నర్సుల కోసం ప్రత్యేకంగా ఒక వీసాను ప్రారంభించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిధులతో నిర్వహించే నేషనల్ హెల్త్ సర్వీసెస్(ఎన్హెచ్ఎస్)లో నిపుణుల కొరతతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ‘ఎన్హెచ్ఎస్ వీసా’ హామీని ఇటీవలి ప్రధాని జాన్సన్ తెరపైకి తెచ్చారు. అర్హులైన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య నిపుణులు త్వరితగతిన బ్రిటన్‌కు వచ్చేందుకు ఈ వీసా దోహదపడుతుందని భావిస్తున్నారు. -
‘సఖీ’తో సమస్యల పరిష్కారం
కాజీపేట అర్బన్ : బాధిత మహిళల సంరక్షణ, వసతి, పోలీస్, న్యాయ సేవలందించేందుకు మేమున్నామంటూ భరోసా ఇస్తోంది సఖీ/వన్‌స్టాప్ సెంటర్. సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు తదితర సమస్యలను ఒకే చోట పరిష్కారం అందించేందుకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఇది తోడ్పడుతోంది. 24 గంటలు అందుబాటులో సేవలందిస్తూ నేడు మహిళలకు, బాలికల సంరక్షణకు ఆత్మీయ నేస్తంగా సఖీ సెంటర్ మారింది. 2017 డిసెంబర్లో ప్రారంభం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించేందుకు షీటీమ్స్, 181 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, డీవీ సెల్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 186 వన్‌స్టాప్ సెంటర్లను ప్రారంభించేందుక శ్రీకారం చుట్టగా రాష్ట్రంలోని పది జిల్లాలను ఎంపిక చేసింది. వీటిల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేవలందించేందుక ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా నగరంలో 2017 డిసెంబర్లో సర్వోదయ యూత్ ఆరనైజేషన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా హన్మకొండ ఎక్సైజ్‌కాలనీలో సఖి/వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి లాంచనంగా ప్రారంభించారు. సఖీ సెంటర్ కార్యాలయం అందుబాటులో సేవలు.. బాధిత మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు 24 గంటలపాటు సఖి/వన్‌స్టాప్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. మహిళలకు, బాలికలకు కౌన్సెలింగ్, వైద్య, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి, పోలీస్ సహాయం, కోర్టుకు రాలేని బాధిత మహిళలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ సహాయం అందిస్తారు. వన్‌స్టాప్ సెంటర్ వీరికే.. బాధిత మహిళలు, బాలికలకు సేవలందించే లక్ష్యంతో సఖీ/వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గృహహింస, వరకట్న, లైంగిక వేదింపులు, మహిళలు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, పనిచేసే చోట లైం గిక వేదింపులకు గురి చేసే చోట అన్ని శాఖ సమన్వయంతో పరిష్కార మార్గాలను చూపుతుంది. వన్‌స్టాప్ అంబులెన్స్ 260 సమస్యల పరిష్కారం.. మహిళలకు, బాలికలకు తక్షణ రక్షణ, తాత్కాలికంగా ఐదు రోజుల వసతిని అందిస్తూ బాధితులకు మేమున్నామనే భరోసానందిస్తుంది సఖీ సెంటర్. గత పదిహేను నెలల్లో సుమారు 260 బాధిత మహిళల సమస్యలను పరిష్కరించారు. జిల్లాలోని 58 డివిజన్ల్లో సఖీ సెంటర్ సేవలపై విస్త్రత ప్రచారం అందిస్తూ బాధితులకు చేరువవుతున్నారు. నిరంతర సేవలందిస్తున్నాం.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సౌజన్యంతో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాధిత మహిళలకు నిరంతరం సేవలందించడం ఆనందంగా ఉంది. హింసా రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. న్యాయ, పోలీసు, వైద్య సేవలతో పాటు తాత్కాలిక వసతి అందించి కౌన్సిలింగ్ ద్వారా మార్పునకు నాంది పలుకుతున్నాం. – పల్లెపాటు దామోదర్, సఖీ సెంటర్ నిర్వాహకుడు -
హెల్త్‌ప్రో వేదికపై అన్ని ఆరోగ్య సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ టెక్నాలజీ కంపెనీ కేర్4యు తాజాగా ‘హెల్త్‌ప్రో’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆసియాలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన తొలి యాప్ ఇదే. ఆసుపత్రులు, వైద్యులు, రోగ పరీక్ష కేంద్రాలు, మందుల షాపులు, బీమా కంపెనీలను రియల్ టైంలో ఒకతాటిపైకి తీసుకొస్తుంది. సమాచారం క్షణాల్లో చేరుతుంది. భారత్‌లో ఎస్తోనియా రాయబారి రిహో క్రూవ్ చేతుల మీదుగా హెల్త్‌ప్రో యాప్‌ను ఆవిష్కరించారు. కేర్4యు హెల్త్‌కేర్ సొల్యూషన్స్ కంపెనీని మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకులైన డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి స్థాపించారు. యాప్ ద్వారా బీమా కంపెనీ నుంచి 30 సెకన్లలో ప్రీ–అప్రూవల్ వస్తుందని కేర్4యు డైరెక్టర్ ప్రబిన్ బర్దన్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. సమయం ఆదా అవడమేగాక పారదర్శకత, సమాచార గోప్యత ఉంటుందని చెప్పారు. కేంద్రీకృత వ్యవస్థ మొత్తం లావాదేవీలను పరిశీలిస్తుందని, సమాచారం అంతా యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదవుతుందని గుర్తుచేశారు. 350 ఆసుపత్రులు, క్లినిక్స్‌తో కంపెనీ చేతులు కలిపింది. బిజినెస్ పార్టనర్‌గా బీమా సంస్థ ఫ్యూచర్ జనరాలీ వ్యవహరిస్తోంది. మరో 8 బీమా కంపెనీలతో కేర్4యు చర్చిస్తోంది. యాప్ సహకారంతో క్లెయిమ్ ప్రాసెస్ త్వరతగతిన పూర్తి అవుతుందని ఫ్యూచర్ జెనరాలీ ఎండీ కె.జి.కృష్ణమూర్తి రావు చెప్పారు. -
పేదవాడికి మైరుగైన వైద్యం: రాజయ్య
బీబీనగర్: ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖామంత్రి టి.రాజయ్య అన్నారు. పేదవారికి అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష జరుపుతామని ఓ ప్రశ్నకు డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. బీబీనగర్ నిమ్స్ ప్రారంభం కోసం అధికారులతో ఈ నెల 17న సమీక్ష నిర్వహిస్తామని ఆయన అన్నారు. బీబీనగర్ లో నిర్మించిన నిమ్స్ ఆస్పత్రి భవనాన్ని రాజయ్య సందర్శించారు. బీబీనగర్ లో నిర్మించిన నిమ్స్ ఆస్పత్రిని తెలంగాణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్య తీసుకుంటామని ఆయన అన్నారు.