ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోయిన పుష్ప రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతటి ఘనవిజయం సాధించిన పుష్ప మూవీపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి.
ఇప్పటికే ప్రముఖ ప్రవచన కర్త ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. హీరోను స్మగ్లర్‌గా చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటూ పుష్ప మూవీ డైరెక్టర్, హీరోని కడిగిపారేశారు. దీంతో గరికపాటి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప మూవీ టీఆర్‌ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ టీఆర్‌ఎస్ నాయకుడు, తెలంగాణ గాయకుడు సాయి చంద్ పుష్ప సినిమా డైరెక్టర్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ స్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అల్లరిని ఉద్దేశిస్తూ పుష్ప మూవీపై విరుచుకుపడ్డారు. ఆ పిల్లాడు చూడండి పుష్పలో హీరో అనుకుంటున్నాడు. అందులో హీరో అన్నట్లుగానే తగ్గేదే లే అన్నట్టుగా వాడి వ్యవహరం కనిపిస్తోంది. అంతేకాదు ఇలాంటి హౌళగాళ్లను హీరోలు పెట్టి తగ్గేదే లే అని డైలాగ్ చెప్పించినప్పటి నుంచి పిల్లలను ఆపుడు కష్టంగా మారిందంటూ పుష్ప మూవీ హీరో, డైరెక్టర్‌పై ఆయన దుర్భాషలాడారు. దీంతో ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment