ఆగస్టు 15 నుంచి కిలోకు రూ. 50 రిటైల్ ధరకు టమోటాలను విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవలి కాలంలో టమాట ధరలు దేశ వ్యాప్తంగా భగ్గుమన్న నేపథ్యంలో కేంద్రం మరోసారి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED)ని ఆదేశించింది. మార్కెట్‌లో పెరుగుతున్న ధరలు, సరసమైన ధరలో టమాటాలను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా ఈ చర్య తీసుకుంది. (టమాట భగ్గు: 15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం )
ఇటీవలి కాలంలో టమాటా ధర క్రమంగా పెరుగుతూ వచ్చి డబుల్ సెంచరీ దాటేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీలో ప్రాంతంలో జూలై 14న టమాటా రిటైల్ విక్రయాలు ప్రారంభం కాగా ఆగస్టు 13 వరకు మొత్తం 15 లక్షల కిలోల పంటను రెండు ఏజెన్సీలు కొనుగోలు చేశాయని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. (ఎల్‌ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి)
Comments
Please login to add a commentAdd a comment