నాసిరకం మందులపై చర్యలు:రాజయ్య | The crumbling of the actions of drugs: RAJAIAH | Sakshi
Sakshi News home page

నాసిరకం మందులపై చర్యలు:రాజయ్య

Published Mon, Aug 4 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

నాసిరకం మందులపై చర్యలు:రాజయ్య

నాసిరకం మందులపై చర్యలు:రాజయ్య

హైదరాబాద్: తమది ఫార్మా ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య చెప్పారు. నాసిరకం మందులు తయారు చేసే కంపెనీలపట్ల మాత్రం అత్యంత కఠి నంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ‘ఇండియన్ డ్రగ్ మ్యానుఫాక్చర్స్ అసోసియేషన్’(ఐడీఎంఏ) తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గం ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మందుల తయారీలో నాణ్యత ప్రమాణాలను పెంపొం దించి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.  


 ‘పేట్లబురుజు’లో తనిఖీ: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య మంత్రి రాజయ్య ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించిన ఆయన అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లయితే తనకు ఫోన్ చేసి సమాచారం అందించాలని రోగులకు సూచించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement