మాది విధేయత: టీఆర్‌ఎస్ దళిత ఎమ్మెల్యేలు | Obedience to ours: TRS of Dalit leaders | Sakshi
Sakshi News home page

మాది విధేయత: టీఆర్‌ఎస్ దళిత ఎమ్మెల్యేలు

Published Mon, May 19 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

మాది విధేయత: టీఆర్‌ఎస్ దళిత ఎమ్మెల్యేలు

మాది విధేయత: టీఆర్‌ఎస్ దళిత ఎమ్మెల్యేలు

 హైదరాబాద్: పార్టీ అధినేతకు విధేయతగా ఉన్నామని, అది బానిసత్వం కిందకు రాదని టీఆర్‌ఎస్ దళిత ఎమ్మెల్యే లు టి.రాజయ్య, కొప్పుల ఈశ్వర్ అన్నా రు. హైదరాబాద్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాజకీయ అవినీతి అంతం కావాలంటున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచినందుకు గర్వపడుతున్నామన్నారు. దళితులు కోరుకునే సామాజిక న్యాయం, రాజ్యాధికారంలో వాటా టీఆర్‌ఎస్‌లో, కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమన్నారు.

బాబు చేతిలో పావుగా మారి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన మంద కృష్ణ లాంటివారు టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. మాదిగలు ఎక్కువగా ఉన్న నియోజవర్గాలను చూసుకుని మూడుసార్లు పోటీచేసినా గెలవలేని మంద కృష్ణ వంటివారు బ్లాక్‌మెయిల్ రాజకీయాలతో ఆస్తులు పెంచుకోవడం తప్ప మాదిగ జాతి అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement