పొన్నాలను తరమికొడుతారు: డిప్యూటీ సీఎం
హైదరాబాద్: అవినీతి, అసమర్ధతకు మారుపేరు పొన్నాల లక్ష్మయ్య అని డిప్యూటి సీఎం రాజయ్య ఎద్దేవా చేశారు. జలయజ్క్షం పేరిట తెలంగాణకు అన్యాయం చేసింది పొన్నాలనే అని రాజయ్య ఆరోపించారు. ప్రజల ఆకాంగక్ష మేరకు సంక్షేమ బాటలో కేసీఆర్ పాలన నడుస్తోందని ఆయన అన్నారు.
కేసీఆర్ పాలనను చూసి సహించలేక అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పొన్నాలను తెలంగాణ ప్రజలు తరిమి కొడుతారని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు.