వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాటకీయ ఫక్కీలో నిమ్స్ నుంచి డిశార్జి చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మెరుగైందని జైలు అధికారులకు బుధవారం సాయంత్రం నిమ్స్ వైద్యులు సమాచారం అందించారు. దాంతో వైఎస్ జగన్ ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో చంచల్ గూడ జైలుకు తరలించారు.