nafed
-
ఉల్లి సేకరణ నిలిపేయాలంటూ డిమాండ్
నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) ఉల్లి సేకరణను నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో ఉల్లి కృత్రిమ కొరతను అరికట్టేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి ఉల్లిని సేకరిస్తోంది. అయితే రైతులు దీన్ని నిలిపేయాలని కోరుతున్నారు. వీరి డిమాండ్ మరింత పెరిగితే ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆటంకం కలిగే ప్రమాదముందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దేశవ్యాప్తంగా ఉల్లిధరలు పెరుగుతున్న నేపథ్యంలో నాఫెడ్ బృందం ఇటీవల కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ఆయా కేంద్రాల నిర్వహణ లోపాలపై చర్యలు చేపడుతోంది. దాంతోపాటు పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిల్వలను పెంచుకుంటోంది. ప్రభుత్వం ఉల్లి సేకరణ పెంచితే ధరలు కట్టడి అవుతాయి. కానీ, అలా చేస్తే రైతుల పంటకు సరైన ధర లభించదనే ఉద్దేశంతో ఉల్లి సేకరణను నిలిపివేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిచోట్ల వ్యాపారస్థులు సిండికేట్‌గామారి ఇదే అదనుగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్ డిఘోలే ఇటీవల ఒక వీడియోలో మాట్లాడుతూ..‘రైతులు ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లకు కిలో రూ.40 కంటే తక్కువ ధరకు ఉల్లిని విక్రయించకూడదు. భవిష్యత్తులో ఉల్లి ధరలను తగ్గించేందుకు బఫర్ స్టాక్‌ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: ‘ప్రమాదంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ’దేశీయంగా ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతోంది. 65 శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40 శాతం కోల్పోతాయి. కుళ్లిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా. -
నారికేళం ‘ధర’హాసం
సాక్షి అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధర పతనమై రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయించింది. దీంతో కొబ్బరి ధరలు అమాంతంగా పెరిగాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తరువాత పచ్చి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.రెండు వేల వరకు ధర పెరగ్గా.. ఎండు కొబ్బరి క్వింటాల్‌కు రూ.500 చొప్పున పెరగడం విశేషం. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉభయ గోదావరి జిల్లాలలోనే అత్యధికంగా 1.78 లక్షల ఎకరాల్లో ఉంది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం సగటున 106.9 కోట్ల కాయల దిగుబడిగా వస్తోంది. ఇందులో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.03 లక్షల ఎకరాలు, కాకినాడ జిల్లాలో 20 వేల ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 18,754 ఎకరాల్లో సాగు కొబ్బరి సాగవుతోంది. నాఫెడ్ కేంద్రాలు.. వరుస పండుగలతో.. రాష్ట్రంలో కొబ్బరి మార్కెట్ ధరలు అంబాజీపేట మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. కొబ్బరి ధరలు పతనం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కోనసీమ జిల్లాలో నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయించింది. ప్రస్తుతానికి అంబాజీపేట మార్కెట్ యార్డు కేంద్రంగా కార్యకలాపాలకు అధికారులు సిద్ధమయ్యారు. తొలిసారి ఆర్బీకేల ద్వారా కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి)ను క్వింటాల్‌ను రూ.10,860, బాల్ కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్ రూ.11,750 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో కొబ్బరి మార్కెట్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఈ పరిస్థితుల్లో స్థానిక వ్యాపారులు దిగి వచ్చి ధరలు పెంచారు. మరోవైపు దసరా, దీపావళి, కార్తీక మాసం రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో పచ్చికాయ, ముక్కుడు కాయల ధరలు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో వెయ్యి కాయల ధర రూ.8 వేల నుంచి రూ.8,500 వరకు ఉంది. గడచిన 10 రోజులలో ధర రూ.2 వేల వరకు పెరగడం విశేషం. -
ధాన్యంలాగే కొబ్బరీనూ..
సాక్షి అమలాపురం/ అంబాజీపేట : కొబ్బరి కొనుగోలులో దళారుల వ్యవస్థను తొలగించడంతోపాటు రైతులకు రవాణా, కూలి ఖర్చుల భారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొబ్బరి ధరలు తగ్గిన నేపథ్యంలో నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ఆధ్వర్యంలో శనివారం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లుగానే ఈ కేంద్రాల్లో కూడా కొబ్బరి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. గతంలో మార్కెట్ యార్డుల కేంద్రంగా కొబ్బరి కొనుగోలు చేయగా, ఈసారి ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. గతంలో ఇలా.. గతంలో రైతులు మార్కెట్ యార్డులకు ఎండుకొబ్బరిని తీసుకువెళ్లాల్సి వచ్చేది. రోజుంతా అక్కడే కళ్లాలలో ఎండబెట్టేవారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే కొనేవారు. లేదంటే వెనక్కి తెచ్చుకోవాల్సిందే. ఇది రైతులకు నష్టాన్ని కలగజేసేది. ఒకవేళ కొనుగోలు చేసినా నాఫెడ్‌కు తీసుకువెళ్లడానికి రవాణా ఖర్చుతోపాటు ఎండబెట్టడం, మూటలు కట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చేది. ప్రస్తుతం రోజుకు కూలి ఖర్చు రూ.600లు కాగా.. యార్డు వరకు తీసుకొస్తే రూ.వెయ్యి వరకు కూలి ఇవ్వాల్సి వచ్చేది. అధికారులే కళ్లాలు వద్దకు వచ్చి నాణ్యత నిర్ధారించి, అక్కడే కొనుగోలు చేయనున్నారు. ఇలా కొన్న కొబ్బరిని రైతులే సమీపంలోని నాఫెడ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. రైతులపై ఈ భారం మాత్రమే పడనుంది. కూలి ఖర్చులు కలిసిరావడం అంటే రైతులకు క్వింటాల్‌కు రూ.500ల నుంచి రూ.800లు వరకు మిగలనుంది. రైతులే సొంతంగా ఎగుమతి చేస్తే కూలి ఖర్చులు కూడా కలిసివస్తాయి. ఈ విధానంవల్ల దళారుల పాత్ర దాదాపు లేనట్లే. గతంలో ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన కొబ్బరి 90 శాతం దళారులదే. ఇప్పుడు రైతులు నేరుగా లబ్ధిపొందనున్నారు. ♦ నాఫెడ్ కేంద్రాలు సేకరించిన కొబ్బరిని ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ♦ రైతులు ముందుగా ఆర్బీకేల్లో పేరు, ఇతర వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆర్బీకేల ద్వారా కళ్లాల్లోనే కొనుగోలు.. ♦ ఎకరాకు నెలకు రెండు కొబ్బరి బస్తాల (క్వింటాల్) చొప్పున కొనుగోలుకు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు రైతులకు ధ్రువీకరణ పత్రాలిస్తారు. ♦ రైతుల వివరాలతో పాటు, కొబ్బరి విక్రయాలకు సంబంధించి కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైనిస్ అండ్ ప్రొక్యూర్మెంట్ (సీఎం యాప్)లో నమోదు చేస్తారు. ♦ దీని ఆధారంగా నాఫెడ్‌కు ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఉన్న ఆయిల్ ఫెడ్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి కొబ్బరి కొనుగోలు చేస్తారు. సర్కారు ప్రత్యేక చొరవతో కేంద్రం అనుమతి.. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇక్కడ సగటున 106.90 కోట్ల కాయలు దిగుబడిగా వస్తాయని అంచనా. తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి పోటీవల్ల ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడంతో కొబ్బరి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. వెయ్యి కాయల ధర రూ.7 వేలు ఉంది. ధరలు పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకొచ్చింది. జిల్లాలో తొలుత అంబాజీపేటలోను, తరువాత కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ముమ్మిడివరం, తాటిపాక, రావులపాలెం, నగరం మార్కెట్ యార్డుల్లో వీటిని ప్రారంభించనున్నారు. మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి)ని క్వింటాల్‌కు రూ.10,860లు, బాల్‌కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్ రూ.11,750 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఎండు కొబ్బరి ధర రూ.8 వేలు, కురిడీ కొబ్బరి గుడ్డు రూ.తొమ్మిది వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. ఈ కేంద్రాల ఏర్పాటువల్ల బహిరంగ మార్కెట్లో కొబ్బరికాయకు ధర వస్తోందని, స్థానికంగా నిల్వ ఉన్న కొబ్బరి మార్కెట్‌కు వెళ్తే వచ్చే దసరా, దీపావళికి డిమాండ్ వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. షెడ్యూలు ప్రకారం కొనుగోలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేస్తాం. రైతులు మార్కెట్ యార్డుల వద్దకు వచ్చి కొబ్బరి ఎండబెట్టి అమ్మకాలు చేయాల్సిన అవసరం ఉండదు. మేం కొనుగోలు చేసిన తరువాత సమీపంలో యార్డుకు తరలిస్తే సరిపోతోంది. సీఎం యాప్‌లో నమోదును బట్టి ఆయా ఆర్బీకేలకు ఒక షెడ్యూలు పెట్టుకుని కొబ్బరి కొనుగోలు చేస్తాం.– యు. సుధాకరరావు, మేనేజర్, ఆయిల్‌ఫెడ్ -
ఊరట: రూ. 50లకు కిలో టమాటా: కేంద్రం ఆదేశం
ఆగస్టు 15 నుంచి కిలోకు రూ. 50 రిటైల్ ధరకు టమోటాలను విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవలి కాలంలో టమాట ధరలు దేశ వ్యాప్తంగా భగ్గుమన్న నేపథ్యంలో కేంద్రం మరోసారి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED)ని ఆదేశించింది. మార్కెట్లో పెరుగుతున్న ధరలు, సరసమైన ధరలో టమాటాలను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా ఈ చర్య తీసుకుంది. (టమాట భగ్గు: 15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం ) ఇటీవలి కాలంలో టమాటా ధర క్రమంగా పెరుగుతూ వచ్చి డబుల్ సెంచరీ దాటేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీలో ప్రాంతంలో జూలై 14న టమాటా రిటైల్ విక్రయాలు ప్రారంభం కాగా ఆగస్టు 13 వరకు మొత్తం 15 లక్షల కిలోల పంటను రెండు ఏజెన్సీలు కొనుగోలు చేశాయని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) -
టమాటా ధర కిలో రూ.80
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే కిలో రూ.250 దాకా పలికిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం దేశంలో సగటు ధర కిలోకు రూ.117గా ఉంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీపై టమాటాలు విక్రయిస్తోంది. పలు నగరాల్లో కొన్ని రోజులపాటు కిలో రూ.90కి విక్రయించగా, ఆదివారం నుంచి రూ.80కే అందుబాటులోకి తీసుకొచి్చంది. భారత జాతీయ సహకార వినియోగదారుల సంఘం(ఎన్సీసీఎఫ్), భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సంఘం(నాఫెడ్) ద్వారా ప్రభుత్వం టమాటాలను రాయితీపై విక్రయిస్తోంది. ప్రభుత్వ జోక్యంతో రిటైల్ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయని అధికార వర్గాలు చెప్పాయి. ఆదివారం ఢిల్లీ, నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, పాట్నా తదితర నగరాల్లో కిలో టమాటాలు రూ.80 చొప్పున విక్రయించారు. సోమవారం నుంచి మరికొన్ని నగరాల్లో ఈ రాయితీ ధరతో టమాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ.178, ముంబైలో రూ.150, చెన్నైలో రూ.132 చొప్పున పలుకుతోంది. సాధారణంగా జూలై–ఆగస్టు, అక్టోబర్–నవంబర్‌లో టమాటా ధరలు పెరుగుతుంటాయి. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం వల్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి, కర్ణాటకలోని కోలార్, మహారాష్ట్రలోని సంగనేరీ నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సేకరిస్తోంది. -
త్వరలో కొత్త సహకార విధానం
న్యూఢిల్లీ: దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్య సాధనలో సహకార సంఘాలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్రం త్వరలో కొత్త సహకార విధానాన్ని ప్రకటిస్తుందనీ, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. వచ్చే అయిదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీ)ల సంఖ్య 65 వేల నుంచి 3 లక్షలకు పెరగనుందన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతి 10 గ్రామాలకు ఒక పీఏసీ ఉండగా రానున్న అయిదేళ్లలో ప్రతి రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ సహకార యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ప్రభుత్వం సహకార ఉమ్మడి సేవా కేంద్రాల(కోఆపరేటివ్ కామన్ సర్వీస్ సెంటర్లు)ను, జాతీయ డేటాబేస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు. సహకార వ్యవస్థలు రాష్ట్రాల పరిధిలోనే కొనసాగుతాయని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి ఘర్షణకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ చట్టాన్ని సవరించడంతోపాటు పీఏసీలను ఆధునీకరించి, డిజిటలైజ్ చేస్తామన్నారు. పీఏసీల అకౌంట్ల కంప్యూటరీకరణలో స్థానిక భాషలను వినియోగించుకోవడతోపాటు జిల్లా సహకార బ్యాంకులతో, నాబార్డుతో అనుసంధానం చేస్తామన్నారు. పీఏసీలు రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీవో)లుగా, సభ్యుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తాయని తెలిపారు. జాతీయ సహకార సమ్మేళనం మొట్ట మొదటి సమావేశంలో అమిత్ షా శనివారం ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వివిధ సహకార సంఘాలకు చెందిన 2,100 మంది ప్రతినిధులు హాజరు కాగా, సుమారు మరో 6 కోట్ల మంది ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. చదవండి: న్యాయమూర్తులకు నైతికతే కీలకం -
సహకార సంస్థల మెగా సదస్సు ప్రారంభం: కొత్త కార్యక్రమానికి శ్రీకారం
Cooperative Conference: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రి ఇవాళ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శాఖ ఆధ్వర్యంలో శనివారం సహకార సంస్థల మెగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలకు చెందిన 8 కోట్ల మంది సభ్యులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడనున్నారు. ఈ వేదిక మీద అమిత్ షా ప్రసంగించనున్నారు. (చదవండి: నరేంద్ర మోదీ ఒక హీరో.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ప్రశంసలు వర్షం) ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ సమావేశం జరగుతుండగా.. ఈ కాన్ఫరెన్స్‌ను సహకార సంస్థలు ఐఎఫ్ఎఫ్సీఓ, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమూల్, సహకార భారతి, నాఫెడ్ (ఎన్ఏఎఫ్ఈడీ), క్రిబ్చో (KRIBHCO)తోపాటు ఇతర సంస్థలు నిర్వహిస్తున్నాయి. చదవండి: మూడే రోజులు... ఎన్నో అంశాలు -
పప్పు దినుసుల ధర తగ్గేది ఎప్పుడు ?
వెబ్‌డెస్క్ : దేశంలో కంది, మినప, పెసర, శనగ, మసూరీ పప్పు దినులులు దాదాపు 27 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సమృద్ధిగా నిల్వలు ఉన్నా పప్పు దినుసుల ధరలు మాత్రం సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటుంన్నాయి. వంద రూపాయలు పెట్టనిదే కేజీ పప్పు దొరకని పరిస్థితి నెలకొంది. కేంద్రం నజర్ నిత్యవసర వస్తువుల పెరుగుదలపై కేంద్రం నజర్ పెట్టింది. ముఖ్యంగా పప్పు దినుసుల ధరల పెరుగుదలను కంట్రోల్ చేసేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో పప్పు ధాన్యాల నిల్వలు ఎంతున్నాయనే అంశంపై దృష్టి సారించింది. దీంతో రాష్ట్రాల వారీగా పప్పు ధాన్యం నిల్వలపై ఆరా తీసింది. ధరల భారం ఓ వైపు కరోనా గండం వెంటాడుతుండగా మరో వైపు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యుల రెక్కలు విరిచేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోలు, మంచి నూనెల ధరలు ఆకాశాన్ని తాకుంతుండగా నెమ్మదిగా పప్పు దినుసుల ధరలు కూడా పైపైకి చేరుకుంటున్నాయి. వంట నూనెల వినియోగం ఇప్పటికే తగ్గిపోయింది. అయితే పప్పు దినుసుల ధరల పెరుగుదల గుబులు పట్టిస్తోంది. గడిచిన రెండేళ్లుగా అన్ని రకాల పప్పు ధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో జనవరి నుంచి జూన్ వరకు కంది, మినప, పెసర పప్పులు కేజీ ధరపై రూ. 10 అదనంగా పెరిగింది. ఈ పప్పు దినుసుల్లో తక్కువ రకం ధరలే రూ. 110కి పైగా ఉన్నాయి. ఇంతకు మించి ధరలు పెరిగితే సామాన్యులు తట్టుకోవడం కష్టమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. లెక్కలు చెప్పండి ఏ రాష్ట్రంలో ఏ పప్పు ధాన్యం ఎంత నిల్వ ఉందో చెప్పాలంటూ రాష్ట్రాలను కోరింది కేంద్రం. దీని ఆధారంగా దేశ వ్యాప్తంగా 28.66 లక్షల టన్నుల పప్పు ధాన్యం నిల్వలు ఉన్నట్టుగా తేలింది. ఈ వివరాలన్నీ నాఫెడ్ వెబ్సైట్లో పొందు పరిచింది. ఎక్కడైన పప్పు దినుసుల నిల్వలు తగ్గిపోతే మరొక చోటు నుంచి కొనుగోలు చేయాలని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కంది, పెసర, మినప పప్పు ధరలు పెరగకుండా చూడాలంటూ కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రకటనలకే పరిమితమా గతంలో మంచి నూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం సమీక్ష నిర్వహించింది. ధరలు తగ్గించేందుకు పన్నుల కేటగిరీల్లో మార్పులు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. అయితే క్షేత్ర స్థాయిలో ధరలు ఏమీ తగ్గలేదు. డిసెంబరు వరకు ఆయిల్ ధరలు తగ్గవని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు పప్పు ధాన్యాల విషయంలోనూ ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి : Oil Prices: అమెరికాలో కరువు.. ఇండియా వంటగదిలో పిడుగు -
మరో లక్ష టన్నుల కందుల కొనుగోళ్లు..
సాక్షి, హైదరాబాద్: కంది, పత్తి రైతుల సమస్యలపై రాష్ట్ర,కేంద్ర అధికారులతో చర్చించామని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నాఫెడ్, మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కందుల కొనుగోళ్లపై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. దీనిపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కందుల కందుల కొనుగోళ్లపై నిధులు వెచ్చించకపోవడంతో అత్యధిక మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. 51,600 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిందని తెలిపారు. మొత్తం భారం కేంద్రం మీదే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క టన్ను కందులను కూడా కొనుగోలు చేయలేదన్నారు. మరో లక్ష టన్నులు కొనుగోలు చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరిందని తెలిపారు. తెలంగాణ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో మరో లక్ష టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారం కేంద్రం మీదే వేసిందన్నారు. కేంద్రం 20 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. 100 జిల్లాల్లో నీటి ఎద్దడిని తగ్గించేందుకు కేంద్రం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. కరోనాపై ఆందోళన వద్దు.. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. చైనా సరిహద్దు దేశం అయినా.. మన దేశంలో తీవ్రత తక్కువగానే ఉందన్నారు. పారామిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా విషయంలో ఆందోళన వద్దని.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు కిషన్‌రెడ్డి సూచించారు. -
కోనసీమలో నాఫెడ్ కేంద్రం?
సర్వేకు వస్తున్న ఆయిల్‌ఫెడ్ అధికారులు స్థానిక కొబ్బరి రైతులకు సమాచారం అమలాపురం/ అంబాజీపేట : కోనసీమలో మరోసారి నాఫెడ్ కేంద్రం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఆయిల్‌ఫెడ్ అధికారులు రెండు, మూడు రోజుల్లో మార్కెట్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు స్థానిక రైతు సంఘం ప్రతినిధులకు సమాచారం అందింది. అంబాజీపేట మార్కెట్లో ఎండు కొబ్బరి క్వింటాల్ ధర రూ.7 వేల వరకూ ఉంది. ఇదే సమయంలో వెయ్యి పచ్చికాయల ధర రూ.7 వేలు ఉంది. పచ్చికాయ, ఎండుకొబ్బరి ధరలు ఒకేలా ఉండడంతో రైతులు ఎండుకొబ్బరి తయారీ దాదాపు నిలిపివేశారు. గత ఫిబ్రవరిలో క్వింటాల్ రూ.8.500 ఉండగా, పచ్చికాయ ధర కూడా రూ.8,500 ఉంది. మార్చి నాటికి ఎండుకొబ్బరి ధర రూ.8 వేలకు, పచ్చికాయ ధర రూ.7 వేలకు తగ్గింది. ఏప్రిల్ నెలలో ఎండుకొబ్బరి ధర రూ.7,800, పచ్చికాయ ధర రూ.7,300 తగ్గింది. తాజాగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు రూ.ఏడు వేలకు చేరాయి. దీంతో రైతుల్లో కలవరం మొదలైంది. సిండికేట్‌గా మారిన వ్యాపారులు? డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఎండు కొబ్బరిని కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,500 చొప్పున కొనుగోలు చేస్తారు. బయట మార్కెట్ కన్నా ఇది తక్కువే అయినా కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే ధర మరింత పతనమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమలో కాకున్నా కనీసం కొబ్బరి వాణిజ్య కేంద్రమైన అంబాజీపేటలోనైనా నాఫెడ్ కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఈ విషయంపై భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల జమ్మిల్ నుంచి వివరాలు సేకరించారు. మార్కెట్లో ధర ఉంది కదా? ఇప్పుడెందుకు కేంద్రాలని ఆయన ప్రశ్నించారు. నెల రోజుల నుంచి ధర పడిపోతోందని, కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే రైతులు మరింత నష్టపోతారని బీకేఎస్ ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ఆయన నాఫెడ్‌కు నోడల్ ఏజెన్సీ అయిన ఆయిల్‌ఫెడ్ అధికారులకు ఈ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. ఇందుకు స్పందించిన ఆ సంస్థ అధికారులు కోనసీమలో మార్కెట్ సర్వే చేసేందుకు రెండు, మూడు రోజుల్లో వస్తున్నట్టు స్థానిక రైతు సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో... జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాల్లో పెద్దగా కొనుగోళ్లు లేకున్నా.. రైతులకు కొంతలో కొంతైనా కనీస మద్దతు ధర దక్కుతోంది. ఇవి లేకుంటే ఇప్పుడున్న ధర కూడా రాదని రైతుల అభిప్రాయం. కొబ్బరి రైతులు సైతం ఇదే తరహాలో తమకు నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
మద్దతుకే లొల్లి..!
మహబూబ్‌నగర్ వ్యవసాయం,గద్వాల న్యూస్‌లైన్: ఈ ఏడాది వేరుశనగ పంటను సాగుచేసిన రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా త యారైంది. వర్షాలు సంమృద్దిగా కురవడంతో మంచిరోజులు వచ్చాయని రైతులు భావించారు. గత రబీలో ప ల్లీ పంటను వేసిన వారికి కాస్తో కూస్తో లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందనే భావనతో ఈ రబీలో 1.10 లక్షల హెక్టార్లలో వేరుశనగపంటను సాగు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పంటకు తెగుళ్లు సోకాయి. దిగుబడి సగానికి తగ్గిపోయింది. వాస్తవానికి చెట్టుకు 20 కాయల వరకూ వస్తే మంచి కాపుగా భావిస్తారు. కాన్నీ పలు ప్రాంతాల్లో మొక్కకు ఏడునుంచి 10 కాయలకు మించి లేవు. మరోవైపు మద్దతుధర రాక రైతులు తికమక పడుతున్నారు. ఈ స్థితిలో రైతుల నుండి పంటను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనాల్సి ఉంటుంది. అలా ఇప్పటివరకు వేరుశనగ కొనే ప్రయత్నం జరగలేదు. కొన్ని చోట్ల కేంద్రాలు తెరుస్తామని చెప్పినా ఇంకా అవి ప్రారంభం కాలేదు. దీంతో అన్నదాతలు తమకు తోచిన ధరకు ఇచ్చేస్తున్నారు. విత్తనానికి రూ.4,500..రైతు పంటకు మాత్రం రూ.2,500 ? రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ధరతో ఈ ఏడాది వేరుశనగ విత్తనాలను సరాఫరా చేసి క్వింటాకు రూ.4500 తీసుకుంది. ఇప్పుడు పంట ధర మాత్రం రూ. 2500 దాటడం లేదు.రైతులు తెచ్చిన పంట తడిగా ఉందని, నాపలు ఎక్కువగా ఉన్నాయంటూ కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు ధరను పెరగనివ్వడం లేదు. వేరుశనగకు ప్రభుత్వం రూ.4వేలు మద్దతు దరను నిర్ణయించింది.జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1.60 లక్షల క్వింటాళ్లను రైతుల నుండి వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతుల నుండి ఎక్కువగా రూ. 3000 వేల లోపే కొనుగోలు చేశారు.కాగా వచ్చిన దాంట్లో ఒక 10శాతం అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు చూపించి మిగతా 90శాతం ఉత్పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ కర్షకులను నట్టేట ముంచుతున్నారు. తెగుళ్లతో తగ్గిన దిగుబడి గత నెలలో మంచు కురవడంతో వేరుశనగపంటకు తిక్కాకుమచ్చ తెగులు, లద్దెపురుగు ఆశించింది. ఇది దిగుబడిని దెబ్బతీసింది. వీటిని అదుపు చేసేందుకు రైతులు క్రిమిసంహారక మందులకోసం భారీగా పెట్టాల్సి వచ్చింది. ఆయిల్‌ఫెడ్,నాఫెడ్ సంస్థలు కొనుగోలు చేసేనా? మద్ధతు ధర సమస్య వచ్చినప్పుడు ఆయిల్‌ఫెడ్,నాఫెడ్ వంటివి ముందుకు రావాలి. ఇప్పటి వరకు ఈ సంస్థలతో కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించకుంటే నిరసన కార్యాక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. కంట తడే... గద్వాల ప్రాంతంలో వేల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి బోర్లు, బావులు, కాలువల కింద వేరుశనగ పంటను వేశారు. గత మూడు నెలల నుంచి వేరుశనగను విక్రయించేందుకు గద్వాల మార్కెట్ యార్డుకు తీసుకొస్తుండగా మార్కెట్లో వస్తున్న ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. యార్డుకు రోజూ దాదాపు 2 వేల బస్తాల వేరుశనగ వస్తోంది. నవంబర్ నెలలో రూ.3,500 నుంచి రూ.3,700 వరకు క్వింటాలుకు ధరలు వచ్చాయి. డిసెంబర్ నెలలో రూ,3,400 నుంచి రూ.3,500 వచ్చింది. జనవరి నెలలో సైతం రూ.3,600 నుంచి రూ. 3,800 వరకు వచ్చింది. జనవరిలో ఒక్క 24వ తేదీన ఒక లాట్‌కు అత్యధికంగా రూ.4,010 వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం వేరుశనగకు రూ.4 వేలు మద్దతు ధర ప్రకటించినా వ్యాపారులనుంచి ఆ ధర పలకడం లేదు. ఇక గద్వాల మార్కెట్లో వారం రోజుల క్రితం ప్రభుత్వం ఏపీ ఆయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే తేమ 8 శాతంగా, మట్టి, ధూళి క్వింటాలుకు కేవలం రెండు కేజీలు, నాపలు 4 శాతంగా ఉండాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధన ప్రకారం రైతుల వేరుశనగ ఉండడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయినప్పటికీ రైతులు అక్కడ అమ్ముకునే పరిస్థితి లేదు. తిక్కఆకుమచ్చ తెగులు ముంచింది నేను మూడెకరాల్లో వేరుశనగ సాగుచేశాను.కాగా రాత్రి వాతావరణం చల్లగా ఉంటూ, ఆధికంగా మంచు కురవడంతో పంటకు తిక్క ఆకుమచ్చ తెగులు సోకింది.మందులకు రూ.10వేల ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దిగుబడి కూడా అంతంత మాత్రమే వచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలి. - శేఖర్, వడ్డేమాన్ అప్పులు తీర్చే పరిస్థితే లేదు నేను 30 బస్తాల వేరుశనగ పంటను మహబూబ్‌నగర్ మార్కెట్‌యార్డుకు తీ సుకువచ్చాను.ధాన్యాంభాగాలేదని రూ. 2,400 వంతున చెల్లించారు. నేను ఈ పంట సాగు కోసం రూ.25వేల వరకు ఖర్చు చేశాను.కాగా ఇంత తక్కువ ధర చెల్లించడంతో చేసిన అప్పులు కూడా తీర్చే పరిస్థితి లేకుండా పోయింది. - మాణిక్యం...దౌల్తాబాద్