సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : విష జ్వరాలు.. ఆయా కారణాలతో చిన్నారులు పిట్టల్లా రాలుతున్నారు. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన వారు డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో బాల్యంలోనే తనువు చాలి స్తున్నారు. దీనికితోడు నీటి బకెట్లో పడి చనిపోవడం.. ఏదో ఓ వస్తువు మింగి తనువు చాలించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. దీంతో కన్నవారికి కడుపుకోత మిగులుతోంది. వీటిలో జ్వరాలతో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
జ్వర మరణాలు రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళనకు గురిచేసే అంశం. ముఖ్యంగా మారుమూల గిరిజన గూడాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పట్టారు. తమ ఆశల ప్రతిరూపాలు కళ్ల ముం దే కానరాని లోకాలకు వెళ్లిపోతుంటే తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్క అక్టోబర్ మాసంలోనే విష జ్వారాల బారిన పడి 15 ఏళ్లలోపు చిన్నారులు 16 మంది చనిపోయారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ నెల 2న ఒక్కరోజే నార్నూర్, కాసిపేట మండలాల్లో నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ వారంలో ఇప్పటివరకు పది మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. ఈ విష జ్వరా లు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ స్థాయిలో మరణాలు జరుగుతున్నా పాలకులు అసలు డెంగీ మరణాలు ఒక్కటి కూ డా లేవని చెప్పడం శోచనీయం.
డెంగీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయే తప్ప మరణాలు అసలే లేవని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య ఇటీవల జిల్లా పర్యటనలో పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జ్వరాల తీవ్రత పెరిగిన ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు మొక్కుబడిగా వైద్య శిబిరాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. విష జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిర్ధారణలోపే మరణం..
చిన్నారులకు డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వచ్చినట్లు నిర్ధారణ అయ్యేలోపే మృత్యువాత పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంలోకి వెళ్లిన డెంగీ కారక వైరస్ ఎనిమిది నుంచి పది రోజుల్లోనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. జ్వరాల బారిన పడిన చిన్నారులకు సకాలంలో వైద్యం అందకుంటేనే మరణాలకు దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో వైద్య సేవలందించాల్సిన పీహెచ్‌సీల్లో ఈ వ్యాధుల నిర్ధారణ సరిగా జరగకపోవడంతో మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
పారిశుధ్య లోపమే ప్రధాన కారణమా..?
గ్రామాల్లో పారిశుధ్య చర్యల లోపం ఫలితంగా ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ముఖ్యంగా దోమల నివారణకు ప్రణాళికబద ్ధమైన చర్యలు లేకపోవడంతో ఈ పరిస్థితులకు దారితీస్తోందనే విమర్శలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే పంచాయతీ, వైద్యారోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పారిశుధ్య చర్యలు చేపట్టాలి.
ముఖ్యంగా దోమలు వృద్ధి చెందే జూన్ మాసంలోనే యాంటీ లార్వ ఆపరేషన్లు నిర్వహించాలి. దోమలు గుడ్డు దశలో ఉన్నప్పుడే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎబేట్, థిమోపాస్, ఎంల్‌ఆయిల్ వంటి స్ప్రే చేయాలి. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఈ చర్యలు తీసుకోవాలి. అలాగే పారిశుధ్యంపై క్షేత్ర స్థాయిలో అవగాహనకార్యక్రమాలు చేపట్టాలి. కానీ.. ఈ శాఖల అధికారులు ఇవేవీ పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాల మీదికొస్తోంది.
పీడిస్తున్న రక్తహీనత..
రక్తహీనత కూడా చిన్నారులను మృత్యు ఒడికి చేరుస్తోంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి జ్వరం వస్తే వారాల తరబడి కోలుకోలేక పోతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో రక్తహీనత తీవ్రత ఎక్కువగా ఉంది. రక్తంలో సాధారణంగా 12 నుంచి 16 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ ఆరు శాతానికి పడిపోతోందని వైద్యులు పేర్కొంటున్నారు.
గర్భశోకం..
Published Sat, Nov 8 2014 3:18 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM
Advertisement
Advertisement