పేదవాడికి మైరుగైన వైద్యం: రాజయ్య
పేదవాడికి మైరుగైన వైద్యం: రాజయ్య
Published Sun, Jun 15 2014 12:44 PM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM
బీబీనగర్: ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖామంత్రి టి.రాజయ్య అన్నారు. పేదవారికి అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష జరుపుతామని ఓ ప్రశ్నకు డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు.
బీబీనగర్ నిమ్స్ ప్రారంభం కోసం అధికారులతో ఈ నెల 17న సమీక్ష నిర్వహిస్తామని ఆయన అన్నారు. బీబీనగర్ లో నిర్మించిన నిమ్స్ ఆస్పత్రి భవనాన్ని రాజయ్య సందర్శించారు. బీబీనగర్ లో నిర్మించిన నిమ్స్ ఆస్పత్రిని తెలంగాణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్య తీసుకుంటామని ఆయన అన్నారు.
Advertisement
Advertisement