- ఎదురుతిరిగిన రైతులు
- తహ శీల్దార్‌కు ఫిర్యాదు
- కొడుముంజలో ఘటన
వేములవాడ అర్బన్ : దళారుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయనేదానికి ఈ ఘటనే నిదర్శనం. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది. అరుుతే ఓ దళారీ ఏకంగా కొనుగోలు కేంద్రంలోనే కాంటా పెట్టి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఘటన వేములవాడ మండలం కొడుముంజలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని కొడుముంజలోని సింగిల్‌విండో కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రరుుంచేందుకు ఓ రైతు వచ్చాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఓ దళారీ, రైతుకు మాయమాటలు చెప్పి క్వింటాల్‌కు రూ.1200 చొప్పున చెల్లిస్తానని చెప్పి ధాన్యాన్ని ఏకంగా కొనుగోలు కేంద్రంలోనే తూకం వేశాడు.
అంతేకాకుండా ట్రాక్టర్‌లో లోడ్ కూడా చేరుుంచాడు. ఇది గమనించిన మరో రైతు విషయాన్ని సింగిల్‌విండో చైర్మన్ నీలం శ్రీనివాస్‌కు అందజేయగా.. ఆయన అక్కడికి చేరుకుని ఈ విషయంపై కూపీ లాగాడు. రైతు వద్ద మధ్య దళారీ ధాన్యం కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో సదరు దళారీపై తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. అనంతరం తూకం వేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే దింపేశారు. అధికారుల నిఘా, పర్యవేక్షణ లోపంతోనే కొనుగోలు కేంద్రాల్లోకే దళారులు వస్తున్నారని రైతులు ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద మధ్య దళారుల బెడద లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో దళారుల దందా
Published Tue, May 5 2015 2:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement