రైతులకు గిట్టుబాటు ధర
రైతులకు గిట్టుబాటు ధర
Published Wed, Sep 28 2016 11:21 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– జిల్లాలో ఐదు మినుముల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
–ఏపీ మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ పరిమళ జ్యోతి వెల్లడి
నూనెపల్లె: రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని ఏపీ మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ పరిమళ జ్యోతి అన్నారు. భారతీయ ఆహార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక టెక్కె మార్కెట్ యార్డులోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాౖటెన పెసలు కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిమళ జ్యోతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5 మినుములు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె, శిరివెళ్ల, పగిడ్యాలలో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో పెసలకు12 శాతం తేమశాతం ఉంటే క్వింటా రూ. 5225 ప్రకారం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. విక్రయానికి వచ్చే రైతులు ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా, పట్టాదారు పాస్‌పుస్తకం తెచ్చుకోవాలని సూచించారు. ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు తెచ్చినా తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌సీఐ మేనేజర్ వినీల్ కుమార్, డీఎస్‌ఎంఎస్ ఏరియా మేనేజర్ రాఘవేంద్ర అప్ప, నంద్యాల మేనేజర్ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement