Unified Health Interface Soon: యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) సర్వీసులను డిజిటల్ పేమెంట్స్ కోసం ఉపయోగిస్తున్నాం కదా! . గూగుల్ పే, ఫోన్ పే.. ఇలా మొత్తం యాభైకి పైగా థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో చెల్లింపులు చేసే విధంగా తీసుకొచ్చిన ఒకేఒక్క ప్లాట్‌ఫామ్ ఈ యూపీఐ. సరిగ్గా ఇదే తరహాలో త్వరలో యూహెచ్‌ఐ రాబోతోంది. మొత్తం వైద్య సేవల కోసమే రాబోతున్న ఈ సర్వీస్.. జనాభా ఆరోగ్య సమాచార సేకరణలో రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారీ హెల్త్ డేటా సేకరణకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకోసం యూపీఐ తరహాలో యూహెచ్‌ఐ (యునిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్) సర్వీస్ తీసుకురాబోతోంది. యూపీఐ తరహాలో ఇందులోనూ ఎన్ని హెల్త్ యాప్స్‌కైనా చోటు ఉండబోతుందని నేషనల్ హెల్త్ అథారిటీ అండ్ కొవిన్ చీఫ్ ఆర్‌ఎస్ శర్మ చెప్తున్నారు. ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ కన్సల్టేషన్, ఏయే ఆస్పత్రికి వెళ్లారు? ఎంత ఖర్చైంది? వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఏంటి?.. ఇలా పేషెంట్లకు సంబంధించిన సమాచారం మొత్తం యూహెచ్‌ఐ అనే ఒకే ప్లాట్‌ఫామ్‌లో డేటా మొత్తం ఉండబోతుందన్నమాట. అంతేకాదు యూహెచ్‌ఐ ద్వారా డాటా సేకరణతో పాటు చెల్లింపులకు సైతం వీలు కల్పించనున్నారు. చిన్న మెడికల్ షాప్ నుంచి పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి దాకా యాప్ ద్వారా యూహెచ్‌ఐ పరిధిలోకి వస్తాయి. కాబట్టి, నేరుగా అవి ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు వీలు ఉంటుందని శర్మ చెప్తున్నారు.
National Digital Health Missionలో భాగంగా ఆరోగ్య సేవల పరిధిని విస్తృతం చేయడానికే ఈ ప్రణాళిక తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది. ఈరోజుల్లో వర్చువల్ ప్లాట్‌ఫామ్స్‌ను కమ్యూనికేషన్ పర్పస్‌లో ఎంతగా వినియోగించుకుంటున్నారో తెలిసిందే. కాబట్టే, వైద్య సేవల్లో ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అని శర్మ అభిప్రాయపడుతున్నారు. యునిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్ సర్వీస్‌ను ఇప్పటికే ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించి చూశారు. త్వరలోనే ఈ సర్వీసును అన్ని స్టేట్స్‌లో అమలులోకి తీసుకురాబోతున్నారు. అదే జరిగితే వైద్య సేవలకు సంబంధించిన ప్రతీది ఒకే ప్లాట్‌ఫామ్ కిందకు వస్తుంది. ఇందుకోసం హెల్త్ స్టార్టప్స్.. యూహెచ్‌ఐలోకి ఫ్లగ్ ఇన్ అయితే చాలు.
చదవండి: అరచేతిలో... ఆరోగ్యం?!
Comments
Please login to add a commentAdd a comment