t.rajaiah
-
రాజయ్యా.. కనవయ్యా..
‘ఇక్కడ ప్రతిదానికీ పైసలు అడుగుతుండ్రు. మత్తు సూది డాక్టర్‌కు రూ.1500, పుట్టిన బిడ్డను కడిగినందుకు రూ.800, బిడ్డను చూపించాలంటే రూ.200. డాక్టర్లు, ఇతర పనోళ్లు పీడిస్తుండ్రు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా నరకం చూపిస్తుండ్రు. బాత్రూములు కంపుకొడ్తున్నయ్. లైట్లు ఎల్గుతలేవ్. మంచినీటికీ గోసవెడుతుండ్రు...’ గోదావరిఖని ప్రభుత్వాసుత్రిలో రోగుల గోడు ఇది. ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య ఆస్పత్రిని తనిఖీ చేయడానికి ఆదివారం ఉదయం రానున్నారు. రాత్రికి ఆస్పత్రిలోనే బస చేయనున్నారు. ఈ సమస్యలన్నీ మంత్రికి కనిపించకుండా ఉండేందుకు రెండు రోజులుగా అధికారులు కష్టపడుతున్నారు. ఆస్పత్రి రూపురేఖలు మార్చేశారు. అయినా సమస్యలు వేలెత్తి చూపిస్తున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్లు, వారి బంధువులు ఆస్పత్రి లీలలను మంత్రికి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. వైద్యుల కొరతతో ఇబ్బందులు ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో నెలకు 200 నుంచి 250 వరకు రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి. అందుకు తగినవిధంగా వైద్య సిబ్బంది లేరు. 2002లో ఆస్పత్రి ప్రారంభమైనప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన మూడు సివిల్ సర్జన్ పోస్టులు ఇప్పటి వరకు భర్తీ కాలేదు. వీటిలో జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎనిమిది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్, ఈఎన్టీ, కంటి వైద్య నిపుణులు, అనస్తీషియా, పాతాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణులు తదితర డాక్టర్లు సేవలందించాల్సి ఉండగా, వీరిలో ప్రస్తుతం గైనకాలజిస్ట్, అనస్తీషియా మాత్రమే సేవలందిస్తున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ వినయ్‌కుమార్ నెల రోజులుగా ఆస్పత్రికి రావడం లేదు. లాంగ్‌లీవ్‌లో ఉండడంతో ప్రజలకు సేవలు అందడం లేదు. ఐదుగురు ఎంబీబీఎస్ డాక్టర్లతో కాంట్రాక్టు పద్ధతిన సేవలందిస్తున్నారు. ఎనిమిది నెలలుగా ఆస్పత్రికి డైట్ బిల్లులు సుమారు రూ.8 లక్షల వరకు రాలేదు. విద్యుత్ బకాయిలు రూ.7 లక్షలకుపైగా ఉన్నాయి. గత డిసెంబర్ నుంచి ఆస్పత్రి అంబులెన్స్ సేవలు నిలిచిపోయాయి. ఆస్పత్రిలో స్పెషలిస్టు డాక్టర్లను నియమిస్తే ఆస్పత్రిని నమ్మి వస్తున్న నిరుపేద ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు నీరుగారిపోతున్నాయి. పదేళ్లుగా ఆస్పత్రిని నమ్ముకుని సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇప్పించాలని కోరుతున్నారు. సమస్యలతో తల్లడిల్లుతున్న ధర్మాస్పత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎలాంటి చికిత్స అందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులతో ప్రయోగాలు ఆస్పత్రిలో అనస్తీషియాగా పనిచేస్తున్న డాక్టర్ మోహన్‌రావు కొంతకాలంగా ఓ ప్రైవేట్ మహిళను డాక్టర్‌గా పరిచయం చేస్తూ... ఆస్పత్రిలోని థియేటర్లో ప్రయోగాలు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అధికారుల అనుమతి లేకుండా సదరు మహిళతో చికిత్స చేయించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై డీసీహెచ్ఎస్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీరావుకు, డాక్టర్ మోహన్‌రావుకు మధ్య వివాదం చోటు చేసుకుంది. మోహన్‌రావు థియేటర్లోకి వస్తే, తాను వైద్య సేవలు అందించనంటూ గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్న సూర్యశ్రీరావు తేల్చిచెప్పారు. దీంతో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఈ గొడవ ఆస్పత్రిలో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల మహదేవాపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన నగునూరి శారద అనే నిరుపేద బాలింతకు డాక్టర్లు అందుబాటులో ఉండి కూడా ప్రసవం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో గత్యంతరం లేక ఆస్పత్రి సిబ్బంది కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.20 వేలు అప్పు చేసి శారదకు కుటుంబసభ్యులకు పురుడు పోయించారు. లంచాల కోసం డిమాండ్ ప్రసవం కోసం ఆస్పత్రికి వస్తే కొందరు వైద్యులు, సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. మత్తు సూదికి, పుట్టిన బిడ్డను శుభ్రం చేయడానికి, బిడ్డను చూపించడానికి, బాత్రూమ్లు శుభ్రం చేయడానికి ఇలా.. వివిధ సేవల పేరుతో కాసులు దండుకుంటున్నారని రోగులు, వారి బంధువులు పేర్కొంటున్నారు. వివిధ సమస్యలతో వస్తున్న పేషెంట్లకు, స్థానికంగానే ఉచితంగా చికిత్స చేయాలి. కొందరు డాక్టర్లు, వాళ్లు పని చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి డబ్బులు దండుకుంటున్నారు. సిబ్బందికి కూడా ఇందులో వాటా ఇస్తున్నారు. -
క్రిస్మస్ జోష్
-
గర్భశోకం..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : విష జ్వరాలు.. ఆయా కారణాలతో చిన్నారులు పిట్టల్లా రాలుతున్నారు. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన వారు డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో బాల్యంలోనే తనువు చాలి స్తున్నారు. దీనికితోడు నీటి బకెట్లో పడి చనిపోవడం.. ఏదో ఓ వస్తువు మింగి తనువు చాలించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. దీంతో కన్నవారికి కడుపుకోత మిగులుతోంది. వీటిలో జ్వరాలతో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. జ్వర మరణాలు రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళనకు గురిచేసే అంశం. ముఖ్యంగా మారుమూల గిరిజన గూడాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పట్టారు. తమ ఆశల ప్రతిరూపాలు కళ్ల ముం దే కానరాని లోకాలకు వెళ్లిపోతుంటే తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్క అక్టోబర్ మాసంలోనే విష జ్వారాల బారిన పడి 15 ఏళ్లలోపు చిన్నారులు 16 మంది చనిపోయారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నెల 2న ఒక్కరోజే నార్నూర్, కాసిపేట మండలాల్లో నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ వారంలో ఇప్పటివరకు పది మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. ఈ విష జ్వరా లు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ స్థాయిలో మరణాలు జరుగుతున్నా పాలకులు అసలు డెంగీ మరణాలు ఒక్కటి కూ డా లేవని చెప్పడం శోచనీయం. డెంగీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయే తప్ప మరణాలు అసలే లేవని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య ఇటీవల జిల్లా పర్యటనలో పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జ్వరాల తీవ్రత పెరిగిన ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు మొక్కుబడిగా వైద్య శిబిరాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. విష జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్ధారణలోపే మరణం.. చిన్నారులకు డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వచ్చినట్లు నిర్ధారణ అయ్యేలోపే మృత్యువాత పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంలోకి వెళ్లిన డెంగీ కారక వైరస్ ఎనిమిది నుంచి పది రోజుల్లోనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. జ్వరాల బారిన పడిన చిన్నారులకు సకాలంలో వైద్యం అందకుంటేనే మరణాలకు దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో వైద్య సేవలందించాల్సిన పీహెచ్‌సీల్లో ఈ వ్యాధుల నిర్ధారణ సరిగా జరగకపోవడంతో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. పారిశుధ్య లోపమే ప్రధాన కారణమా..? గ్రామాల్లో పారిశుధ్య చర్యల లోపం ఫలితంగా ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ముఖ్యంగా దోమల నివారణకు ప్రణాళికబద ్ధమైన చర్యలు లేకపోవడంతో ఈ పరిస్థితులకు దారితీస్తోందనే విమర్శలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే పంచాయతీ, వైద్యారోగ్య, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పారిశుధ్య చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా దోమలు వృద్ధి చెందే జూన్ మాసంలోనే యాంటీ లార్వ ఆపరేషన్లు నిర్వహించాలి. దోమలు గుడ్డు దశలో ఉన్నప్పుడే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎబేట్, థిమోపాస్, ఎంల్ఆయిల్ వంటి స్ప్రే చేయాలి. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఈ చర్యలు తీసుకోవాలి. అలాగే పారిశుధ్యంపై క్షేత్ర స్థాయిలో అవగాహనకార్యక్రమాలు చేపట్టాలి. కానీ.. ఈ శాఖల అధికారులు ఇవేవీ పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాల మీదికొస్తోంది. పీడిస్తున్న రక్తహీనత.. రక్తహీనత కూడా చిన్నారులను మృత్యు ఒడికి చేరుస్తోంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి జ్వరం వస్తే వారాల తరబడి కోలుకోలేక పోతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో రక్తహీనత తీవ్రత ఎక్కువగా ఉంది. రక్తంలో సాధారణంగా 12 నుంచి 16 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ ఆరు శాతానికి పడిపోతోందని వైద్యులు పేర్కొంటున్నారు. -
రైతుల ఆత్మహత్యలపై భగ్గుమన్న విపక్షాలు
ఆందోళనల మధ్యే మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం కాంగ్రెస్, టీడీపీ సభ్యుల నిరసన.. బడ్జెట్ కాపీలను చించేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ సభ్యుల ఆందోళన మధ్య శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యులు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించినప్పట్నుంచే రైతుల ఆత్మహత్యలపై ప్రకటన చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బడ్జెట్ తర్వాత బీఏసీలో చర్చిద్దామని మండలి చైర్మన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆందోళన కొనసాగించారు. తాము బడ్జెట్‌కు వ్యతిరేకం కాదని, ముందుగా ప్రకటన చేయాలని పట్టుబడుతూ పలుమార్లు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లారు. మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ మాత్రం పోడియం వద్దకు వెళ్లకుండా తన సీటు వద్దే ఉండి నిరసన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైతులను కాపాడండి.. ఆత్మహత్యల నుంచి తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలి.. రోగాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడండి.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి’ అని నినాదాలు చేశారు. బడ్జెట్ ప్రసంగం కొనసాగినంత సేపూ ప్లకార్డులను ప్రదర్శించారు. నలుపు కండువాలు మెడలో వేసుకొని నిరసన వ్యక్తంచేశారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తుండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రవీందర్ తదితరులు లేచి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళన మధ్య డి.శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై ప్రకటన చేయాలని కోరారు. ఆ తర్వాత రాజయ్య తన ప్రసంగం కొనసాగించారు. అయినా విపక్ష సభ్యులు మళ్లీ ఆందోళనను కొనసాగించారు. దీంతో మరో రెండుసార్లు డి.శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. చివ రిసారి ఆయనకు మైక్ ఇచ్చినా... మంత్రి తన ప్రసంగాన్ని కొన సాగించారు. బీజేపీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ తన సీటు వదే ్ద నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెచ్చిన ప్లకార్డును తీసుకొని, ఆ పార్టీ పేరు కనిపించకుండా పట్టుకొని ప్రదర్శించారు. బడ్జెట్ ప్రసంగం చివరికి చేరుకునే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు బడ్జెట్ ప్రతులను చించి, సభలో సభ్యులపైకి విసిరివేశారు. వారి ఆందోళనల నడుమే మండలిని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. -
తెలంగాణ రోడ్ల అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటి సీఎం టి.రాజయ్యను నియమించారు. ఈ సబ్ కమిటీలో మరో ఎనిమిది మంది మంత్రులను సభ్యులుగా నియమించారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధిపై అధ్యయనం చేసి.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. -
'కేసీఆర్‌కి తండ్రిలా మందలించే బాధ్యత ఉంది'
నిజామాబాద్: జూడాలు సమ్మె విరమించకుంటే... చట్టం తనపని తాను చేసుకుపోతుందని డిప్యూటీ సీఎం రాజయ్య స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తండ్రిలా మందలించే బాధ్యత కూడా ఉందని తెలిపారు. రూరల్ ప్రాంతాలకు వెళ్లమని జూడాలు అనడం బాధకరమని అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో పర్యటించిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను పూర్తి ప్రక్షాళన చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేస్తామని... అలాగే 500 పడకల స్థాయి ఆసుపత్రులను ఆధునికరీస్తామని చెప్పారు. మరిన్నీ ఆసుపత్రులను 100 పడకల స్థాయికి తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రంలోని అన్నీ ఆసుపత్రులలో కుక్క, పాము కాటుకు మందు ఉందని చెప్పారు. ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు వైద్యులు ఆసుపత్రి విధుల్లో ఉండాలి పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లు సహాయకులు మాత్రమేనని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా టి.రాజయ్య తెలిపారు. -
పొన్నాలను తరమికొడుతారు: డిప్యూటీ సీఎం
హైదరాబాద్: అవినీతి, అసమర్ధతకు మారుపేరు పొన్నాల లక్ష్మయ్య అని డిప్యూటి సీఎం రాజయ్య ఎద్దేవా చేశారు. జలయజ్క్షం పేరిట తెలంగాణకు అన్యాయం చేసింది పొన్నాలనే అని రాజయ్య ఆరోపించారు. ప్రజల ఆకాంగక్ష మేరకు సంక్షేమ బాటలో కేసీఆర్ పాలన నడుస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనను చూసి సహించలేక అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పొన్నాలను తెలంగాణ ప్రజలు తరిమి కొడుతారని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. -
వైద్య హామీలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చండి
వైద్యాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించి ఇచ్చిన హామీల అమలు ప్రతిపాదనలతో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య అధికారులకు సూచించారు. గురువారం సచివాలయంలో వైద్యశాఖ బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రాధాన్యతలపై చర్చించారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి, మండలస్థాయిలో నలుగురు డాక్టర్లతో 30 పడకల ఆస్పత్రి వంటి హామీలను అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ‘ఇంటింటికీ ప్రభుత్వ వైద్యం’ నినాదం తో ముందుకు వెళుతున్నందున బడ్జెట్లో అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరినట్లు తెలిసింది. అధికార వర్గాల సమాచారం మేరకు సుమా రు రూ.7వేల కోట్లపై చిలుకు ప్రతిపాదనలు రూపొం దించారు. మరోవైపు వైద్య ముఖ్యకార్యదర్శి సురేష్ చందా గురువారం వైద్యశాఖ అధికారులతో ప్రత్యేకం గా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతోపాటు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు హాజరైన ఈ సమావేశంలో వైద్యశాఖ పనితీరుపై సమీక్షించారు. -
జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల
ఖమ్మం వైరారోడ్: జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ప్రకటించారు. జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక మామిళ్లగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ పది పడకల ఆస్పత్రిని ఆయన శనివారం ప్రారంభించారు. ఆయుర్వేదిక్ వైద్యశాల మీటింగ్ హాల్, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా నివారణకు ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా పరిశుభ్రతపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, అక్కడి గిరిజనుల్లో వ్యాధులపై అవగాహన కల్పించేందుకు వైద్యులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తొలిదశలో కరీంనగర్‌తో పాటు జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 19న జరిగే సోషల్ ఎకనామిక్ సర్వేకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకే సర్వేలు చేపడుతున్నట్లు తెలిపారు. పీహెచ్‌సీల బలోపేతానికి కేంద్రం నుంచి నిధులు తెప్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అంటువ్యాధుల నివారణకు గ్రామస్థాయిలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. డాక్టర్ల సమస్యలేంటో తనకు తెలుసునని, సీనియారిటీ ఉన్నా వేతనం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదన్నారు. ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్లు రోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వైద్యవృత్తినే దైవంగా భావిస్తూ సేవా దృక్పథంతో ముందుకు పోవాలని కోరారు. ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ, డయేరియా తదితర వ్యాధుల నివారణకు ముందస్తుగా మందులు పంపిణీ చేస్తున్న ఆయుర్వేదిక్ వైద్యులు, మున్సిపల్ నగర పాలక సంస్థ కమిషనర్‌ను అభినందించారు. ఆయుష్ డిపార్ట్మెంట్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్ఆర్హెచ్ఎం, కేంద్రం నుంచి రావాల్సిన ఇతర నిధులను తెప్పించి వైద్యసేవల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అంగన్వాడీ సెంటర్లకు డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వ్యాధి నివారణ మెడికల్ కిట్లను అందజేశారు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు 1982లో తాను ఖమ్మం ఆస్పత్రికి వచ్చానని, నేడు డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి రోగులకు సేవలందించాలని కోరారు. వైద్యవృత్తినే దైవంగా భావిస్తూ సేవాదృక్పథంతో ముందుకు సాగాలని తెలిపారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. సిబ్బంది కొరత, ఇతర సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. పీహెచ్‌సీలను బలోపేతం చేసి అక్కడ ఆరోగ్యశ్రీ సేవలను తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, డీఎంహెచ్‌వో భానుప్రకాష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణరావు, డీసీహెచ్ఎస్ ఆనందవాణి, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్డీడీ విజయ్‌కుమార్, ఆయుష్ ఏడీ రాజేందర్‌రెడ్డి, ఆయుర్వేదిక్ వైద్యశాల సీనియర్ డాక్టర్ లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు. -
క్షయను పారదోలుదాం
గజ్వేల్: క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణానికి ఉద్యమ స్థాయిలో ప్రయత్నం జరగాల్సిన అవసరముందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని పీఎన్ఆర్ గార్డెన్స్‌లో వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆరుభా హెల్త్ప్రాజెక్ట్ చేపట్టనున్న టీబీ నివారణ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, దేశంలో క్షయ వ్యాధి వ్యాప్తి ఆందోళన క లిగించే విధంగా ఉందన్నారు. ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాల న్నారు. దేశంలో నిమిషానికో టీబీ రోగి చనిపోతున్నారన్నారు. స క్రమంగా చికిత్స తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చన్నారు. చికిత్సపై అవగాహన లేక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు జిల్లాల్లో క్షయ నివారణ కార్యక్రమాన్ని చేపట్టడానికి సంకల్పించిన వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించడానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు, టీబీ నియంత్రణ బోర్డు డెరైక్టర్ సూర్యప్రకాశ్‌రావు, జిల్లా వైద్యాధికారిణి పద్మ, వరల్డ్ విజన్ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ జోబ్రెడ్డి, క్యాలిటీ మేనేజర్ జెస్సీ మధుకర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ దుంబాల అరుణ, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ చార్జి భూంరెడ్డి, గజ్వేల్ ఎంపీపీ చిన్నమల్లయ్య, జగదేవ్‌పూర్, ములుగు జెడ్పీటీసీలు రాంచంద్రం, సింగం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఫొటో లేకపోవటంపై నేతల ఆగ్రహం వరల్డ్ విజన్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోని సభా వేదికపై సీఎం కేసీఆర్ ఫొటో లేకపోవటంతో టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి తదితరులు వేదిక వద్దకు దూసుకెళ్లి నిర్వాహకులను నిలదీశారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మలేకుండా కార్యక్రమాన్ని ఎలా చేపడతారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డాక్టర్ టీ.రాజయ్య కలుగజేసుకొని నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. దీంతో నిర్వాహకులు జోబ్రెడ్డి సభాముఖంగా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. డెలివరీలు చేస్తలేరు... చిన్న గాయాలకూ పట్నం పంపుతుండ్రు అంతకుముందు గజ్వేల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం రాజయ్యకు రోగులు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ‘‘గజ్వేల్ ఆస్పటల్లా సరిగా వైద్యం చేస్తలేరు. చిన్న, చిన్న గాయాలకు పట్నంకు రాస్తుండ్రు. పైసల్లేని పేదోళ్లు ఈడికి డెలివరీలకు వస్తే సిద్దిపేటకు పోమ్ముంట్రుండ్రు. సీఎం కేసీఆర్ ఇలాకా ఇది. అస్పటల్ను బాగుచేయాలే’’ అని గజ్వేల్ మండలం శేర్పల్లి గ్రామానికి చెందిన చంద్రాగౌడ్ డిప్యూటీ సీఎం డాక్టర్ టీ.రాజయ్యకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఈ వ్యవహారంపై విచారణ చేపడతామని వెల్లడించారు. ప్రస్తుతం 50 పడకలుగా ఉన్న ఈ కమ్యునిటీ ఆస్పత్రిని 100 పడకలుగా (ఏరియా) అప్‌గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం ఆస్పత్రిలోని పలువార్డుల్లో రోగులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టెతస్కోప్ చేతబట్టి రోగులను పరీక్షించారు. పలువురు రోగులకు బీపీని పరీక్షించించి తగు సూచనలు చేశారు. -
నాసిరకం మందులపై చర్యలు:రాజయ్య
హైదరాబాద్: తమది ఫార్మా ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య చెప్పారు. నాసిరకం మందులు తయారు చేసే కంపెనీలపట్ల మాత్రం అత్యంత కఠి నంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ‘ఇండియన్ డ్రగ్ మ్యానుఫాక్చర్స్ అసోసియేషన్’(ఐడీఎంఏ) తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గం ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మందుల తయారీలో నాణ్యత ప్రమాణాలను పెంపొం దించి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ‘పేట్లబురుజు’లో తనిఖీ: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య మంత్రి రాజయ్య ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించిన ఆయన అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లయితే తనకు ఫోన్ చేసి సమాచారం అందించాలని రోగులకు సూచించారు. -
జ్వరాలకూ ఆరోగ్యశ్రీ: రాజయ్య
పీహెచ్‌సీల్లోనే సాధారణ ఆపరేషన్లు మన ఆస్పత్రి-మన ప్రణాళిక రూపకల్పనకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: జ్వరాలకూ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య అన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ జాబితాలో మరిన్ని వ్యాధులను పొందుపరుస్తామన్నారు. ఇకపై చిన్న చిన్న ఆపరేషన్లన్నింటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ‘మన ఆస్పత్రి-మన ప్రణాళిక’ పేరిట ప్రతి పీహెచ్సీ, ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులూ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించినట్లు చెప్పారు. దీంతో గడప గడపకూ సర్కారీ మందులను అందించడమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యాంశాలిలా ఉన్నాయి.. త్వరలోనే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాదిరిగానే ఎంబీబీఎస్ ఫీజులను ఈ ఏడాది పెంచే ప్రసక్తే లేదు. నిమ్స్ సహకారంతో ఖమ్మం లేదా కరీంనగర్ జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. ఇందుకోసం సింగరేణి సంస్థ రూ. 200 కోట్లు వెచ్చించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధికి రూ. 200 కోట్లు మంజూరైనా ప్రస్తుతమున్న భవనానికి సాంస్కృతిక వారసత్వ హోదా ఉండటంతో మరమ్మతులకు సాధ్యం కావడం లేదు. చంచల్‌గూడ జైలు స్థలాన్ని ఆస్పత్రి కోసం వినియోగించే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతాం. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మెదడు, గుండె, కిడ్నీ వంటి సూపర్ స్పెషలైజేషన్ శస్త్ర చికిత్సలు మాత్రమే కార్పొరేట్ ఆస్పత్రుల్లో నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటాం. మిగిలిన సాధారణ ఆపరేషన్లన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం. దళితుల సంక్షేమానికి లక్ష కోట్లు.... తెలంగాణ రాష్ట్రంలోనే దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష కోట్ల బడ్జెట్‌ను కేటాయించి వారి అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. వాల్మీకి సమాజ్ ప్రగతి సంఘ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సుల్తాన్షాయి గంగపుత్ర సంఘంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముని వద్ద హనుమంతుడు ఎలా ఉంటాడో... కేసీఆర్‌కు హనుమంతుడిలా వెన్నంటి ఉండి ప్రజల కోసం పని చేస్తామన్నారు. అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ దళితులకు మూడెకరాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం వాటిని అమలు పరిచేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి పనులను ప్రారంభిస్తుందన్నారు. పీహెచ్‌సీల్లో సెమీ ఆటో అనలైజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)కు వచ్చే రోగులందరికీ అక్కడే వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా పీహెచ్‌సీలకు అవసరమైన పరికరాలను అందించాలని నిర్ణయించింది. తొలుత రక్త పరీక్షలు నిర్వహించే సెమీ ఆటో అనలైజర్లను ప్రతి పీహెచ్‌సీకి అందజేయనుంది. ఒక్కో సెమీ ఆటో అనలైజర్ కొనాలంటే సుమారు రూ.20 వేలు ఖర్చవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. దాదాపు రూ.3.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని పీహెచ్‌సీలన్నింటికీ వాటిని సమకూర్చాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి(ఏపీఎంఎస్ఐడీసీ) సంస్థ పనితీరుపై జరిగిన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
సకల సదుపాయాల సర్కారీ దవాఖానాలు
ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలే మా లక్ష్యం హెలికాప్టర్ ద్వారా అత్యవసర చికిత్సలు సర్కారీ ఆస్పత్రులకు వచ్చే రోగులు మందులు బయట కొనాల్సిన పని ఉండదు నష్టపోయిన మెడిసిన్ సీట్లను మళ్లీ సాధిస్తా.. హైదరాబాద్: ‘వైద్యునిగా 30 ఏళ్ల అనుభవముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు వజ్రకవచంలా ఉపముఖ్యమంత్రి పదవిచ్చారు. వీటిని ఉపయోగించి సర్కార్ వైద్యాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళతా.సర్కారీ దవాఖానాల్లో సకల సదుపాయాలను సమకూర్చుతాం. తెలంగాణలోని గడపగడపకూ వైద్యాన్ని అందిస్తా. సర్కార్ ఆస్పత్రులకు వచ్చే రోగు లు ఇకపై మందులు బయట కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. పరీక్షల కోసం ప్రైవేటు లాబ్‌లకు వెళ్లకుండా ప్రక్షాళన చేస్తా. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా. అవసరమైతే ఆ ప్రాంతాలకు హెలికాప్టర్ ద్వారా వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తా.’ అని వైద్యశాఖను నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య చెప్పారు. వైద్య రంగాభివృద్ధి, ప్రభుత్వాస్పత్రుల బలోపేతం, ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాల నివారణ, పేదలకు కార్పొరేట్ వైద్యం వంటి అంశాల్లో రాజయ్య తన విజన్‌ను, ప్రభుత్వ లక్ష్యాలను ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... వైద్యానికి వజ్రకవచం డీసీఎం రోగులందరికీ చక్కని వైద్యాన్ని అందించేందుకు ఈ పదవిని ఉపయోగిస్తా. సచివాలయంలో సమీక్షలకే పరిమితమవడానికి నేను వ్యతిరేకం. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ వ్యా ధుల నివారణకు, మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకుంటా. గ్రామాలు, తండాల్లో మార్పు ఇప్పుడున్న రోగాల్లో 70 శాతం దోమలు, ఈగలవల్లే సంభవి స్తున్నాయి. గ్రామాల, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు వీటిపై అవగాహన లేదు. పైగా మూఢ నమ్మకాలు ఎక్కువ. జ్వరం ఎక్కువై అది మెదడుకు సోకి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే దెయ్యం పూనిందని యంత్రాలు కట్టించుకుంటారే తప్ప చికిత్స చేయించుకోవాలనుకోరు. అందుకే ఆ ప్రాంతాలపైనే నేను దృష్టి సారించా. వైద్యశాఖతోపాటు ఐటీడీఏ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, అంగన్వాడీ ఉద్యోగులనూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులనూ భాగస్వామిని చేస్తా. కళాజాతాల ద్వారా రోగాల నివారణపై అవగాహన కల్పిస్తా. హెలికాప్టర్ అంబులెన్సుల ఏర్పాటు అత్యవసర పరిస్థితిలో కేసీఆర్ చెప్పినట్టు హెలికాప్టర్ అంబులెన్సులను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తాం. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొం దిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో బోర్లలో పిల్లలు పడితే ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెచ్చించి వాళ్ల ప్రాణాలను కాపాడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఏజెన్సీ ప్రజలు రోగాలబారినపడినప్పుడు హెలికాప్టర్ అంబులెన్సులను వినియోగిస్తే తప్పేముంది? సర్కార్ దవాఖానాల ప్రక్షాళన ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, కనీస సౌకర్యాలు, డాక్టర్లు, సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. ఇకపై అలాంటివి ఉండకుండా చూస్తాం. సర్కార్ దవాఖానాలకు వచ్చేవారు ఇకపై బయట మందులు కొనడం, ప్రైవేటు డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకునే పరిస్థితి రానీయను. మందులను ఆస్పత్రుల్లో అందజేయిస్తా. పరీక్షలను సైతం అక్కడే జరిపిస్తా. సమయపాలన పాటించాల్సిందే.. డాక్టర్లు, సిబ్బంది సరిగా విధులకు హాజరు కావడం లేదని, సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇకపై సమయాలను కచ్చితంగా పాటించాల్సిందే. డాక్టర్ల గౌరవాన్ని పెంపొందించే బాధ్యతను నేను తీసుకుంటా. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఉన్నతాధికారులు జవాబుదారీగా ఉండాలి. అవినీతిని నిర్మూలిస్తా.. ప్రభుత్వాస్పత్రుల్లో రెండు రకాల అవినీతి జరుగుతోంది. రోగుల వద్ద అటెండర్, సెక్యూరిటీ గార్డ్ వంటి కింది స్థాయి ఉద్యోగులు తీసుకునే పది, పరకా వంటివి ఒకటైతే... మందులు, ఇతరత్రా వాటిల్లో జరిగే అవినీతి మరొకటి. రెండో రకం అవినీతిని నిర్మూలిస్తే... మొదటిది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అందుకోసం కృషి చేస్తా. హెల్త్‌హబ్‌గా తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని హెల్త్టూరిజంగా మార్చేందుకు ప్రయత్నిస్తా. ప్రభుత్వ దవాఖానాలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతా. బీబీనగర్ నిమ్స్ పనులను పూర్తిచేసి రెండు నెలల్లో ఓపీ బ్లాకును ప్రారంభిస్తా. గాంధీ, కాకతీయ మెడికల్ కళాశాలల్లో ఎంసీఐ నిబంధనలు పాటించలేదనే కారణంతో వంద సీట్లకు కోత విధించారు. వాటిని తిరిగి సాధించుకుంటాం. మరోసారి ఎంఐసీ ఆయా కళాశాలలను సందర్శించాలని, కేంద్ర నిబంధనలను పూర్తిగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున హామీ ఇస్తా. -
పేదవాడికి మైరుగైన వైద్యం: రాజయ్య
బీబీనగర్: ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖామంత్రి టి.రాజయ్య అన్నారు. పేదవారికి అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష జరుపుతామని ఓ ప్రశ్నకు డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. బీబీనగర్ నిమ్స్ ప్రారంభం కోసం అధికారులతో ఈ నెల 17న సమీక్ష నిర్వహిస్తామని ఆయన అన్నారు. బీబీనగర్ లో నిర్మించిన నిమ్స్ ఆస్పత్రి భవనాన్ని రాజయ్య సందర్శించారు. బీబీనగర్ లో నిర్మించిన నిమ్స్ ఆస్పత్రిని తెలంగాణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్య తీసుకుంటామని ఆయన అన్నారు. -
'అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తా'
హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రిగా వైద్య, ఆరోగ్య శాఖమంత్రి తాటికొండ రాజయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగ సంఘాలు అభినందనలు తెలిపాయి. వైద్య ఆరోగ్య మంత్రి హోదాలో రాజయ్య ...తొలిగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డును 50 పడకల నుంచి 120 పడకలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. అలాగే మెదక్ జిల్లా నంగునూరులో 50 పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వైద్యరంగంలో అవినీతికి ఆస్కారం లేకుండా కృషి చేస్తామని రాజయ్య తెలిపారు. వైద్య విద్యను ప్రోత్సహించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో అన్ని ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు రాజయ్య తెలిపారు. -
కేబినెట్లో మైనార్టీ, ఎస్సీ, బీసీ, ఓసీలకు చోటు
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ మంత్రివర్గంలో ఒకరు మైనార్టీ, ఒకరు ఎస్సీ, ముగ్గురు బీసీ, ఆరుగురు ఓసీలకు చోటు దక్కింది. *మైనార్టీ నుంచి మహమూద్ అలీ *ఎస్సీ సామాజిక వర్గం నుంచి తాటికొండ రాజయ్య, * వెనుకబడిన కులాలకు చెందిన ఈటెల రాజేందర్, టీవుల పద్మారావు,జోగు రామన్న * ఇక వెలమ సామాజిక వర్గం నుంచి హరీష్ రావు, కేటీఆర్, * రెడ్డి సామాజిక వర్గం నుంచి జగదీశ్వర్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, మహేందర్ రెడ్డిలకు కేసీఆర్ మంత్రిపదవులు ఇచ్చారు. -
దైవసాక్షిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖరరావు) తెలుగు భాషలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 8.15కు గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్లో కేసీఆర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ కేబినెట్‌తో కూడా ఆయన ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కేసీఆర్ కేబినెట్లో తొలిగా మహముద్ అలీ, టి.రాజయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కేబినెట్ బృందానికి గవర్నర్ తేనీటి విందు ఇవ్వనున్నారు. అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పరేడ్ మైదానంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా జరిగే ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, తెలంగాణ పునర్నిర్మాణం తదితరాలపై తన మనోగతాన్ని వివరిస్తారు. -
మాది విధేయత: టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు
హైదరాబాద్: పార్టీ అధినేతకు విధేయతగా ఉన్నామని, అది బానిసత్వం కిందకు రాదని టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యే లు టి.రాజయ్య, కొప్పుల ఈశ్వర్ అన్నా రు. హైదరాబాద్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాజకీయ అవినీతి అంతం కావాలంటున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచినందుకు గర్వపడుతున్నామన్నారు. దళితులు కోరుకునే సామాజిక న్యాయం, రాజ్యాధికారంలో వాటా టీఆర్ఎస్లో, కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమన్నారు. బాబు చేతిలో పావుగా మారి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన మంద కృష్ణ లాంటివారు టీఆర్ఎస్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. మాదిగలు ఎక్కువగా ఉన్న నియోజవర్గాలను చూసుకుని మూడుసార్లు పోటీచేసినా గెలవలేని మంద కృష్ణ వంటివారు బ్లాక్మెయిల్ రాజకీయాలతో ఆస్తులు పెంచుకోవడం తప్ప మాదిగ జాతి అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. -
సీటు..ఫైటు
సాధారణ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఒకేసారి రావడంతో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్లో ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న వర్గపోరు ఇప్పుడు బయటపడుతోంది. ఎన్నికల తరుణంలో అవకాశాల కోసం శ్రేణుల మధ్య పోటీ ఘర్షణలకు దారితీస్తోంది. స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్లోని వర్గాలు ఇప్పుడు స్థానిక అవకాశాల కోసం పోరాటం మొదలుపెట్టాయి. టీఆర్ఎస్ కీలక నేత కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే టి.రాజయ్య వర్గాల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న వర్గపోరు... ద్వితీయ శ్రేణి నేతల ఘర్షణతో మంగళవారం మరోసారి బయటపడింది. తెలంగాణ ఏర్పాటుతో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కడియం శ్రీహరి వర్గీయులు తమ నేతను ఎమ్మెల్యేగా పోటీ చేయించే వ్యూహాన్ని ముందుకు తెచ్చారు. కడియం శ్రీహరితోపాటు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వర్గాన్ని సమీకరిస్తున్నారు. ఎమ్మెల్యే టి.రాజయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారని భావిస్తున్న టీఆర్ఎస్ వ్యవస్థాపక శ్రేణులను కడియం వర్గీయులు అక్కున చేర్చుకుంటున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థిత్వాల ఖరారు అంశాన్ని ముందుకుపెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరి అయితే బాగుంటుందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితేనే స్టేషన్ ఘన్పూర్ మళ్లీ అభివృద్ధి చెందుతుందనే ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం మొదలైన ఈ ప్రక్రియ ఊపందుకుంది. దీన్ని పసిగట్టిన ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులు ప్రతి వ్యూహాలతో సన్నద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికల్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వీరు సైతం టీఆర్ఎస్ మొదటి నేతలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా రెండు వర్గాలు మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న వారిని దగ్గరగా చేర్చుకుంటూ తమ నేతలను ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా ఇరు వర్గాల వ్యూహాలు జోరందుకోవడంతో జఫర్‌గఢ్ మండలం తీగారం సమీపంలో ఏకంగా ఘర్షణ వరకు వెళ్లింది. ఒకరికొకరు తోపులాటకు దిగారు. ఈ ఘర్షణలో ఓ నాయకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు. ఆయనను వెంట నే జఫర్‌గఢ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అరుు తే స్థానిక, సాధారణ ఎన్నికలలోపు ఇలాంటివి ఇంకా జరిగే పరిస్థితి ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కడియం శ్రీహరి, రాజయ్య వర్గీయుల పంచాయతీ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. రాజయ్య వర్గీయులు రెండుమూడు రోజుల్లో కేసీఆర్‌ను కలవనున్నట్లు చెబుతున్నారు. పదవుల కోసం పోటీ ఇన్నాళ్లు ఉద్యమం కారణంగా పదవుల కోసం పోటీ పడేందుకు సంశయంగా ఉన్న టీఆర్ఎస్ నేతలు మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మొదట టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారే ఉన్నారు. 1994, 1999లో కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌నూర్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పదేళ్లు మంత్రిగా పని చేశారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది. జి.విజయరామారావు ఏకంగా రాష్ట్ర మంత్రి అయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి గెలిచారు. 2009 ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి టి.రాజయ్య చేతిలో కడియం శ్రీహరి ఓడిపోయారు. అనంతరం రాజయ్య టీఆర్ఎస్లో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరిపై రాజయ్య గెలిచారు. అనంతరం కడియం శ్రీహరి కూడా టీఆర్ఎస్లో చేరారు. ఇలా మూడు పార్టీల్లో ముఖ్య నేతలుగా ఉన్న కడియం శ్రీహరి, జి.విజయరామారావు, ఎమ్మెల్యే రాజయ్యలు టీఆర్ఎస్లోనే చేరడంతో వర్గపోరు తీవ్రమైంది. తర్వాత విజయరామారావు కాంగ్రెస్‌లో చేరారు. అయినా కడియం, రాజయ్య వర్గాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల తరుణంలో ఇది బయటపడుతోంది.