Saichand's Wife Rajini As Chairman Of Telangana Warehousing Corporation - Sakshi
Sakshi News home page

సాయిచంద్‌ భార్య రజినీకి కీలక బాధ్యతలు.. ​కేటీఆర్‌, మంత్రులు హాజరు

Published Thu, Jul 20 2023 8:04 AM | Last Updated on Thu, Jul 20 2023 11:26 AM

Rajini Saichand As Chairman Of Telangana Warehousing Corporation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నూతన చైర్మన్‌గా రజనీ సాయిచంద్‌ గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. సంస్థ చైర్మన్‌ వి.సాయిచంద్‌ ఇటీవల గుండెపోటుతో మరణించడం తెలిసిందే.

అయితే, సాయిచంద్‌ స్థానంలో ఆయన సతీమణి రజనిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న రజని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరవుతారు. 

ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు,  రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం చెందిన విషయం తెలిసిందే.  చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని కేసీఆర్‌ అన్నారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని.. కళాకారున్ని  కోల్పోయింది. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  

ఇది కూడా చదవండి: సాయిచంద్‌ మృతిపై కేసీఆర్‌ ఆవేదన, హరీష్‌ రావు కంటతడి.. ఆ పేరు శాశ్వతమన్న కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement