రాస్తారోకో చేస్తున్న రైతులు
పిట్లం : కందులను కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు సోమవారం పిట్లం వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కందులు కొనుగోలు చేసేందుకు మార్క్ ఫెడ్ అధికారులు స్థానిక మార్కెట్ యార్డ్‌లో సహకార సంఘం ఆధ్వర్యంలో కందుల కోనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు. క్వింటాలుకు మద్దతు ధర రూ.5450 నిర్ణయించారు. పిట్లం మండలంలో 2900 క్విటాళ్ల లక్ష్యం నిర్ణయించారు. దీంతో పోమవారం అధికారులు తమకు ఇచ్చిన లక్ష్యం పూర్తియిందని కొనుగోల్లు నిలిపివేశారు. మార్కెట్ ఆవరణలో రైతులు తెచ్చిన కందులు కొనడం లేదని ఆగ్రహించిన రైతులు మార్కెట్ యార్డు ముందు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. మార్కెట్‌యార్డుకు విక్రయించడానికి కందులను తీసుకువస్తే గేటును మూసి వేస్తుండటం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని లేదంటే ఆందోళన చేపడతామని రైతుల పక్షాణ బండపల్లి సర్పంచ్ గైనిరాములు మద్దతు పలికారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అంతిరెడ్డి రైతులతో మాట్లాడుతూ రహదారిపై రాస్తారోకో చేపట్టడం సరికాదని, అధికారులతో చర్చించి రైతుల కందుల కోనుగోలు చేసే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో అందోళన విరమించిన రైతులు శాంతించి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment