సాక్షి, యాదాద్రి: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన జరిగింది. ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. ప్రమాద సమయంలో మరో ట్రాక్‌పై నుంచి గూడ్స్ రైలు వెళ్లింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది.
ప్రయాణికులంతా సురక్షితమని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి, బీబీనగర్, ఘట్‌కేసర్ స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని వివిధ రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు. బీబీనగర్ స్టేషన్‌లో విశాఖ-మహబూబ్‌నగర్ ప్రత్యేక రైలును ఆపేశారు. తిరుపతి-పూర్ణా (నాందేడ్) స్పెషల్, దిబ్రూగఢ్-సికింద్రాబాద్ స్పెషల్ రైళ్లను భువనగిరిలో నిలిపేశారు. ట్రాక్ మరమ్మతులు పూర్తయిన తర్వాత వీటిని పంపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment