'కేసీఆర్కి తండ్రిలా మందలించే బాధ్యత ఉంది'
నిజామాబాద్: జూడాలు సమ్మె విరమించకుంటే... చట్టం తనపని తాను చేసుకుపోతుందని డిప్యూటీ సీఎం రాజయ్య స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు తండ్రిలా మందలించే బాధ్యత కూడా ఉందని తెలిపారు. రూరల్ ప్రాంతాలకు వెళ్లమని జూడాలు అనడం బాధకరమని అన్నారు. బుధవారం నిజామాబాద్లో పర్యటించిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను పూర్తి ప్రక్షాళన చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేస్తామని... అలాగే 500 పడకల స్థాయి ఆసుపత్రులను ఆధునికరీస్తామని చెప్పారు. మరిన్నీ ఆసుపత్రులను 100 పడకల స్థాయికి తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రంలోని అన్నీ ఆసుపత్రులలో కుక్క, పాము కాటుకు మందు ఉందని చెప్పారు. ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు వైద్యులు ఆసుపత్రి విధుల్లో ఉండాలి పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లు సహాయకులు మాత్రమేనని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా టి.రాజయ్య తెలిపారు.