![Union Minister Kishan Reddy Review On NAFED And Markfed Departments - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/15/Kishan-Reddy.jpg.webp?itok=19X-EwNL)
సాక్షి, హైదరాబాద్: కంది, పత్తి రైతుల సమస్యలపై రాష్ట్ర,కేంద్ర అధికారులతో చర్చించామని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నాఫెడ్, మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కందుల కొనుగోళ్లపై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. దీనిపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కందుల కందుల కొనుగోళ్లపై నిధులు వెచ్చించకపోవడంతో అత్యధిక మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. 51,600 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిందని తెలిపారు.
మొత్తం భారం కేంద్రం మీదే..
రాష్ట్ర ప్రభుత్వం ఒక్క టన్ను కందులను కూడా కొనుగోలు చేయలేదన్నారు. మరో లక్ష టన్నులు కొనుగోలు చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరిందని తెలిపారు. తెలంగాణ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో మరో లక్ష టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారం కేంద్రం మీదే వేసిందన్నారు. కేంద్రం 20 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. 100 జిల్లాల్లో నీటి ఎద్దడిని తగ్గించేందుకు కేంద్రం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు.
కరోనాపై ఆందోళన వద్దు..
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. చైనా సరిహద్దు దేశం అయినా.. మన దేశంలో తీవ్రత తక్కువగానే ఉందన్నారు. పారామిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా విషయంలో ఆందోళన వద్దని.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు కిషన్‌రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment