- నిలువుదోపిడీ చేస్తున్న దళారులు
- అవసరాలు.. అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ..
- పట్టణంలోనే 19 మంది బాధితులు
సంగారెడ్డి మున్సిపాలిటీ: ‘మీకు అప్పు కావాలా..?, మేమడిగిన డాక్యుమెంట్లు చూపండి’ అంటూ పేపర్లలో ప్రకటన లు ఇస్తారు.. ఎవరో కొందరు అమాయకులు ఆ వలలో చిక్కగానే సర్వీస్ చారీ్జలు, డాక్యుమెంట్ చార్జీల పేరుతో కొంత డబ్బు మా బ్యాంకు అకౌంట్‌లో వేయండని వారిని బుట్టలో పడేస్తారు. ఇంకేముంది ఆ మాయగాళ్లు మళ్లీ కనబడితే ఒట్టు.. ఇలా ఎందరో అమాయకులు బలైపోతున్నారు. మోసపోయి చెప్పుకునే వారు అందులో కొంతమందే... వ్యక్తిగత, ల్యాండ్ మార్టిగేషన్, వ్యాపార రుణాలిస్తామని కొంద రు వ్యక్తులు పలు పత్రికల్లో ప్రకటన లు జారీ చేస్తున్నారు. వీటిని పరిశీ లించిన స్థానికులు మొబైల్ ఫోన్ ద్వారా వారిని సంప్రదిస్తున్నారు.
ముందుగా ఏ రుణం కావాలి..?, ఏం చేస్తారు..?, ఎంత కావాలి? అనే వాటి వివరాలు సేకరిస్తారు. ‘అందుకు మీ ఐడీకార్డు, బ్యాంక్ పాస్‌బుక్, కరెంట్ బిల్లులను మెయిల్ చేయాలని వారికి సూచి స్తారు. అనంతరం మీ డాక్యుమెంట్లు చూశాం.. రుణం మంజూరు చేస్తాం అందుకోసం మీకు ఇచ్చే రుణంలో 50 శాతం కమీషన్ చెల్లిం చాల్సి ఉంటుంది’ అని నిర్వాహకులు అర్జీదారులకు తెలుపుతారు. వాటితో పాటు డాక్యుమెంట్ చార్జి రూ.2,350, జనరల్ ఇన్సూరెన్స్, ప్రాజెక్టు రిపోర్టు తయా రు చేయడానికి ముందుగా డబ్బులు చెల్లించాలంటారు. వాటిని శ్రీ దత్తసాయి ఎంటర్‌ప్రైజెస్ ఖాతా లో జమచేయాలని తర్వాత రెండు రోజుల్లో రుణం మంజూరవుతుందని తెలియజేస్తారు.
కానీ వారమైనా నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం రాదు. ‘అర్జీదారులు ఫోన్‌చేస్తే మీకు అర్జెంటుగా రుణం కావాలంటే అదనంగా 2 శాతం కమీషన్ చెల్లించాలి. అలా అయితే వెంటనే చెక్కు జారీ చేస్తాం’ అని చెబుతారు. అసలు డాక్యుమెంట్‌లు పరిశీలించి వారం రోజుల్లో రుణం అందజేస్తామంటారు. వారు నెలరోజులైనా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఫోన్‌చేస్తే మరికొంత కమీషన్ చెల్లించాలంటూ అడుగుతున్నారని బాధితులు తెలిపారు. ఇలా పట్టణంలోనే 19 మంది తమ అవసరాల కోసం దరఖాస్తు చేసుకొని ఆ సంస్థ పేరున రూ.19,600 చొప్పున రూ.3,72,400 ను 863720110000472 ఖాతాలో జమచేశారు.
మోసపోయా: శ్యాముల్ రాజు
పత్రికల్లో రుణం ఇస్తామనే ప్రకటనలు చూసి ఆ సంస్థను సంప్రదించా. నేను రూ.19,600 చెల్లించాను..
రుణాల పేరుతో ఘరానా మోసం!
Published Thu, Mar 5 2015 12:29 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement