Digital Mission Mode Project
-
వైద్యం.. మరింత సులభతరం
రోగి వైద్యుని వద్దకు వెళ్లినప్పుడు ఇదివరకు తీసుకున్న చికిత్స.. వైద్య పరీక్షల నివేదికలు తప్పనిసరి. దీని ఆధారంగా చికిత్స ఏది అవసరమో అది కొనసాగించవచ్చు. ఇలాంటివి రోగి మరచిపోయినప్పుడు వైద్యులు మొదటి నుంచి పరీక్షలు, స్కానింగ్ చేయించి వివరాలు తెలుసుకుని తర్వాత చికిత్స ప్రారంభించేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో భాగంగా అలాంటి కాగితాలు ఏవీ లేకుండానే ‘రోగి చరిత్ర’ మొత్తం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ (ఈ–హెల్త్ రికార్డ్)లో నిక్షిప్తం చేసే విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రోగులు రాష్ట్రంలో ఎక్కడ వైద్యానికి వెళ్లినా తమ పూర్వపు ఆరోగ్య స్థితులను ఇట్టే తెలియజెప్పే ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల (ఈ–హెచ్ఆర్) రిజిస్ట్రేషన్ ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. రోగులు పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చినప్పుడు వారికి వైద్యపరీక్షలు నిర్వహించడం, దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి జబ్బులు ఇలాంటివేవైనా ఉంటే పూర్తిస్థాయిలో వివరాలన్నీ ఎల్రక్టానిక్ రికార్డుల్లోకి ఎక్కిస్తారు. రోగి ఆధార్, మొబైల్ నంబర్లను క్రోడీకరించి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. ఈ నంబర్ ఆధారంగా పూర్వపు ఆరోగ్య వివరాలన్నీ ఏ డాక్టరు వద్దకు వెళ్లినా తెలుసుకోవచ్చు. అనంతలో 43 వేలు, శ్రీసత్యసాయిలో 35 వేలు.. రాష్ట్రంలో 542 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. అందులో శ్రీసత్యసాయి జిల్లాలో 18, అనంతపురం జిల్లాలో 26 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల వాసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తుండగా, పట్టణ పేదలు అర్బన్ హెల్త్ కేంద్రాలకు వస్తున్నారు. ఇలా వస్తున్న వారిలో శ్రీసత్యసాయి జిల్లాలో 35,052 మందికి, అనంతపురం జిల్లాలో 43,578 మందికి ఈహెచ్‌ఆర్ నమోదు పూర్తి చేశారు. ఇప్పటికీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఎలక్ట్రానిక్ హెల్త్‌రికార్డులతో.. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల వల్ల వైద్యం మరింత సులభమవుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన డేటా మొత్తం ఇందులో ఉండటంతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ ఆస్పత్రికెళ్లినా పూర్తి వివరాలు ఉంటాయి. కొత్తగా ఎప్పుడు వైద్యం చేయించుకున్నా అదనపు వివరాలు నమోదు చేస్తారు. దీనివల్ల జీవనశైలి జబ్బులు ఎంతమందికి ఉన్నాయి, దీర్ఘకాలిక జబ్బులు ఎంతమందికి ఉన్నాయి ఇలా జిల్లాలో ఉన్న మొత్తం వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీన్నిబట్టి జబ్బుల శైలిని కూడా అంచనా వేయొచ్చు. ఈహెచ్‌ఆర్‌లో ఆరోగ్యశ్రీ నెంబర్ కూడా నమోదు చేయడం వల్ల ఎక్కడికెళ్లినా ఉచితంగానే వైద్యం పొందే అవకాశం ఉంటుంది. రోగులతో పాటు వైద్యుల వివరాలు ఏబీడీఎంలో నమోదు చేస్తారు. ఏ డాక్టరు ఏ వైద్యం చేశారన్నది కూడా ఇకపై హెల్త్ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇదీ చదవండి: సర్కారీ వైద్యం సూపర్ -
యూపీఐ తరహాలోనే యూహెచ్ఐ
Unified Health Interface Soon: యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) సర్వీసులను డిజిటల్ పేమెంట్స్ కోసం ఉపయోగిస్తున్నాం కదా! . గూగుల్ పే, ఫోన్ పే.. ఇలా మొత్తం యాభైకి పైగా థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో చెల్లింపులు చేసే విధంగా తీసుకొచ్చిన ఒకేఒక్క ప్లాట్‌ఫామ్ ఈ యూపీఐ. సరిగ్గా ఇదే తరహాలో త్వరలో యూహెచ్ఐ రాబోతోంది. మొత్తం వైద్య సేవల కోసమే రాబోతున్న ఈ సర్వీస్.. జనాభా ఆరోగ్య సమాచార సేకరణలో రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారీ హెల్త్ డేటా సేకరణకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకోసం యూపీఐ తరహాలో యూహెచ్ఐ (యునిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్) సర్వీస్ తీసుకురాబోతోంది. యూపీఐ తరహాలో ఇందులోనూ ఎన్ని హెల్త్ యాప్స్కైనా చోటు ఉండబోతుందని నేషనల్ హెల్త్ అథారిటీ అండ్ కొవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ చెప్తున్నారు. ఆన్లైన్-ఆఫ్‌లైన్ కన్సల్టేషన్, ఏయే ఆస్పత్రికి వెళ్లారు? ఎంత ఖర్చైంది? వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఏంటి?.. ఇలా పేషెంట్లకు సంబంధించిన సమాచారం మొత్తం యూహెచ్ఐ అనే ఒకే ప్లాట్ఫామ్లో డేటా మొత్తం ఉండబోతుందన్నమాట. అంతేకాదు యూహెచ్ఐ ద్వారా డాటా సేకరణతో పాటు చెల్లింపులకు సైతం వీలు కల్పించనున్నారు. చిన్న మెడికల్ షాప్ నుంచి పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి దాకా యాప్ ద్వారా యూహెచ్ఐ పరిధిలోకి వస్తాయి. కాబట్టి, నేరుగా అవి ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు వీలు ఉంటుందని శర్మ చెప్తున్నారు. National Digital Health Missionలో భాగంగా ఆరోగ్య సేవల పరిధిని విస్తృతం చేయడానికే ఈ ప్రణాళిక తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది. ఈరోజుల్లో వర్చువల్ ప్లాట్‌ఫామ్స్‌ను కమ్యూనికేషన్ పర్పస్‌లో ఎంతగా వినియోగించుకుంటున్నారో తెలిసిందే. కాబట్టే, వైద్య సేవల్లో ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అని శర్మ అభిప్రాయపడుతున్నారు. యునిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ సర్వీస్‌ను ఇప్పటికే ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించి చూశారు. త్వరలోనే ఈ సర్వీసును అన్ని స్టేట్స్లో అమలులోకి తీసుకురాబోతున్నారు. అదే జరిగితే వైద్య సేవలకు సంబంధించిన ప్రతీది ఒకే ప్లాట్‌ఫామ్ కిందకు వస్తుంది. ఇందుకోసం హెల్త్ స్టార్టప్స్.. యూహెచ్ఐలోకి ఫ్లగ్ ఇన్ అయితే చాలు. చదవండి: అరచేతిలో... ఆరోగ్యం?! -
వైద్యకళాశాలల అధ్యాపకుల హాజరుపై నిఘా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది హాజరును ప్రతీ రోజు ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా డిజిటైషన్ ప్రక్రియను ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. బోధనా సిబ్బంది విషయంలో కళాశాలల మోసాన్ని బయటపెట్టడం, పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. డిజిటల్ మిషన్ మోడ్ ప్రాజెక్టు(డీఎంఎంపీ)లో భాగంగా మొత్తం 439 వైద్య కళాశాలల్లో హాజరును బయోమెట్రిక్ వ్యవస్థతో ఎంసీఐ పర్యక్షిస్తుంది. ‘ఒక దేశం ఒక రిజిస్ట్రేషన్’ కింద డాక్టర్లకు ఎలక్ట్రానిక్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐటెంటిఫికేషన్(ఆర్ ఎఫ్ఐడీ) రిజిస్ట్రేషన్ కార్డులు ఐఎంసీఐ ఇవ్వనుంది. వీటి ద్వారా డాక్టర్ల కార్యకలాపాలను పర్యవేక్షించనుంది.