కందిపోయిన దిగుబడి కలిసిరాని రాబడి | Support price In addition to the Rs 1000 .. | Sakshi
Sakshi News home page

కందిపోయిన దిగుబడి కలిసిరాని రాబడి

Published Thu, Feb 26 2015 3:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Support price In addition to the Rs 1000 ..

ధర చూసి మురిసిపోవాలో.. దిగుబడి చూసి దిగాలు చెందాలో.. అర్థం కాని పరిస్థితి కంది రైతులది. గతేడాది గణనీయంగా ఉన్న దిగుబడి.. ఈసారి అదే స్థారుులో దిగజారింది. ఆ సమయంలో మద్దతు ధరకు నోచుకోని రైతులు.. ఇప్పుడేమో వ్యాపారులు ముందు చూపుతో మద్దతు ధరకు మించి అదనంగా రూ.వెయి చెల్లిస్తున్నారు. గతేడాది ఎక్కువ దిగుబడి వస్తే క్వింటాల్‌కు రూ.3,900 నుంచి రూ.4,600లోపు చెల్లించి కొనుగోలు చేశారు.

ఈసారి ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా దిగుబడి రాకపోవడంతో మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,350కి అదనంగా రూ.వెరుు్య వరకు చెల్లిస్తున్నారు.
 
- కంది ధర పెరిగినా.. దిగుబడి రాని వైనం
- మద్దతు ధర కంటే అదనంగా రూ.1000 వరకు..

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి సగానికి పైగా పడిపోయింది. వీటిలో కంది దిగుబడి కూడా గణనీయంగా తగ్గింది. పంట ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉన్నా.. 3 నుంచి 4 క్వింటాళ్లు దాటలేదు. ఈ పంటకు వ్యవసాయ మార్కెట్ యూర్డులో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,350 ఉండగా.. ఈ ధర కంటే అదనంగా మరో రూ.వెరుు్య వరకు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

గతేడాది ఎక్కువ దిగుబడి రావడంతో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.3,900 నుంచి రూ.4,600 లోపు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.5,000 నుంచి రూ.5,600 వరకు చెల్లిస్తున్నారు. దిగుబడి తగ్గి వినియోగం పెరుగుతుం దనే కారణంతోనే ఇక్కడ మద్దతు ధర పెంచినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర మార్కెట్ ఇంధన్‌ఘడ్‌లో ఎక్కువ ధర చెల్లిస్తుండడంతో ఇక్కడా మద్దతు ధరకు రెక్కలొచ్చాయని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో కంది పంట 43,350 హెక్టార్లలో సాగు చేశారు. దీని ప్రకారం జిల్లాలో ఆశించినంత వర్షాలు కురిస్తే సుమారుగా ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల చొప్పున మొత్తం మూడున్నర నుంచి నాలుగు లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ.. రెండు లక్షలు కూడా దాటలేదు. గతేడాది ఇదే సమయూనికి ఆదిలాబాద్ మార్కెట్ యూర్డులో వ్యాపారులు 47,980 క్వింటాళ్లు కొనుగోలు చేయగా.. ఈసారి 7,102 క్వింటాళ్లు మాత్రమే వచ్చారుు.
 
వర్షాభావ పరిస్థితులే కారణం..
ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో విత్తుకున్న పంటలు వర్షాలు లేక మొలకెత్తలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు, మూడేసి సార్లు విత్తారు. పంట కాలం పూర్తరుునా జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. 1094 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను.. 746 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులే స్వయంగా జిల్లాలో 52 మండలాలకు గాను 40 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. వర్షాభావంతో వాణిజ్య పంటలతోపాటు ఆహారధాన్యాల పంటలైన వరి, కంది, పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, తదితర పంటల దిగుబడి గణనీయంగా పడిపోయింది.

దీంతో దిగుబడిపై ప్రభావం.. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం, పప్పు దినుసుల ధరలు భగ్గుమంటున్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నారుు. అందుకే.. ప్రస్తుతం వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తుండడం గమనార్హం.
 
ఒక్క మార్కెట్‌లోనే కొనుగోళ్లు..
జిల్లాలో 19 వ్యవసాయ మార్కెట్‌లు ఉండగా.. ఎక్కువగా సాగు చేసే ప్రాంతాలకు అనుగుణంగా ఏటా నిర్మల్, భైంసా, ఆదిలాబాద్  వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరుగుతాయి. ఆయూ ప్రాంతాల్లో పంట దిగుబడి ఎక్కువగా రాకపోవడంతో నిర్మల్, భైంసా మార్కెట్‌యూర్డుల్లో కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఒక్క ఆదిలాబాద్ మార్కెట్‌లో మాత్రమే కొనుగోళ్లు చేపడుతున్నారు.
 
దిగుబడి సగానికి తగ్గింది..
పోయినేడు పదెకరాలు సోయా పంటలో అంతర పంటగా కంది సాగు చేసిన. 13 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది పదెకరాలు సాగిచేసినా. అరుునా.. 4 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే పండింది. పోయేనేడు ధర తక్కువగా ఉండే. ఈసారి ధర ఎక్కువగా ఉంది. కానీ.. పంట సగం వరకు ఎండిపోయింది.       - సంతోష్, గిరిగాం, తాంసి మండలం
 
ధర ఎక్కువ.. దిగుబడి తక్కువ..
చేనులో పంట దిగుబడి తగ్గింది. మార్కెట్‌లో ధర మాత్రం పెరిగింది. కానీ.. ఈ ఏడాది విత్తనం, ఎరువుల, కూలీల ధర గతం కంటే ఎక్కువగా ఉంది. వర్షాలు లేక పంట దిగుబడి బాగా తగ్గింది. ధర చూసి సంబరపడాలో పంట దిగుబడి చూసి ఏడవలో అర్థం కావడం లేదు. నాలుగెకరాల్లో 10 క్వింటాళ్ల వరకు రావాల్సింది. మూడున్నర క్వింటాళ్లకు తగ్గింది.
 - గంగుల నర్సింగ్, రమాయి గ్రామం, ఆదిలాబాద్ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement