Sai Chand
-
సుధీర్ బాబు పెళ్లి వీడియో వైరల్.. మహేశ్ బాబే హైలెట్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో తన పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను అభిమానులతో సుధీర్ పంచుకున్నారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అవుతున్న శింబుహీరో సుధీర్ బాబు.. సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె ప్రియదర్శినితో 2006లో వివాహం అయింది. అయితే, నాటి ఫోటోలకు తన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో' నుంచి ఒక పాటను తీసుకుని వీడియో రూపంలో క్రియేట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. అందులో సుధీర్ బాబు,ప్రియదర్శిని దంపతులను ఆశీర్వదిస్తున్న మహేశ్ బాబు ఫోటో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.నాడు పెళ్లిచూపుల ఫోటో షేర్ చేసిన సుధీర్సుధీర్ బాబు గతంలో కూడా వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ప్రియదర్శిని ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తుందెరో కాదు అంటూనే.. ప్రియదర్శినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పిక్ కూడా పెళ్లిచూపుల ఫోటో అని, తన దగ్గర ఉన్న ఆమె మొదటి ఫోటో ఇదేనని ఆయన పేర్కొన్నారు.2010లో ఏ మాయ చేసావే చిత్రంతో ఒక సపోర్టింగ్ రోల్‌తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'మా నాన్న సూపర్ హీరో' అనే చిత్రంతో అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు సుధీర్ బాబు రానున్నారు. అభిలాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ఈ చిత్రం ఉండనుంది. ఈ మూవీలో సుధీర్ బాబు తండ్రిగా సాయిచంద్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) -
సాయిచంద్ భార్య రజినీకి కీలక బాధ్యతలు.. నేడు స్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నూతన చైర్మన్‌గా రజనీ సాయిచంద్ గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. సంస్థ చైర్మన్ వి.సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించడం తెలిసిందే. అయితే, సాయిచంద్ స్థానంలో ఆయన సతీమణి రజనిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న రజని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరవుతారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం చెందిన విషయం తెలిసిందే. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని కేసీఆర్ అన్నారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని.. కళాకారున్ని కోల్పోయింది. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇది కూడా చదవండి: సాయిచంద్ మృతిపై కేసీఆర్ ఆవేదన, హరీష్ రావు కంటతడి.. ఆ పేరు శాశ్వతమన్న కేటీఆర్ -
సాయిచంద్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
సాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటాం
-
కళాకారుడికి అశ్రునివాళి: ముగిసిన సాయిచంద్ అంత్యక్రియలు
Telangana Folk Singer Sai Chand Last Rites Updates ► గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. వనస్థలీపురం సాహెబ్‌నగర్ శ్మశాసనవాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరిగాయి. చితికి సాయిచంద్ కొడుకు నిప్పంటించారు. ► గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో సాయి చంద్ భార్య భావోద్వేగానికి లోనై రోదించగా.. కేసీఆర్ ఆమెను ఓదార్చారు. ► తెలంగాణ జానపద కళాకారుడు, ఉద్యమ గాయకుడు సాయి చంద్ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్ కంటతడి పెట్టారు. ► తెలంగాణ సమాజం ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయింది. సాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం కేసీఆర్ ► కాసేపట్లో గుర్రం గూడకు ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు ► సాయి చందు పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ► సాయిచంద్ మృతిపై సంతాప ప్రకటన వెలువరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. సాయిచంద్ మృతదేహానికి నివాళులర్పించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ‘‘రాతి గుండెల్ని సైతం కరిగించిన గాత్రం సాయిచంద్‌ది. మా అందరికీ ఆత్మీయుడతను. చనిపోయడనే వార్త జీర్ణించుకోలేక పోతున్నం. ఆయన లేని లోటు తీర్చలేదు. హైదరాబాద్‌లో ఉంటే బ్రతికే వాడేమో!. అత్యంత చిన్న వయస్సులోనే చనిపోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. ► సాయి చంద్ పాటలు అందరినీ కదిలిస్తాయ్: మంత్రి తలసాని ► సాయి చంద్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కంట తడి పెట్టారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ‘‘తమ్ముడు సాయి చంద్ లేడని ఊహించుకుంటేనే బాధ గా ఉంది. చిన్న వయసు లో చనిపోవడం దురదృష్టం. నిజాయితీ గల సైనికుడు సాయి చంద్. తన పాట ఖండాంతరాలు దాటాయి. నా మనుసుకు దగ్గర వ్యక్తి కూడా. చాలా సార్లు మా ఇంటికి వచ్చాడు. సీఎం కెసీఆర్ కూడా తనను ఇంకా ఎక్కువ గౌరవించుకోవాలి అనేవారు. సాయిను మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ► తెలంగాణ ఉద్యమ గాయకుడు, బీఆర్ఎస్ నేత.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. సీఎం కేసీఆర్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. గుర్రంగూడలో ఉన్న ఆయన భౌతికకాయానికి ప్రముఖులు వెళ్లి నివాళులు అర్పించి.. ఆయన కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. కన్నీటితో నివాళులర్పిస్తున్నారంతా. ► తెలంగాణ కళాకారుడు, మలిదశ ఉద్యమ సమయంలో తన గాత్రంతో ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రాజేసిన గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం.. యావత్ తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. కేవలం 39 ఏళ్ల వయసులో.. అదీ ఉన్నపళంగా గుండెపోటుతో కన్నుమూయడాన్ని కుటుంబ సభ్యులు, అతన్ని అభిమానించేవాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఉద్యమ పాట.. ఆగింది -
అతని గొంతు లేకుండా నా సభల్లేవ్: కేసీఆర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సాయిచంద్ హఠాన్మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని.. కళాకారున్ని కోల్పోయింది. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను.. చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మననం చేసుకుంటున్నట్లు తెలిపారాయన. సాయిచంద్ లేకుండా.. అతని గొంతులేకుండా తన సభలు సాగేవి కావని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే నున్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని.. నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని అన్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. హరీష్ రావు కంటతడి సాయిచంద్ హఠాన్మరణం వార్తతో గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలి వెళ్లారు పలువురు నేతలు. వాళ్లలో మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. సాయిచంద్ మృతదేహాన్ని చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు. చిన్నవయసులో కన్నుమూయడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. ఆస్పత్రిలో ఫార్మాలిటీస్ పూర్తికావడంతో గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. ► సాయిచంద్ మృతిపట్ల పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. సాయి చంద్ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది సాయిచంద్ మృతిపట్ల కల్వకుంట్ల తారకరామారావు విచారం వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందని.. యువకుడైన సాయిచంద్ అకాల మరణం చెందడం బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Saddened by the loss of a rare talent and a gifted Singer, Sri #SaiChand garu. His mesmerizing voice graced the Telangana moment, stirring souls with countless inspirational songs. Leaving an indelible mark on our hearts, his legacy will forever be cherished. Our heartfelt… pic.twitter.com/nTJzfLIAeS — Santosh Kumar J (@SantoshKumarBRS) June 29, 2023 తెలంగాణ ఉద్యమ గొంతు మూగబోయిందంటే ఇప్పటికి నమ్మశక్యంగా లేదు.. ఇకముందు ఏ సభలోనూ నీ గొంతు ఉండదు ఇక ఆగిపోయిందంటే ఊహించడానికి కూడా కష్టంగా ఉంది.. నీ గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా తక్కువే అన్నా.... ఉద్యమ గొంతుక నీకు జోహార్లు 🙏🙏🙏🙏 Miss u Anna ఓం శాంతి#SaiChand pic.twitter.com/28fuOF9I5K — Srinivas Nelli BRS (@SrinivasNBRS) June 29, 2023 -
ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం
-
తెలంగాణ కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాట ఊపిరి వదిలింది. తెలంగాణ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకి గురైన ఆయన్ని ఆస్పత్రులకు తరలించగా.. చివరకు ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్‌హౌజ్‌కు నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అయితే.. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురికాగా.. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి విషమించడంతో.. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే ఆలస్యం అయ్యిందని.. సాయిచంద్ మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. వనపర్తి జిల్లా అమరచింత సాయిచంద్ స్వస్థలం. విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరుంది ఆయనకు. ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తిని రగిల్చారు ఆయన. జానపద పాటలతో సాగే పలు టీవీషోలలోనూ ఆయన సందడి చేశారు. ఉద్యమ కళాకారుడి గుర్తింపు పొందిన సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవితో గౌరవించింది తెలంగాణ సర్కార్. తాజాగా అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన కనిపించారు. చిన్నవయసులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ పలువురు కళాకారులు, ఉద్యమకారులు, నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో ఆయనకు గుండెపోటు ఏమీ రాలేదని.. అనారోగ్య సమస్యలేవీ లేదని.. అర్ధరాత్రి భోజనం దాకా కూడా బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు రాజకీయ గురువు ఈయనే! -
అమరజీవి త్యాగాన్ని గుర్తుచేస్తూ... సాయి చంద్ పాదయాత్ర
ప్రముఖ సినీనటుడు సాయి చంద్ ‘మా భూమి’ (1980) చిత్రంతో పరిచయమై, పేరు తెచ్చుకుని ఇటీవల కాలంలో శేఖర్ కమ్ముల ‘ఫిదా’ (2017) చిత్రంలో తెలంగాణ మాండలికంలో తండ్రి పాత్రను గొప్పగా రక్తి కట్టించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకుని 69 ఏళ్లు నిండి 70వ సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా... డిసెంబర్ 15న మదరాసు నుంచి సుమారు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే పడమటి పల్లె గ్రామానికి కాలినడకన ఒంటరిగా బయల్దేరారు. సోమవారానికి ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది. 7వ రోజైన బుధవారానికి కావలికి సమీపంలో కొనసాగింది. పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంటరిగా దీక్ష ప్రారంభించినట్లుగానే సాయిచంద్ తన అనుచరుడు భీమినేని రాయుడుతో తన నడకను మద్రాసు తెలుగు మిత్రుల వీడ్కోలుతో ప్రారంభించారు. మద్రాసు, మైలాపూరులోని స్పీకర్ బులుసు సాంబమూర్తి ఇంటి ఆవరణలో పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహారదీక్ష చేసి భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడానికి శ్రీకారం చుట్టారు. పొట్టి శ్రీరాములు స్మారక స్థలి నుంచి బయలు దేరిన సాయిచంద్ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో, సింగ రాయకొండకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడమటి పల్లెకు నడుస్తూ ఉన్నారు. 1956లో జూన్ 25న సంస్కర్త, పోరాటశీలి త్రిపురనేని రామస్వామి చౌదరి మనవడిగా; ప్రఖ్యాత రచయిత, మేధావి త్రిపురనేని గోపీచంద్ కుమారుడిగా సాయిచంద్ జన్మించారు. తొలిదశ నుంచీ అభ్యుదయ భావాలు పుష్కలంగా ఉన్న సాయిచంద్ బాల్యం విజయవాడలో గోరాగారి నాస్తిక కేంద్రంలో సాగింది. రచయిత, గాయకుడు కూడా అయినటువంటి సాయిచంద్ ప్రస్తుత సమాజానికి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చెయ్యాలని ఈ నడక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 1876లో ధాత కరువు వచ్చి తిండీ, నీళ్ళు లేక ప్రజలు, పశువులు అలమటించాల్సి వచ్చింది. అప్పట్లో కనిగిరి తాలూకాలోని పడమటి పల్లె అనే కుగ్రామం నుంచి బతుకు తెరువు కోసం పొట్టి శ్రీరాములు కుటుంబం తమిళ సీమకు తరలి వెళ్లింది. మదరాసు నగరం జార్జి టౌన్‌లోని అన్నా పిళ్ళై వీధిలో 163వ నంబరు గల గృహంలో 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు. శ్రీరాములుకు 12 ఏళ్ళు రాకుండానే తండ్రి గురవయ్య గతించారు. ప్రాథమిక విద్య మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలోని విక్టో రియా జూబిలీ టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకున్నారు. 1920 ప్రాంతంలో శానిటరీ ఇంజనీరింగ్ చదువు కార ణంగా రైల్వే శానిటరీ ఇంజనీరుగా బొంబాయిలో ఉద్యోగం లభించింది. ఆ సమయంలో తల్లి, భార్య, ఒక కుమారుడు చాలా తక్కువ వ్యవధిలో కనుమరుగవడం గొప్ప విషాదం. పదేళ్ళ తరువాత గాంధీజీ ప్రభావానికి లోనైన తర్వాత 1930 ఏప్రిల్‌లో ముఖాముఖి కలిశారు. గాంధీజీ అనుమతి పొంది, ఉద్యోగానికి అదే నెలలో రాజీనామా చేసి సబర్మతీ ఆశ్రమం బయలుదేరారు. ఇదీ స్థూలంగా పొట్టి శ్రీరాములు జీవిత నేపథ్యం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరికతో తొలి సమావేశం బాపట్లలో 1913లో జరిగింది. ఆ తరువాత నాలుగు దశాబ్దాలకు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు ఎందుకు బలిపెట్టవలసి వచ్చిందో చరిత్రలోకి వెళ్లి చూడాలి. తెలుగు వారి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎస్కే ధార్ కమీషన్ (1948), జేవీపీ కమిటీ (1949), మరో మూడు కమిటీలు రిపోర్టులిచ్చాయి. అయితే సి. రాజగోపాలా చారి, జవహర్లాల్ నెహ్రూ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటివారి సొంత ఆలోచనల కారణంగా చాలా పరిణామాలు సంభవించాయి. గాంధీజీకి వియ్యంకుడై 1952 జనవరి 26 దాకా అధికారం చలాయించిన, సొంత భాష ప్రయోజనాల కోసం తపించిన తమిళుడైన సి. రాజగోపాలాచారి తెలుగు వారికి పెద్ద రాష్ట్రం ఏర్పడటాన్ని వ్యతిరేకించారంటారు. బెంగాల్ వంటి ప్రాంతాల్లో మాదిరిగా కమ్యూనిస్టు పార్టీ తెలుగు ప్రాంతంలో స్థిరపడి తనకి ఇబ్బంది కలిగించకూడదని నెహ్రూ భావనలు, నీలం సంజీవ రెడ్డి స్థానిక రాజకీయ ప్రయోజనాలు వెరసి రాష్ట్ర అవతరణను అడ్డుకున్నాయి. వీటన్నిటినీ గమనించిన పొట్టి శ్రీరాములు చలించి తన వంతుగా నిరాహారదీక్షకు దిగారు. దీక్ష ప్రారంభించిన తర్వాత కూడా అదేమీ పెద్ద ప్రభావం చూపబోదని పలు నివేదికలు మదరాసు నుంచి ఢిల్లీ వెళ్ళాయి. అయితే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ అయిన తర్వాతనే తెలుగువారి మనోభీష్టం బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఆ కారణంగానే 1956లో తెలుగు, తమిళం, కన్నడం మలయాళం భాషలవారికి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇంతటి ఘనమైన త్యాగ చరిత్రను, పొట్టి శ్రీరాములు వంటి సాధారణవ్యక్తి నిరుపమాన త్యాగాన్ని తెలుగు వారికి గుర్తు చెయ్యాలని 66 ఏళ్ళ అవివాహితుడైన సాయి చంద్ తన కాలినడకతో తెలియచెప్పాలని ప్రయత్నిస్తున్నారు! (క్లిక్ చేయండి: కొత్త సంవత్సరం బాగుంటుందా?) - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి -
నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’
సాక్షి, హైదరాబాద్: ‘మా భూమి’ ఒక సినిమా మాత్రమే కాదు. ఒక చారిత్రక దృశ్యకావ్యం. తెలుగు సినీచరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రయోగం. నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అకృత్యాలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమున్నతంగా ఎత్తిపట్టిన సామాజిక చిత్రం. నలభై రెండేళ్ల క్రితం విడుదలైన ‘మా భూమి’సినిమా ఇప్పటికీ ప్రేక్షాకాదరణను పొందుతూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఒక చర్చనీయాంశం. సాయుధపోరాటాన్ని, తెలంగాణలో పోలీస్ యాక్షన్ కాలాన్ని ‘మాభూమి’లో చిత్రీకరించారు. రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలను, హింసను చూసిన హైదరాబాద్ రాజ్యం పోలీసు యాక్షన్‌తో భారత యూనియన్‌లో భాగమైంది.ఆ నాటికి ఒక కీలకమైన దశాబ్ద కాలాన్ని అద్భుతమైన మా భూమి సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు చిత్ర నిర్మాత, సంగీత దర్శకులు బి. నర్సింగ్‌రావు. అప్పటి అనుభవాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... నిర్మాత నర్సింగరావుతో నటుడు సాయిచంద్ అదొక ప్రయోగం.. ‘మా భూమి’ సినిమా ఒక ప్రయోగం.అప్పటి వరకు సినిమా తీసిన అనుభవం లేదు. నటీనటులు కూడా అంతే. స్టేజీ ఆర్టిస్టులు. సాయిచంద్ బహుశా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. క్రికెట్ ఆడుతుండగా తీసుకెళ్లాం, ఆయనకు అదే మొదటి సినిమా. కాకరాల, భూపాల్‌రెడ్డి, రాంగోపాల్, తదితరులంతా రంగస్థల నటులు. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు గౌతమ్‌ఘోష్ అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈ సినిమా కోసం పని చేశాం. ►1978 నుంచి 1980 వరకు సినిమా నిర్మాణం కొనసాగింది. చిత్రం షూటింగ్ ప్రారంభోత్సం నుంచి లెక్కిస్తే ఇప్పటికి 44 ఏళ్లు. విడుదలైనప్పటి నుంచి అయితే 42 సంవత్సరాలు. సినిమా విడుదలైన రోజుల్లో సినిమా టాకీస్ల వద్దకు జనం పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారు. సినిమా టాకీసులన్నీ జాతర వాతావరణాన్ని తలపించేవి. హైదరాబాద్‌లో ఈ సినిమాకు అపూర్వమైన ఆదరణ లభించింది. దర్శకుడు గౌతమ్‌ఘోష్ మా భూమిని అత్యంత ప్రతిభావంతంగా, సృజనాత్మకంగా, ఒక దృశ్యకావ్యంలా చిత్రీకరించారు. ‘మా భూమి’ సినిమాలోని సన్నివేశాలు హైదరాబాద్‌లో చిత్రీకరణ... మా భూమి సినిమాను చాలా వరకు మొదక్ జిల్లా మంగళ్పర్తి, దొంతి గ్రామాల్లో , శివంపేట గడీలో చిత్రీకరించాము. విద్యుత్ సదుపాయం కూడా లేని ఆ రోజుల్లో పగటిపూటనే చీకటి వాతావరణాన్ని చిత్రీకరించి సినిమా షూటింగ్ చేశాం.రజాకార్ల దాడి , కమ్యూనిస్టుల పోరాటాలు వంటి కీలకమైన ఘట్టాలను చిత్రీకరించే సమయంలో కళాకారులకు దెబ్బలు కూడా తగిలేవి. గాయాలకు కట్టుకట్టేందుకు రోజుకు ఒక అయోడిన్ బాటిల్ చొప్పున వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో చాలా చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్ నగర సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా ఆఫ్జల్‌గంజ్‌లోని ఇరానీ హాటల్లో ఒక సన్నివేశాన్ని తీశాం. అలాగే కార్వాన్, జాహనుమా, జూబ్లీహాల్, వనస్థలిపురం, నయాఖిల్లా, సాలార్జంగ్ మ్యూజియం, కాలాగూడ, తదితర ప్రాంతాల్లో మా భూమి సినిమా తీశాం. కథానాయిక చంద్రి నివాసం, గుడిసెలు అంతా హైదరాబాద్‌లోనే సెట్టింగ్ వేశాం.ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభవం. అందరికీ ఒకే కిచెన్ ఉండేది. అందరం కలిసి ఒకే చోట భోజనాలు చేసేవాళ్లం. లారీల్లో ప్రయాణం చేసేవాళ్లం, ప్రజలు కళాకారులే... ఆ రోజుల్లో కేవలం రూ.5.40 లక్షలతో ఈ సినిమా పూర్తయింది. ఆర్టిస్టులకు రూ.300, రూ.500, రూ.1000 చొప్పున ఇచ్చాం.చాలా మంది స్వచ్చందంగా నటించారు. సగం మంది ఆర్టిస్టులు ఉంటే మిగతా సగం మంది ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలే. షూటింగ్ సందర్శన కోసం వచ్చిన వాళ్లే ఆర్టిస్టులయ్యారు. ఒకసారి 80 మంది గ్రామస్తులకు ఆ రోజు కూలి డబ్బులు మాత్రమే చెల్లించి సినిమా షూటింగ్లో భాగస్వాములను చేశాం.అప్పటి తెలంగాణ సమాజాన్ని, రజాకార్ల హింసను, పోలీసు చర్య పరిణామాలను ఈ సినిమా ఉన్నదున్నట్లుగా చూపించింది. ‘ అని వివరించారు. బండెనుక బండి కట్టి... ఈ సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్ పాడిన పాట అప్పటి నిజాం రాక్షస పాలన, జమీందార్ల దౌర్జన్యాలపైన ప్రజల తిరుగుబాటును కళ్లకు కట్టింది. ‘బండెనుక బండి కట్టి. పదహారు బండ్లు కట్టి.. నువు ఏ బండ్లె పోతవురో నైజాము సర్కరోడా....’ అంటూ గద్దర్ ఎలుగెత్తి పాడిన ఆ పాటు ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది. నిజాం నిరంకుశ పాలనపైన, దొరలు, జమీందార్ల పెత్తనంపైన ప్రజాగ్రహం పెల్లుబికేవిధంగా ఈ పాట స్ఫూర్తిని రగిలించింది. -
‘పుష్ప’ హీరో, డైరెక్టర్‌పై నోరుజారిన టీఆర్ఎస్ లీడర్, వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోయిన పుష్ప రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతటి ఘనవిజయం సాధించిన పుష్ప మూవీపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ ప్రవచన కర్త ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. హీరోను స్మగ్లర్‌గా చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటూ పుష్ప మూవీ డైరెక్టర్, హీరోని కడిగిపారేశారు. దీంతో గరికపాటి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప మూవీ టీఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ గాయకుడు సాయి చంద్ పుష్ప సినిమా డైరెక్టర్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ స్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అల్లరిని ఉద్దేశిస్తూ పుష్ప మూవీపై విరుచుకుపడ్డారు. ఆ పిల్లాడు చూడండి పుష్పలో హీరో అనుకుంటున్నాడు. అందులో హీరో అన్నట్లుగానే తగ్గేదే లే అన్నట్టుగా వాడి వ్యవహరం కనిపిస్తోంది. అంతేకాదు ఇలాంటి హౌళగాళ్లను హీరోలు పెట్టి తగ్గేదే లే అని డైలాగ్ చెప్పించినప్పటి నుంచి పిల్లలను ఆపుడు కష్టంగా మారిందంటూ పుష్ప మూవీ హీరో, డైరెక్టర్‌పై ఆయన దుర్భాషలాడారు. దీంతో ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. -
Erra Mallelu: తెలుగుతెరపై అరుణోదయం.. ఎర్ర మల్లెలు
ఎర్ర బావుటాను ఎగరేసిన హిట్ చిత్రాలెన్నో చరిత్రలో ఉన్నాయి కానీ, ట్రెండ్ సెట్టర్ ఏది? ఓ చిన్న విప్లవ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ సృష్టిస్తుందా? స్టేజ్ సాంగ్స్ సినిమాల్లోనూ సూపర్ హిట్టవుతాయా? వీటన్నిటికీ జవాబు – రెడ్ స్టార్ మాదాల రంగారావు నటించి, ధవళ సత్యం దర్శకత్వంలో నిర్మించిన ‘ఎర్రమల్లెలు’. ‘నాంపల్లి టేసను కాడి..’, ‘ఓ లగిజిగి లంబాడీ..’, ‘బంగారు మా తల్లీ...’ పాటలు!! 40 ఏళ్ళ క్రితం బాక్సాఫీస్ వద్ద ‘ఎ ర్రమల్లెలు’ పూచాయి. నేటికీ జనం గుండెల్లో విప్లవ సుగంధాలు వెదజల్లుతూనే ఉన్నాయి. వెండితెర అలా ఎరుపెక్కింది! తెలుగు సిన్మాకు 1980 – 81 కాలం ఓ కీలక మైలురాయి. ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ (’77)తో మొదలైన పూర్తి కమర్షియల్ ఫార్ములా చిత్రాల హవా సాగుతున్న సందర్భం అది. కానీ, ఆ కాలంలోనే ‘చలిచీమలు’ (’78), తెలంగాణ సాయుధ పోరాటంపై ‘మాభూమి’ (’79), అభ్యుదయచిత్రం ‘యువతరం కదిలింది’ (1980 ఆగస్ట్ 15), ఆ వెంటనే దేశంలోని నిరుద్యోగాన్ని ఎత్తిచూపుతూ బాలచందర్ ‘ఆకలిరాజ్యం’ (1981 జనవరి 9) వచ్చాయి. అన్నీ విజయం సాధించాయి. ‘గరీబీ హఠావో’ అన్నది వట్టి నినాదంగానే మిగిలిపోయి, జనం మనసుల్లో అసంతృప్తి పెరుగుతున్న కాలంలో వచ్చిన జనజీవన పోరాట చిత్రాలివి. లోలోపల కుతకుతలాడుతున్న జనం... వాస్తవ జీవితానికీ, తమలో పేరుకున్న అసంతృప్తికీ తెరపై వ్యక్తీకరణగా ఈ సినిమాలను చూశారు, ఆదరించారు. ఆ నేపథ్యంలో ‘ఎర్రమల్లెలు’ వచ్చింది. దర్శకుడు ధవళ సత్యం నిజానికి, తెలుగు తెరపై సినీ పెద్దలెందరో అంతకు ముందూ విప్లవ చైతన్యం కథలో అంతర్లీనంగా చెబుతూ వచ్చారు. కాకపోతే, కమర్షియల్ షుగర్ కోటింగ్‌లో చూపారు. అవేవీ నేరుగా ఎర్ర జెండాను ఎత్తిపట్టుకున్నవి కావు! కమ్యూనిస్టు పార్టీ చిహ్నాలతో మే డే పాటలు పెట్టినవీ కావు!! కానీ, ‘ఎర్రమల్లెలు’ నుంచి తెలుగుతెర కమర్షియల్ చట్రంలో ఉంటూనే అరుణారుణమయ్యే నేర్పు నేర్చింది. జనమూ లాల్‌సలామ్ కొట్టారు. విప్లవ పంథాకు ట్రేడ్ మార్క్‌గా... మాదాల తెలుగులో రెడ్ సినిమాల ట్రెండ్ సెట్టర్ అంటే కచ్చితంగా నటుడు, నిర్మాత మాదాల రంగారావే! ఆయన తీసిన సినిమాలన్నీ అలాంటివే! ‘‘...నా ఆశకు ఆశయం తోడై, జనాశయం చేయూతై వెండితెరను ఎరుపెక్కించాను. ఎరుపు విప్లవానికి చిహ్నం. సమసమాజమే విప్లవ లక్ష్యం. ఆ విప్లవమే నా ఊపిరిగా, నాలో ఊపిరున్నంత వరకు నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను...’’ అంటూ ‘ఎర్రమల్లెలు’ రిలీజు టైములోనే స్పష్టంగా ప్రకటించారు మాదాల. సమస్యలు, సెన్సార్ యుద్ధాలు ఎన్ని ఎదురైనా, మాదాల జీవితాంతం విప్లవభావాలకే కట్టుబడడం విశేషం. దటీజ్ కామ్రేడ్ మాదాల! ‘యువతరం’తో... కదలిక నిర్మాతగా మాదాల చేసిన తొలి ప్రయత్నం – ‘యువతరం కదిలింది’. కాలేజీ వాతావరణం, అందులోనే గ్రామీణ సమస్యలు, యువతరం ఆలోచనల్లో రావాల్సిన మార్పులు – ఇలా అనేక అంశాలను చర్చించిందీ సినిమా. మాదాల, రామకృష్ణ, సాయిచంద్, ప్రభాకరరెడ్డి తదితరులు నటించిన ఆ అభ్యుదయ చిత్రం సంచలన విజయం సాధించింది. 3 నందులు గెల్చింది. వామపక్షవాది – ప్రజానాట్యమండలిలో మాదాల మిత్రుడు ధవళ సత్యం అప్పటికే ‘జాతర’తో దర్శకుడై, మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రెండో సినిమాతో హిట్ సినిమా దర్శకుడనిపించుకున్నారు. దర్శకుడిగా ఆయనకు మూడో సినిమా ‘ఎర్రమల్లెలు’. నిజానికి, ‘యువతరం కదిలింది’ రిలీజై, సక్సెసయ్యాక ధవళ సత్యం, మాదాల రాజమండ్రిలో ఓ కమ్యూనిస్టు పార్టీ సభకు హాజరయ్యారు. ‘‘అక్కడే జనం మధ్య మాదాల ఉత్సాహంగా ‘ఎర్రమల్లెలు’ ప్రకటించారు. మద్రాసుకు తిరుగు ప్రయాణంలోని డిస్కషన్లలో మాదాల కథకు హంగులద్దా’’రు సత్యం. కార్మిక – కర్షక సమస్యల కథతో... తెల్లగా, స్వచ్ఛంగా ఉండే మల్లెలకు విప్లవ సూచకంగా ఎర్రదనమనే మాటను కలిపి, విరోధాభాసగా మార్చి, ‘ఎర్రమల్లెలు’ అనే వినూత్నమైన పేరు పెట్టడం ఓ ప్రయోగం. అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం. ఊళ్ళోని చదువురాని జనాన్ని పావులు చేసి ఆడుకొనే ముగ్గురు దుష్టులు. ఆ ఊళ్ళో చదువు చెప్పడానికి ఓ మాస్టారు వస్తారు. ఆయన వల్ల జనంలో చైతన్యం రగిలి, ఆ ముగ్గురు దుష్టులకు తోడున్న పక్క ఊరి ఫ్యాక్టరీ ఓనర్ కూడా ప్రజా విప్లవ జ్వాలల్లో భగ్గుమనడం ఈ చిత్రకథ. ఏకకాలంలో అటు గ్రామీణ సమస్యల్ని, ఇటు కార్మిక సమస్యల్ని చూపిన సినిమా ఇది. దెబ్బకు దెబ్బే మార్గమనే ఉగ్రవాది రంగా (మాదాల), ఆవేశంతో పాటు ఆలోచన కావాలనే కార్మిక నేత సూరి (మురళీమోహన్), మాస్టారు (నల్లూరి) లాంటి మంచి పాత్రలు, కొన్ని దుష్టపాత్రల మధ్య ఆలోచింపజేసేలా కథ సాగుతుంది. సిన్మాలాగా కాక ఒక ఉద్యమంలా, ఎక్కడో చూసినట్టుగా – వాస్తవంగా జరుగుతున్నట్టు అనిపించే పద్ధతిలో ఒంగోలు, టంగుటూరు పరిసర ప్రాంతాల్లో ధవళ సత్యం దీన్ని తీశారు. అదే ‘ఎర్రమల్లెలు’కు బలం. నరసాపురం నాటక రచయిత, ప్రజానాట్యమండలి ఎమ్జీ రామారావు రాసిన డైలాగ్స్ ప్లస్సయ్యాయి. ప్రజాగీతాలకు పట్టం సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రభంజనం నడుస్తున్న రోజులవి. 1981లో వచ్చిన తెలుగు చిత్రాల్లో మూడొం తులుకు ఆయనదే మ్యూజిక్. ఆ కమర్షియల్ కింగ్ ఈ విప్లవాత్మక ‘ఎర్రమల్లెలు’కు సంగీతం అందించడం ఓ విచిత్రం. ‘ఎర్రమల్లెలు’ పాటలు ఆ రోజుల్లో వీధి వీధినా మారుమోగాయి. ఎర్రజెండాలు, సుత్తి – కొడవలి చిహ్నాలతో కార్మిక దినోత్సవ గీతం ‘అన్యాయం అక్రమాలు..’ (రచన అదృష్టదీపక్) కార్మిక సంఘాలకు కొత్త ఉత్సాహమిచ్చింది. ఇప్పటికీ మే డే అంటే ఆ పాట తెలుగునాట ఊరూవాడా మోగుతుంటుంది. ‘ఓ లగిజిగి లంబాడీ...’, ‘బంగారు మా తల్లీ...’ పెద్ద హిట్టయ్యాయి. ప్రజానాట్యమండలి కళాకారుడిగా ప్రదర్శనలిచ్చిన రోజుల్లో ధవళ సత్యం రాసి, స్టేజీ పాడిన పాపులర్ గీతాలివి. మరో ప్రజానాట్యమండలి బిడ్డ ప్రభు రాసి, వేదికపై పాడే ‘నాంపల్లి...’ కూడా తెరకెక్కింది. సినీరంగానికొచ్చాక ధవళ సత్యం ఈ ‘నాంపల్లి..’, ‘బంగారు మాతల్లి...’ పాటల్ని సినిమాల్లో పెట్టుకోమని ఎందరినో అడిగారు. చివరకు తానే దర్శకుడయ్యాక వాడారు. మహామహులకు తెరంగేట్రం జంధ్యాల చిత్రాల్లో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న సుత్తి వీరభద్రరావుకూ, సీరియల్స్‌లో నేటికీ అలరిస్తున్న నటి శివపార్వతికీ ‘ఎర్రమల్లె’లే తెరంగేట్రం. ‘ఇదే అమెరికాలో అయితే...’ అనే లాయర్ పాత్ర వీరభద్రరావుకు మంచి పేరు తెచ్చింది. తర్వాతి కాలంలో దర్శకుడైన మాదాల మిత్రుడు టి. కృష్ణ తెరపై తొలిసారి కనిపించిందీ ‘ఎర్రమల్లె’లే. సినిమాలో పూర్తి నిడివి ఉండే పాలేరు పాత్ర కోసం కృష్ణ గడ్డం పెంచారు. గడ్డం గెటప్ బాగుందని అందరూ అనడంతో జీవితాంతం కంటిన్యూ చేశారు. సినీ విప్లవంలో... బాటసారులు ‘ఎర్రమల్లెలు’ వేసిన వెండితెర విప్లవమార్గం ఆ తర్వాత ఎందరెందరికో ఆదర్శమైంది. చివరకు హీరో కృష్ణ, మోహన్ బాబు, దర్శకుడు దాసరి లాంటి స్టార్లు కూడా ‘ఎన్కౌంటర్’, ‘అడవిలో అన్న’, ‘ఒసేయ్ రాములమ్మ’ (1997)తో ఈ దోవలోకి వచ్చి, సినిమాలు తీశారు. దాన్నిబట్టి ఇదెంత పెద్ద కమర్షియల్ ఫార్ములాగా వెలిగిందో అర్థం చేసుకోవచ్చు. మాదాల రెడ్ ఫిల్మ్స్ దశాబ్దం సాగితే, ఆయన మిత్రుడు టి.కృష్ణ లేడీ ఓరియంటేషన్తో మరింత ఎఫెక్టివ్‌గా ఇదే భావజాలం తెరపై చూపారు. దర్శకుడు వేజెళ్ళ సత్యనారాయణ ‘మరోమలుపు’ (’82) వగైరాతో వచ్చారు. పూర్తి ఎర్ర సిన్మాలు కాకున్నా, సామాజిక సమస్యలతో చర్చ రేపారు. ఈ పునాదుల్ని బలోపేతం చేసుకుంటూ ‘అర్ధరాత్రి స్వతంత్రం’ (1986)తో మొదలెట్టి ‘ఎర్రసైన్యం’ (1994)తో ఆర్. నారాయణమూర్తి ఏకంగా ‘పీపుల్స్ స్టార్’ అయ్యారు. ఇప్పటికి మూడున్నర దశాబ్దాలుగా అదే జెండా, ఎజెండాలను భుజానికెత్తుకొని, ఒంటరి పోరాటం చేస్తున్నారు. మిగతావారంతా ఆర్థిక ఆకర్షణతో అతిథులుగా వచ్చిపోయారు కానీ, అప్పుడు మాదాల – ఇప్పుడు నారాయణమూర్తి మాత్రం నిబద్ధతతో సమస్యాత్మక, విప్లవ పంథా చిత్రాలే తీయడం విశేషం. వీటన్నిటికీ ఊపునిచ్చింది కాబట్టే, ‘ఎర్రమల్లెలు’ ఇవాళ్టికీ ఓ చరిత్ర. మాదాల – ధవళ సత్యం బృందం అన్నట్టు, సమాజంలో ‘‘ఈ దోపిడీలు, ఈ దురంతాలు ఉన్నంతకాలం – ప్రతి మల్లియ మనసు ఎరుపెక్కుతుంది. ప్రతి రోజూ ఒక మేడే అవుతుంది!’’ రేపుల ఇమేజ్ నుంచి రెడ్ స్టార్‌గా.. ఒంగోలు దగ్గర భూస్వామ్య కుటుంబంలో పుట్టి, డాక్టర్ అవమంటే యాక్టరైన వ్యక్తి మాదాల రంగారావు. ఎన్జీ రంగాను ఇష్టపడే కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్టుల వైపు, కళల వైపు మొగ్గారాయన. గుంటూరు హిందూ కాలేజీ, ఒంగోలు సి.ఎస్.ఆర్. శర్మ కాలేజీ రోజుల్లోనే విద్యార్థి సంఘాలు, ప్రజానాట్యమండలి బృందాలతో దోస్తీ కట్టారు. ‘నల్లూరి అన్న’ శిక్షణలో రంగస్థలంపై పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. సోషియాలజీ చదివి, సినిమాల్లోకి వెళ్ళారు. ‘చైర్మన్ చలమయ్య’, ‘ఆడంబరాలు– అనుబంధాలు’ (1974), ‘బాబు’, ‘తీర్పు’ – ఇలా అనేక చిత్రాల్లో వేషాలు వేశారు. ‘ఎర్రమల్లెలు’లో... మాదాల ఎదురుదెబ్బలు తిన్నారు. నమ్మిన వామపక్ష భావాల్ని ప్రచారం చేస్తూ, తానే హీరోగా సినిమాలెందుకు నిర్మించకూడదని నిర్మాతయ్యారు. అలా తెలుగు సినిమాను అరుణ మార్గం పట్టించారు. ఆవేశం తెప్పించారు. అప్పట్లో ‘బంగారు చెల్లెలు’ (1979)లో శ్రీదేవిని రేప్ చేసే పాత్ర సహా, తెరపై పలుమార్లు రేపిస్టు పాత్రలేయడంతో కొందరు మాదాలను ‘రేపులరంగారావు’ అని గేలిచేశారు. కానీ అదే మాదాల వరుస విప్లవచిత్రాలతో విజయాలం దుకున్నాక ఆ ఇమేజే మారిపోయింది. ‘రేపుల రంగారావు’ అని వెక్కిరించిన నోళ్ళే ‘రెడ్ స్టార్’ అని ఆకాశానికెత్తాయి. బాక్సాఫీస్ మల్లెలు నిజాయతీ, నిబద్ధతతో తీసిన ‘ఎర్రమల్లెలు’కు జనం నీరాజనం పట్టారు. 23 కేంద్రాల్లో రిలీజై, 17 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం చేసుకుంది. ఆ జోరు కొనసాగి, విజయవాడ (రామా టాకీస్), గుంటూరు (శ్రీలక్ష్మీ), తిరుపతి (జయశ్యామ్) సహా ఏడెనిమిది కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. గత నలభై ఏళ్ళుగా తెలుగులో వస్తున్న రెడ్ ఫిల్మ్స్‌కు ట్రెండ్ సెట్టరైంది. తెలుగులో రిలీజైన వెంటనే ఈ చిత్రం తమిళంలోకి ‘సివప్పు మల్లి’ (1981 ఆగస్ట్ 15)గా రీమేకైంది. సంసారపక్ష సినిమాలు తీసే ప్రసిద్ధ ఏ.వి.ఎం. సంస్థ దీన్ని నిర్మించడం మరీ విశేషం. తిరుపతిలో సినిమా చూసిన తమిళ దర్శక, నిర్మాతలు రీమేక్‌లో కూడా మాదాలతోనే నటింపజేయాలనుకున్నారట. అయితే, అప్పటికే తదుపరి చిత్రం ‘విప్లవశంఖం’ (1982 ఏప్రిల్ 9)తో బిజీగా ఉన్న మాదాల చేయలేనన్నారట. చివరకు తమిళంలో హీరో విజయకాంత్, ముచ్చర్ల అరుణ నటించారు. తర్వాతి కాలంలో భక్తి చిత్రాలు తీసిన శతాధిక సినిమాల రామనారాయణన్ ఈ తమిళ విప్లవ రీమేక్‌కు దర్శకుడు! తమిళ రీమేక్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. అభ్యుదయంలో... ఆత్మీయ మిత్రులు ఒంగోలులో రెండున్నర దశాబ్దాలు నడిచిన ‘స్టూడెంట్స్ ఫెడరేషన్’ (ఎస్.ఎఫ్) మెస్, విద్యార్థి సంఘం ఏ.ఐ.ఎస్.ఎఫ్. కార్యకలాపాలు, ‘ప్రజానాట్యమండలి’ నల్లూరి వెంకటేశ్వర్లు అన్న మార్గదర్శనం... ఇవన్నీ ఎందరికో అభ్యుదయ పాఠశాల. మాదాల, దర్శకుడు టి. కృష్ణ (నేటి హీరో గోపీచంద్ తండ్రి) నుంచి ‘వందేమాతరం’ శ్రీనివాస్ దాకా ఎంతోమంది అక్కడ తయారైనవాళ్ళే! ‘‘కళ కళ కోసం కాదు... ప్రజల కోసం’’ అని నమ్మినవాళ్ళే! ఆచరించినవాళ్ళే!! కాలేజీ నుంచి మాదాల – టి. కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్. నిండైన విగ్రహం ఉన్న మాదాలను సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించింది కృష్ణే! మధ్యలో కొంతకాలం కృష్ణ వెనక్కి వచ్చేసి, ఒంగోలు పొగాకు వ్యాపారం చేసుకున్నారు. నల్లూరి, కె. రాధాకృష్ణ, ..., యు.విశ్వేశ్వరరావు, మాదాల, ..., ..., టి. కృష్ణ మాదాల మద్రాసులోనే చావో రేవో అని కూర్చున్నారు. మాదాల నిర్మాత అయినప్పడు మద్రాసు వచ్చి తొలి (‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’) చిత్రాలకు సాయంగా నిలిచిందీ కృష్ణే. తర్వాతి కాలంలో స్క్రిప్టులో మార్పులపై మాట వినని మాదాలతో విభేదించి, కృష్ణ తానే దర్శకుడయ్యారు. ఆత్మీయ ‘రంగన్న’కు దీటుగా ఎదిగారు. మాదాల ‘ప్రజాశక్తి’, ‘స్వరాజ్యం’, ‘జనం– మనం’, ‘ఎర్రమట్టి’ – ఇలా 7 చిత్రాలు నిర్మించారు. 36 ఏళ్ళే జీవించిన టి.కృష్ణ దర్శకుడిగా తీసినవీ ఏడే ఫిల్మ్స్. కలసి ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు మిత్రుల జీవితంలో గమ్మతై ్తన పోలిక ఇది. ఆ పాట... శైలజకు టర్నింగ్ పాయింట్! అప్పుడప్పుడే గాయనిగా పైకి వస్తున్న ఎస్పీబీ చెల్లెలు ఎస్పీ శైలజకు ఈ ‘ఎర్రమల్లెలు’ టర్నింగ్ పాయింట్. ఈ సినిమాలో ఆమె పాడిన ‘నాంపల్లి టేసను కాడి..’ మోత మోగిపోయింది. ఆమె కెరీర్‌కు ఈ పాట పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఎన్నో ప్రైవేట్ అవార్డులను తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఎక్కడ సంగీత విభావరి జరిగినా, ఆమె ఈ పాట పాడాల్సిందే! ఈ పాటకు మాదాల కుమారుడు – నేటి నటుడు డాక్టర్ మాదాల రవి నటించడం విశేషం. బాలనటుడిగా అదే అతనికి తెరంగేట్రం. ఆపై ‘స్వరాజ్యం’(1983)లో ఫుల్ లెన్త్ రోల్లో రవి నటించారు. ‘‘నటనలోకి వస్తానని అనుకోలేదు. ‘ఎర్రమల్లెలు’ టైమ్‌కి ఏడో తరగతి చదువుతున్నా. రికార్డయిన పాటల్ని ఇంట్లో పదే పదే వింటూ, ఓ రోజు ‘నాంపల్లి...’ పాటకు హుషారుగా డ్యా¯Œ ్స చేస్తున్నా. నాన్న గారు అది చూసి, ఆ పాట నా మీదే తీశారు. డ్యా¯Œ ్స మాస్టర్ కూడా లేని ఈ పాటను ఒకే రోజున ఉదయం 8కి మొదలుపెట్టి సాయంత్రం 4 కల్లా చిత్రీకరించారు’’ అని రవి చెప్పారు. ఒంగోలులో రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఈ పాట తీశారు. ఆ పాట చిత్రీకరణలో ధవళ సత్యం వెంట టి. కృష్ణ, బి. గోపాల్ లాంటి నేటి ప్రముఖులెందరో ఉన్నారు. ఆ పాట ఎంత ట్రెండ్సెట్టరంటే– తర్వాత వచ్చిన అభ్యుదయ, విప్లవ సిన్మాలన్నిట్లో ఇలాంటి సోషియో – పొలిటికల్ సెటైర్ సాంగ్స్ వచ్చాయి. ‘నేటిభారతం’(1983)లోని ‘అత్తో పోదాం రావే సర్కారు దవాఖానకు...’, ‘రేపటి పౌరులు’(1986)లోని ‘అయ్యా నే సదివి బాగుపడతా..’ లాంటి పాటలే అందుకు సాక్ష్యం! – రెంటాల జయదేవ -
36 ఏళ్ల తరువాత మెగాస్టార్‌తో..!
ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏదో విధంగా వార్తల్లో నిలిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది. దాదాపు 36 ఏళ్ల తరువాత ఓ టాలీవుడ్ సీనియర్ నటుడు ఈ సినిమాలో మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇటీవల ఫిదా సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ యాక్టర్ సాయిచంద్. 80లలో పలు చిత్రాల్లో నటించిన సాయి చంద్ తరువాత నటనకు దూరమయ్యారు. రీఎంట్రీలో మాత్రం ఆసక్తికర సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా సైరాలో నరసింహారెడ్డి ముఖ్య అనుచరుడిగా చిరుతో కలిసి నటిస్తున్నారు సాయి చంద్. 36 ఏళ్ల కిందట మంచు పల్లకి సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. తిరిగే ఇన్నేళ్ల తరువాత మెగాస్టార్‌తో కలిసి నటిస్తుండటంపై సాయిచంద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఫిదా సక్సెస్‌మీట్‌లో నటుడి భావోద్వేగం
హైదరాబాద్: మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన మూవీ ‘ఫిదా’. ఈ నెల 21న విడుదలైన మూవీ సక్సెస్ మీట్‌ను గురువారం నిర్వహించారు. ఈ మూవీ భానుమతి పాత్రతో ఆకట్టుకున్న సాయి పల్లవి తర్వాత అందరి చర్చించుకుంటున్నది ఆమె తండ్రి పాత్రలో మెప్పింపిన సీనియర్ నటుడు సాయి చంద్ గురించే. ఈవెంట్లో సాయి చంద్ మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటూనే భావోద్వేగానికి లోనయ్యారు. ఇండస్ట్రీలో తమ ఫ్యామిలీది తొలితరమని, ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ముందుగానే తన తండ్రి కొన్ని మూవీల్లో నటించారని గుర్తుచేసుకున్నారు. తాను 'మా భూమి'తో వెండితెరకు పరిచయమై ఎన్నో సినిమాల్లో నటించినా గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు. చాలా కాలం తర్వాత నటించినప్పటికీ ఫిదాలో సాయి పల్లవి తండ్రి పాత్రకు మంచి గుర్తింపు దక్కిందన్నారు. విదేశాల నుంచి కూడా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు తనకు ఫోన్ చేసి మీరు బాగా నటించారని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిదాలో మిమ్మల్ని చూస్తున్నంతసేపు మా నాన్నే గుర్తొచ్చారని ఫోన్ చేసిన వాళ్లలో ఎక్కువ మంది చెప్పారన్నారు. అయితే నిజ జీవితంలో తనకు అసలు పెళ్లికాలేదని, పిల్లలే లేరని చెప్పిన సాయి చంద్.. తన పాత్రకు గుర్తింపునిస్తూ తండ్రిగా తనను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని ప్రొడక్షన్లలో పనిచేయలేదన్న బాధ ఈ మూవీలో నటించడంతో తీరిందన్నారు. సంబంధిత కథనం ‘దిల్ రాజును చూస్తే ఈర్ష్యగా ఉంది’