Australian Cricketer David Warner Recreates Scene Of 'Pushpa Movie', Video Viral - Sakshi
Sakshi News home page

David Warner: 'వార్నర్‌ సార్‌.. భారత పౌరసత్వం తీసుకోండి'..

Dec 31 2021 9:02 AM | Updated on Dec 31 2021 11:57 AM

Australian Cricketer David Warner Recreates Scene Of Pushpa, Video Viral - Sakshi

Australian Cricketer David Warner Recreates Scene Of Pushpa, Video Viral: ఆస్టేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికే బుట్టబొమ్మ సాంగ్‌తో యావత్‌ తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరైన వార్నర్‌ తాజాగా మరోసారి పుష్పరాజ్‌ అవతారం ఎత్తాడు. ఇప్పటికే ఈ సినిమాలోన 'యే బిడ్డా.. ఇది నా అడ్డా' అనే పాటను ఇమిటేట్ చేసిన వార్నర్ ఇప్పుడు మరోసారి అల్లుఅర్జున్‌ డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నాడు.

పుష్పలోని ఫేమస్‌ డైలాగ్‌ 'పుష్ప..పుష్పరాజ్‌నీ యవ్వ తగ్గేదె లే' అంటూ తనదైన స్టైల్‌లో డైలాగ్‌ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఇక డేవిడ్‌ వార్నర్‌కు ఇండియన్‌ సిటిజన్‌ అవసరం అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా..దీనికి నేను ఏం చేయాలి అంటూ డేవిడ్‌ రిప్లై ఇవ్వడం విశేషం.

ప్రస్తుతం డేవిడ్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. దీనిపై అల్లు అర్జున్‌ సైతం స్పందిస్తూ.. 'వార్నర్‌.. డేవిడ్‌ వార్నర్‌ నీ యవ్వ తగ్గేదే లే' అంటూ ప్రశంసలు కురిపించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement