న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే కిలో రూ.250 దాకా పలికిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం దేశంలో సగటు ధర కిలోకు రూ.117గా ఉంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీపై టమాటాలు విక్రయిస్తోంది. పలు నగరాల్లో కొన్ని రోజులపాటు కిలో రూ.90కి విక్రయించగా, ఆదివారం నుంచి రూ.80కే అందుబాటులోకి తీసుకొచి్చంది.
భారత జాతీయ సహకార వినియోగదారుల సంఘం(ఎన్‌సీసీఎఫ్), భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సంఘం(నాఫెడ్) ద్వారా ప్రభుత్వం టమాటాలను రాయితీపై విక్రయిస్తోంది. ప్రభుత్వ జోక్యంతో రిటైల్ మార్కెట్‌లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయని అధికార వర్గాలు చెప్పాయి. ఆదివారం ఢిల్లీ, నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, పాట్నా తదితర నగరాల్లో కిలో టమాటాలు రూ.80 చొప్పున విక్రయించారు.
సోమవారం నుంచి మరికొన్ని నగరాల్లో ఈ రాయితీ ధరతో టమాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో బహిరంగ మార్కెట్‌లో టమాటా కిలో రూ.178, ముంబైలో రూ.150, చెన్నైలో రూ.132 చొప్పున పలుకుతోంది. సాధారణంగా జూలై–ఆగస్టు, అక్టోబర్–నవంబర్‌లో టమాటా ధరలు పెరుగుతుంటాయి. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం వల్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి, కర్ణాటకలోని కోలార్, మహారాష్ట్రలోని సంగనేరీ నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను
సేకరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment