NIIMS
-
నీటి మడుగులో కాచుకున్న మొసలి.. రిస్కు చేసి గొర్రెను కాపాడి!
వనపర్తి: గొర్రెను నోట కరుచుకుని నీటిలోకి జారుకుంటున్న మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డాడొక కాపరి. మొసలి దాడి చేసిన గొర్రె చిన్న గాయంతో ప్రాణాలు దక్కించుకోగా.. దాన్ని కాపాడిన కాపరి ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాంపురం శివారు ప్రాంతంలోని కృష్ణా నదిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. పెబ్బేరు మండలం రాంపురం గ్రామానికి చెందిన కొరి రాములు, బీసన్నలకు చెందిన 300 గొర్రెలను మేత కోసం నెల రోజుల క్రితం కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పొలాల్లో గొర్రెలను మేపుకొని కృష్ణా నదిలోని గుంతల్లో నిల్వ ఉన్న నీటిని తాగిస్తుండేవారు. ఎప్పట్లాగే శుక్రవారం సాయంత్రం వేళ గొర్రెలను నదిలో నీరున్న గుంతల వద్దకు తీసుకెళ్లారు. గుంపులోని ఒక గొర్రె నీటిని తాగేందుకు వెళ్లగా.. మడుగులోని మొసలి దానిపై దాడి చేసింది. గొర్రె అరుపులు విన్న కాపరి కొరి రాములు చేతిలోని కర్రతో మొసలిపై దాడి చేశాడు. దీంతో మొసలి గొర్రెను వదిలేసి కాపరిపై దాడి చేసి.. అతని రెండు చేతులు, కడుపు భాగంలో గాయపరిచింది. కాపరి చేతుల్ని నోట కరుచుకొని నీటిలోకి మొసలి లాక్కెళ్తుండగా.. రాములు అరుపులు విన్న సహచర కాపరి బీసన్న రాళ్లతో దానిపై దాడి చేశారు. దీంతో మొసలి రాములును వదిలి నీటిలోకి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రాములును 108 అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యానికి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం తన తండ్రి పరిస్థితి నిలకడగానే ఉందని రాములు కుమారుడు మల్లేశ్ తెలిపాడు. రాములు అధైర్యపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సహచర కాపరి బీసన్న తెలిపాడు. -
ఎయిమ్స్ రాకతో నెలకొన్న ఉత్కంఠ
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని బీబీనగర్ మండలం రంగాపురం వద్ద ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌లో వైద్యవిద్యా తరగతులు ప్రారంభం కావడంతో నిమ్స్ (నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సేవలపై సందిగ్ధం నెలకొంది. నిమ్స్‌లో ఇప్పటివరకు అందుతూ వచ్చిన ఓపీ సేవలు ఇకముందు కొనసాగుతాయా లేదా అని జిల్లా ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో బీబీనగర్ మండలం రంగాపూర్ వద్ద నిమ్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ ప్రాంగణంలోనే ఎయిమ్స్ ఏర్పాటుకు అంగీకరించారు. ఎయిమ్స్ వంటి జాతీయ స్థాయి ఆరోగ్య కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ రోగులకు సేవలందిస్తున్న నిమ్స్ ను ఎక్కడికి తరలిస్తారన్న సందిగ్ధం ఏర్పడింది. 2016లో ఓపీ సేవలు ప్రారంభం.. హైదరాబాద్‌లో గల నిమ్స్‌కు అనుబంధంగా బీబీనగర్‌లో నిమ్స్ ఓపీ సేవలను 2016 మార్చిలో ప్రారంభించారు. మూడేళ్లుగా నిమ్స్ ప్రాంగణంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో రోగులకు ఓపీసేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష మంది రోగుల వరకు ఇక్కడ వైద్య పరీక్షలు, సేవలను పొందారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, కార్డియాలజీ, అల్ట్రాసౌండ్, ఈసీజీ, ఫిజియోథెరపీ సేవలను అందుస్తున్నారు. నామమాత్రపు రుసుముతో అందుతున్న సేవలు రోగులకు ఎంతో ఉపయోగ కరంగా ఉన్నాయి. నిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైన త రుణంలో ఎయిమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం మం జూరు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పనుల ను వెంటనే విరమించుకుంది. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేసి ఆ తర్వాత వాటిని పక్కన పెట్టింది. అయితే ఇక్కడ ఓపీ సేవలు అందుతున్న క్రమంలోనే పూర్తిసా ్థయి వైద్యం అందించడానికి వసతుల కోసం రూ.10కోట్ల వరకు మంజూరు చేసి ఖర్చు చేశారు. ఈ క్రమంలోనే ఎయిమ్స్ మంజూరు కావడంతో ఇక ఇక్కడ నిమ్స్ సేవలు అందవేమోనన్న ఆందోళనలో రోగులు ఉన్నారు. అయి తే ఎయిమ్స్ వైద్యసేవలు అందించడానికి మరో ఏడాదికి పైగానే సమయం పట్టే అవకాశం ఉందని ఎయిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 50మంది విద్యార్థులతోనే మెడికల్ కళాశాలను ప్రారంభించారు. ఎయిమ్స్ వైద్యం ప్రారంభమయ్యే వరకు నిమ్స్ వైద్యసేవలు కొనసాగించాలని వివిధ రాజకీ య పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిమ్స్ సేవలు కొనసాగుతాయి ఎయిమ్స్ వైద్యకళాశాల ప్రారంభమైనప్పటికీ నిమ్స్‌లో ఓపీసేవలు కొనసాగుతాయి. ఈ మేరకు ఎయిమ్స్ అధికారులు, నిమ్స్ అధికారులతో చర్చించాను. ప్రస్తుతం నిమ్స్‌లో అందుతున్న ఓపీ సేవలు జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇకముందు కూడా అవి అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం. – అనితారామచంద్రన్, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా -
నిమ్స్ ఆస్పత్రిలో ఫైర్ అవగాహన కార్యక్రమం
-
పేదవాడికి మైరుగైన వైద్యం: రాజయ్య
బీబీనగర్: ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖామంత్రి టి.రాజయ్య అన్నారు. పేదవారికి అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష జరుపుతామని ఓ ప్రశ్నకు డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. బీబీనగర్ నిమ్స్ ప్రారంభం కోసం అధికారులతో ఈ నెల 17న సమీక్ష నిర్వహిస్తామని ఆయన అన్నారు. బీబీనగర్ లో నిర్మించిన నిమ్స్ ఆస్పత్రి భవనాన్ని రాజయ్య సందర్శించారు. బీబీనగర్ లో నిర్మించిన నిమ్స్ ఆస్పత్రిని తెలంగాణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్య తీసుకుంటామని ఆయన అన్నారు. -
వైఎస్ జగన్ చంచల్ గూడ తరలింపు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాటకీయ ఫక్కీలో నిమ్స్ నుంచి డిశార్జి చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మెరుగైందని జైలు అధికారులకు బుధవారం సాయంత్రం నిమ్స్ వైద్యులు సమాచారం అందించారు. దాంతో వైఎస్ జగన్ ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో చంచల్ గూడ జైలుకు తరలించారు. -
వైఎస్ జగన్ డిశ్చార్జి,

'కీటోన్స్ సాధారణ స్థాయికి రావాలి'
-
కీటోన్స్ సాధారణ స్థాయికి రావాలి- జగన్ ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు
‘శరీరంలోని గ్లూకోజ్ నిల్వలు పూర్తిగా వినియోగమైన తర్వాత కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. ఈ కొవ్వు కరుగుతున్న క్రమంలోనే కీటోన్స్ అనే చెడు పదార్థాలు విడుదలవుతాయి. ఇవి శరీరంలో అసలు ఉండకూడదు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి శరీరంలో అవింకా 1.9 మోతాదులో ఉన్నాయి. ఆయన నిమ్స్‌లో చేరిన రోజు ఇవి 4కు మించి ఉన్నాయి. ఈ కీటోన్స్ పూర్తిగా తగ్గిన తర్వాతే ఆయన డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటాం..’ అని నిమ్స్ వైద్య బృందం తెలిపింది. ఆమరణ నిరాహార దీక్ష భగ్నం తర్వాత నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జగన్‌కు సోమవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, చక్కెర నిల్వలు, పల్స్‌రేటు సాధారణ స్థాయికి చేరుకున్నా, సోడియం నిల్వలు, కీటోన్స్ ఇంకా నియంత్రణలోకి రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు. కీటోన్స్ మీద అశ్రద్ధ చేస్తే కిడ్నీకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, అందువల్ల అవి సాధారణ స్థాయికి వచ్చిన తర్వాతే జగన్మోహన్రెడ్డిని డిశ్చార్జి చేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ముగ్గురు వైద్యుల బృందం వివరించింది. మొత్తంమీద ఆయన కొంత తేరుకున్నట్టు కన్పించిందని వైద్యులు చెప్పారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికలతో పాటు కొన్ని ఆంగ్ల వార పత్రికలూ చదివారని వెల్లడించారు. తన వైద్య పరీక్షల నివేదికనూ చూసిన జగన్ అందులోని వివరాలను తమను అడిగి తెలుసుకున్నారని ఓ వైద్యుడు సాక్షికి తెలిపారు. ఇలావుండగా సోమవారం కూడా జగన్ సతీమణి వైఎస్ భారతి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిమ్స్‌లో ఆయన వద్ద ఉన్నారు. ఆమె నిమ్స్‌నుంచి వెళ్లేముందు జగన్ అభిమానులు కొందరు ఆయన ఆరోగ్యంపై ఆరాతీయగా.. కోలుకుంటున్నారని చె ప్పారు. సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కావడంతో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు నిమ్స్‌కు తరలి వచ్చారు. -

రోగుల సంరక్షణే ధ్యేయం
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగులను, సీనియర్ వైద్యులను అందరినీ కలుపుకుపోయి నిమ్స్ అభివృద్ధికి పాటుపడతానని నూతనంగా నిమ్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మశ్రీ డాక్టర్ లావు నరేంద్రనాథ్ తెలిపారు. అతి క్లిష్టమైన సర్జరీలు, క్లిష్టమైన వైద్య చికిత్సలు అందించడంలో నిమ్స్ ముందుండేలా చూస్తామని చెప్పారు. బెడ్ దొరకలేదంటూ ఏ ఒక్క రోగి నిమ్స్ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిమ్స్ డెరైక్టర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన నరేంద్రనాథ్ ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. అన్ని డిపార్ట్మెంట్లవారితో సంప్రదించి ఇతర దేశాల్లో మాదిరిగా పేషెంట్ మేనేజ్మెంట్, బెడ్ మేనేజ్మెంట్ను ఏర్పాటుచేసి రోగులకు మరిన్ని సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. నిమ్స్ ఆసుపత్రిలోని కాంట్రాక్టర్లు ఎవరైనా తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యుడికి కులమతప్రాంతీయ భేదాలు ఉండవని స్పష్టంచేశారు. తన 30 సంవత్సరాల వైద్యవృత్తిలో నల్గొండ, నిజామాబాద్‌లో పోలియోతో బాధపడుతున్న రోగులకే ఎక్కువ సేవలు చేశానని తెలిపారు. ఆసుపత్రిలో కూడా తెలంగాణ ఉద్యోగుల పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలోనికి రాని రోగాలను కూడా పేద రోగులకు ఏ విధంగా అందించాలి అనే విషయంపై దృష్టిపెడతామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. వైద్య బృందంతో కలిసి సుమారు పది నిమిషాలపాటు జగన్‌తో మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా తాను వైద్యం అందించానని నరేంద్రనాథ్ గుర్తుచేశారు. బలమైన ఆహారం తీసుకోవాలని జగన్‌కు సూచించారు. మంత్రి దానం నాగేందర్‌తో కలిసి క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసి తనను నిమ్స్ డెరైక్టర్‌గా నియమించడంపై కృతజ్ఞతలు తెలిపారు.