నరసన్నపేట రూరల్: ధాన్యానికి మద్దతు ధరపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమానికే గండి కొట్టే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లెవీ సేకరణకు సంబంధించి తాజాగా సవరించిన నిబంధనలు రైతుకు మేలు చేసేవిగా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత ఆహర సంస్థ ద్వారా అమల్లోకి తెచ్చిన ఈ నిబంధనల ప్రకారం లెవీ సేకరణ పరిమాణాన్ని బాగా కుదించారు.
దీని ప్రభావం ప్రభుత్వం చెల్లించే ధాన్యం మద్దతు ధరపై పడుతుందని అటు మిల్లర్లు, ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైతుల తరఫున అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా చోద్యం చూస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ధాన్యానికి మద్దతు ధర దక్కదని మిల్లర్లు అంటున్నారు. ఈ పరిస్థితిని అధికార పార్టీ పెద్దలకు తెలియజేసినా పట్టించుకోవడంలేదని మిల్లర్ల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
లెవీ 25 శాతమే
రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యంలో 75 శాతాన్ని బియ్యం రూపంలో ఎఫ్‌సీఐ లెవీగా తీసుకునేది. మిగిలిన 25 శాతంలో రెండొంతులు ఇతర రాష్ట్రాల్లోనూ, మిగిలిన ఒక వంతు రాష్ట్రంలోనూ బహిరంగ మార్కెట్‌లో స్వేచ్ఛగా విక్రయించుకొనేందుకు అనుమతి ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం ఈ సీజన్ నుంచి మిల్లర్ల నుంచి 25 శాతం బియ్యాన్నే లేవీగా తీసుకుంటుంది. మిగిలిన 75 శాతం ధాన్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకోవాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలు అక్టోబరు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. దీని వల్ల రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వ పెద్దలకు, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు జిల్లా మిల్లర్లు వివరించారు. అయినా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదు. గతంలో 75 శాతం లేవీగా తీసుకున్నప్పుడే మిగిలిన 25 శాతం నిల్వలను అమ్ముకొనేందుకు మిల్లర్లు నానాపాట్లు పడేవారు. ఇప్పుడు 75 శాతం విక్రయించడం జరిగే పని కాదంటున్నారు. మరోవైపు ఈ 75 శాతం ధాన్యాన్ని నిల్వ చేసే సౌకర్యం జిల్లాలో లేదు. ఆ స్థాయిలో గిడ్డంగుల్లేవు. పైగా భారీగా డబ్బు పెట్టుబడి పెట్టే మిల్లర్లు కూడా లేరు.
ఇది పరోక్షంగా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాగా గతంలో క్వింటాలుకు వంద రూపాయల వరకూ తక్కువకు రైతుల నుంచి ధాన్యం కొనేవారు. మారిన పరిస్థితుల్లో ఏ రేటుకు కొనుగోలు చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి వేశారు. హుద్‌హుద్ తుపాను, దోమ పోటు కారణంగా ఎకరాకు 5 నుంచి 8 బస్తాల వరకూ దిగుబడి తగ్గుతుందని అంచ నా. ఇలా తీసుకున్నా ధాన్యం దిగుబడి ఎకరాకు 8 నుంచి 18 బస్తాల వరకూ వచ్చే అవకాశం ఉంది.
దీంట్లో తిండి గింజలకు కొంత నిల్వ చేసుకొని మిగిలిన ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముతారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ వరికి ఇప్ప టికే మద్దతు ధరలు ప్రకటించింది. సాధారణ రకం క్వింటాలు రూ. 1360, ఏ గ్రేడ్ రకం రూ.1400గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొత్త లెవీ నిబంధనల నేపథ్యంలో ఈ స్థాయిలో రెతులకు మద్దతు ధర లభిం చడం అనుమానమేనంటున్నారు.
మద్దతు కష్టమే!
Published Sat, Nov 8 2014 1:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement